Skip to Content

మై డియర్ ఫ్రెండ్..

20 July 2024 by
Sajeeva Vahini
  • Author: Asher
  • Category: Youth
  • Reference: Best Collections

ఈ కథలోని తండ్రి తలపించేది మరేవర్నో కాదు. మన యేసయ్యనే.

ఆయన తన ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమిస్తూ తన వెలలేని ఆస్తిగా భావిస్తున్న మనలను అగాధలోయల్లాంటి శ్రమల్లో, శోధనల్లో విడిచిపెట్టేసి కునికేవాడు ఎంత మాత్రమూ కాదు. మనం/మనల్ని ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ ఏదో ఒక సమయంలో వారికి ఎంత ప్రేమ ఉన్నప్పటికీ శక్తి లేకనో, చాలకనో చివరకు వదిలిపెట్టేయ్యవచ్చు. కానీ, సర్వశక్తిమంతుడైన దేవుడు మన చేయి ఎన్నడునూ విడువడు, ఎదబాయాడు. మనలను రక్షింపనేరకయుండునట్లు ఆయన హస్తమేమీ కురచకాలేదు. రెండు వేల సంవత్సరాల క్రితం మనల్ని మన పాప, శాపాల నుండి విడిపించి శాశ్వత జీవాన్ని ఇచ్చేందుకు, తన మహిమ సింహసనాన్నీ, పరలోకాన్నీ విడిచి ధీనుడై మన శిక్షనంతా తానూ మోసి తన ప్రాణాన్ని చివరి రక్త బిందువు వరకు పెట్టేసాడు - మనల్ని నా కుమారుడా.. నా కుమారుడా అంటూ దినమెల్ల చేతులు చాపే మన పరలోకపు తండ్రి.


Share this post