Skip to Content

సృష్టిలో మొదటి స్త్రీ

20 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mercy Ratna Bai Shadrach
  • Category: Women
  • Reference: Bible Women

“సృష్టిలో మొదటి స్త్రీ హవ్వ” దేవుడు సర్వసృష్టిని ఏంతో సుందరంగా సృజించిన ఆ చేతులతోనే హవ్వను కూడా నిర్మించాడు. గనుక ఆమె మిక్కిలి సౌందర్యవతి అనుకోవడంలో ఎత్తి సందేహము ఉండరాదు. ఈ స్త్రీ నేటి స్త్రీవలె తల్లి గర్బమునుండి సృజింపబడక పురుషుని పక్కటెముక నుండి నిర్మించబడి, హృదయానికి సమీపస్తురాలుగా వుండటానికి నిర్మితమైనది (ఆది 1:27,28)

ఈ స్త్రీతోనే వివాహ వ్యవస్థ ప్రారంభమై, దైవ సహవాసంగల క్రైస్తవ కుటుంబాలకు పునాది వేయబడింది. హవ్వ మరియు ఆమె భర్త ఆడాములతోనే గృహస్త జీవితం ఏర్పడింది. దేవుడైన యెహోవా తూర్పున ఎదేనులో ఒక తోట వేసి, తాను నిర్మించిన నరుని ఆ తోటలో ఉంచెను. (ఆది 2:8) సుఖజీవానికి అనువైన ఎన్నో వనరులు ఆ వనంలో ఉంచాడు. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు, ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యన జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినుచ్చు వృక్షములను నేల నుండి మోలిపించెను. (ఆది 2:9).

దేవుడు వారికి విధించిన కట్టడను, ఆజ్ఞను, అతిక్రముంచడానికి నాంది పలికింది కూడా ఆనాటి స్త్రీయే. సాతాను హవ్వచే దైవాజ్ఞను అతిక్రమింపజేయడానికి ఎన్నో ప్రేరణలను కలిగించింది. ఇది నిజమా ఈ తోటలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? (ఆది 3:1) అంటూ ఆజ్ఞను తిరస్కరించితలో గల అనర్ధాన్ని బోధించకుండా దానిలోని ఆనందాన్ని వర్ణించింది గనుక హవ్వ శోధనకు సుళువుగా లొంగిపోయింది. ఇలా శోదించడమే అపవాదు నిజము (యోబు 1:7, I పేతురు 5:8, మత్తయి 4:1-14, I యోహాను 2:16) నిషేధించిన ఫలాన్ని తాని తిని భార్తకు కూడా ఇచ్చి భర్త పాపము చేయడానికి కూడా కారకురాలైంది. తానూ పాపము చేసి మరొకరిని నిందించే పరిస్థితి తెచ్చుకొనింది (ఆది 3:13) అప్పటి వరకూ సుఖసంతోషాలతో వర్ధిల్లుతున్న వారి కాపురం శరీరాశ, నేత్రాశ జీవపుడంభము అనే వాటి ద్వారా (I యోహాను 2: 15-17) పాపానికిలోనై, శాపగ్రస్తమైన ఏదేను తోటనుండి బహిష్కరింపబడి వేదనలకు గురైంది. ప్రసవ వేదన, స్త్రీజాతి కన్తతికిని సంక్రమించింది. “నీవు వేదనతో పిల్లలను కందువు.” అని వుంది వాక్యంలో.

వీటన్నిటికీ మూలకారణం ఆజ్ఞాతిక్రమమే. ఏది ఎలా వున్నా స్త్రీ ద్వారానే లోకములోనికి పాపము ప్రవేశించింది మరల, స్త్రీ గర్బమునుండే పరిశుద్ధాత్మ ద్వారా లోకరక్షకుడు ఉద్భవించి మన పాపములకై మరణించి మనలను విమోచించినాడు. అందుకే మనస్థత్వ శాస్త్రవేత్తలకు కూడా ఆడదానికి అణుశక్తికి దగ్గర సంబంధముందంటున్నారు. ఆరంగుళాల నాల్కతో ఆరడుగుల పొడవున్న పురుషుని కూడా తృటిలో మోసపుచ్చగలదని వక్కాణిస్తున్నారు. దేవునికినీ, స్త్రీకనిన సంతానానికినీ మధ్య వైరం కలుగాజేయడానికి అపవాది పొంచియుంటాడు గనుక శోధనలో పడకుండా దుష్టుని నిండి తప్పించుకోవడానికి ప్రతీ స్త్రీ ప్రార్థన అనే ఆయుధం చేపట్టాలి.


Share this post