Skip to Content

అంతం - its not an end

20 July 2024 by
Sajeeva Vahini
  • Author: Rani Pradeepa G
  • Category: Youth
  • Reference: Sajeeva Vahini Feb - Mar 2011 Vol 1 - Issue 3

నేను ఒక పెద్ద doctor అవ్వాలి లేక engineer అవ్వాలి. నేను బాగా డబ్బులు సంపాదించి పెద్ద ఇల్లు కట్టుకొని మంచి car కొనుక్కోవాలి, exact ఇవే కాకపోయినా ఏదో ఒక రోజు ఏదో ఒకటి కొనుక్కోవాలి, కొనివ్వాలి లేదా ఎక్కడికైనా వెళ్ళాలి, ఉండాలి. ఇలా చిన్నదో పెద్దదో ఏదో ఒక ఆశ ఎంత వద్దన్నా ఎంత ఆపుకున్నా తప్పకుండ మనసులో పుడుతూనే ఉంటుంది.  

ఈ జీవితం క్షణబంగురమే, అని message చెప్పిన pastor అంకులే, వెంటనే next Sunday కాదు కాదు, every sunday youth meeting కి మీరు తప్పకుండ రావాలి అంటారు. సరే ఇదంతా theory అనుకుంటే కూడా, నీ కళ్ళ ముందే, నీకు తెలిసిన వాళ్ళే life ని సగం లో వదిలేసి పోతున్నారు, అయినా కూడా నీ  future planing అనేది అసలు ఆగదు.  

  ఎందుకంటావ్? 

దేవుడు మొత్తం సృష్టిని తన మాటతో create చేసినా నిన్ను మాత్రం తన చేతితో, తన రూపం లో, తన జీవ వాయువు వూది (ఆది 2:7), అంత interesting గ  చేసినప్పుడు,  టుపుక్కున రాలిపోడానికి చేస్తాడా, కాదు కదా? దేవుడు నువ్వు ఎప్పటికి ఉండిపోవాలనే create చేసాడు. నీ heart లో  eternity ని ఉంచింది కూడా ఆయనే (ప్రసంగి 3:11). అందుకే నువ్వు అలా అలోచిస్తావ్.   

మరీ ఈ చనిపోవడం ఏంటి ? 

ఈ earth మీద నీ life అనేది ఒక చిన్న test period లాంటిది. నువ్వు చనిపోగానే “the end పడదు. అక్కడితో నువ్వు అయిపోవు. నీ చావు కి అటు వైపు నువ్వు శాశ్వతంగా ఉండిపోతావు. నీ ఈ physical life అంతం, నీ అంతం కాదు.   

భూమిపైన ఈ జీవితం నీకు చాలా choices ఇస్తుంది కాని నీ eternity లో మాత్రం రెండే options ఉంటాయి a) heaven b) hell. sad thing ఏంటంటే, “none of the above” “all the above” లాంటి options ఉండవు. కాని happy thing ఏంటంటే నీకు a కావాలా b కావాలా choose చేసుకోటానికి ఇప్పుడు కూడా chance ఉంది . ఇక్కడ దేవునితో నీ relationship ఏంటో, అదే నీ eternity లో నీ place decide చేస్తుంది. 

అయితే 2 types ఉంటారు: 

దేవునితో వాళ్ళు: నీ ఇష్టమే జరగనీ దేవా అని చెప్పేవాళ్ళు  

వాళ్ళతో దేవుడు : ok ఇంక నీ ఇష్టం కానివ్వు అని, వదిలేసిన వాళ్ళు. 

నువ్వైతే కచ్చితంగా first type ఎ  అయి ఉండాలి. option a choose చేసుకున్నావ్  కదామరి  (1 యోహాను 2:17) 

నువ్వు పోయాక కూడా నీ పేరు నిలిచిపోయేలా బతకాలి అంటారు. కేవలం నీ పేరు శాశ్వతంగా నిలిచిపోటాని కే బతికితే, నువ్వు శాశ్వతలోకం లోకి వెళ్లవు అదే heaven కి. 

నీ పేరు మాత్రమే నిలిచిపోతే చాలా, ఇంక అంతేనా? నీవే ఆలోచించుకో, decision నీదే. 


Share this post