Skip to Content

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 7వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో శ్రమానుభవములు 7 వ రోజు:

Audio: https://youtu.be/-8-C7GDJvgE

నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయకారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ - 1 కొరింథీయులకు 9:16

క్రీస్తును విశ్వసించిన ప్రతి క్రైస్తవుని లక్ష్యం సువార్త ప్రకటించడం. మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్పబడినరీతిగా ఎక్కడైతే సువార్త ప్రకటించబడలేదో ఆ ప్రాంతాలకు వెళ్లి క్రీస్తు సువార్తను ప్రకటించాలి. క్రీస్తు ఈ లోకంలో జీవించినంత కాలం శ్రమపడిన ఉద్దేశం అందరూ అంతటా రక్షించబడాలనే కదా!

క్రీస్తు ఉద్దేశాలను తెలుసుకున్న మనం సువార్త భారం కలిగియుండడం క్రీస్తుతో కలిసి శ్రమను పంచుకోవడమే.

యేసు క్రీస్తును పరిపూర్ణంగా విశ్వసించిన మనం యేసుక్రీస్తు సువార్త భారం నాదే అని గ్రహించాలి. మన వ్యక్తిగత సాక్ష్యం అనగా దేవుడు మన జీవితములో చేసిన గొప్ప కార్యములను ఇతరులతో పంచుకుంటూ అనేకులను క్రీస్తువైపు నడిపించాలనే ఉద్దేశం కలిగియుండడమే క్రీస్తు శ్రమానుభవములలో పాలుపంపులు కలిగియుండడం.

* నశించిపోయే ఆత్మలకొరకు ప్రయాసపడాలి.

* మనము చేయగలిగిన రీతిలో మన స్నేహితులతో, సన్నిహితులతో సువార్తను పంచుకోవాలి.

* అనేకులకు క్రీస్తు ప్రేమను తెలియజేయాలనే ఆశ కలిగియుండాలి.

* ఈ లోకమును విడిచి వెళ్ళేలోపు కనీసం ఒక్కరినైనా క్రీస్తు వైపు నడిపించాలనే భారం ఉండాలి.

ఈ విధమైన ఆలోచనలు కలిగి యుండడమే క్రీస్తుతో శ్రమానుభవము.

అనుభవం : నశించిపోయే ఆత్మలను రక్షించాలనే భారం... "క్రీస్తుతో శ్రమానుభవం".


Experience the Suffering with Christ - 7th Experience

https://youtu.be/snRetTekxic

Yet when I preach the gospel, I cannot boast, for I am compelled to preach. Woe to me if I do not preach the gospel! - 1 Corinthians 9:16.

The goal of every Christian who believes in Christ is to proclaim the gospel.

You must visit all the places where the gospel has not been preached and proclaim the gospel of Christ, as Jesus said to his disciples, Mat 16:15 "Go into all the world and preach the gospel to all creation”.

Christ lived in this world in suffering, the purpose of His sufferings is to save His people!

Knowing these intentions of Christ, we hold up the burden of gospel to share the hardships with Christ.

We who believe in Jesus Christ must realize that the burden of the gospel of Jesus Christ is ours. When we share our testimony with others about the great works that God has done in our lives. We can lead many to Christ by sharing the experiences of sufferings with Christ.

* We must Strive for perishing souls.

* We must share the gospel with our friends and relatives in the possible way.

* Must proclaim the love of Christ to many.

* We must have the pain to save at least one soul to Christ before leaving this world.

Having such thoughts are nothing but the experiences of suffering with Jesus Christ.

Experience: The burden for perishing souls is nothing but experiencing Suffering with Jesus Christ.

Share this post