Skip to Content

తలాంతుల పరిచర్య

20 July 2024 by
Sajeeva Vahini
  • Author:
  • Category: Women
  • Reference: Sajeeva Vahini

వ్యక్తిగత ప్రజ్ఞ లేక మేథాసంపత్తి దేవుని అనుగ్రహం.

ప్రతివారిలోనూ ప్రతిభ ఉంటుంది.

ప్రతిభ ద్వారా సామర్ధ్యం కలుగుతుంది.

సామర్ధ్యం అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని గొప్ప పనులు చేస్తుంది.


కళలైనా, చదువులైనా, మరే పనులైనా సాధనతో సఫలమవుతాయి.

ఈ ఈవులన్నింటిని తలాంతులు లేక వరములు అంటాము.

అయితే దేవుడు తన కృప కొరకు కనిపెట్టి ప్రార్ధించే వారికి మరిన్ని ప్రత్యేకమైన వరములు అనగా కృపావరములు ఇస్తాడు.

- తనకున్న తలాంతులను పది మందికి పంచిన స్త్రీ దొర్కా. “లేడి” అని ఈ పేరునకు అర్ధం. చురుకైనదిగా కనబడుతుంది. స్త్రీలందరిలో ఈమె ఒక్కతే “శిశ్యురాలు” అనబడింది. ఆమెకున్న ఒనరులు సూది, దారం. వీటితో దొర్కా అంగీలు, వస్త్రాలు కుట్టి అనేకులకు సహాయపడి ఘనతనొందింది.

సత్క్రియలయందు ఆశక్తిగల ప్రజలను తనకోసం పవిత్రపరచుకొని ప్రభువు తన సోత్తుగా చేసుకుంటాడు. తనకున్న అతి అల్పమైన వనరులతో తలాంతులను వినియోగించి దీనజనులకు పంచిన దొర్కా మనకు గొప్ప ప్రేరణగా నిలుస్తుంది.

కృపావరములు నానా విధములు, అలాగే పరిచర్యలు కూడా నానావిధములని బైబిల్ సెలవిస్తోంది. వాటిని పాతిపెట్టక, వినియోగిస్తూ ఉండాలి.

వివేచనా అనే వరాన్నివాడినట్లయితే, మన స్వంత కుటుంబాన్నేకాక సంఘాన్ని, సమాజాన్ని కూడా అభివృధిపదంలో నడిపించవచ్చు.

"తలాంతులను దాచిపెట్టి తీసుకునే విశ్రాంతి చావుతో సమానం" అని పెద్దలు అంటారు.

తలాంతులను వాడిన దోర్కా ఎంత ధన్యురాలు!

ఒకరికి ఇవ్వబడిన తలాంతులు మరొకరికి ఇవ్వబడకపోవచ్చు. మనకున్నవాటిని వెలికితీద్దాం, మెరుగుపర్చుకుంద్దాం, ఉపయోగిద్దాం.


Share this post