Skip to Content

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 40వ అనుభవం

6 August 2024 by
Sajeeva Vahini
  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 40వ అనుభవం:


మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను. ప్రకటన 2:10

సుమారు దశాబ్ధ కాలంనుండి జరుగుతున్న మార్పులు సామాన్య జీవనం నుండి ఆధునికత నేపథ్యంలో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పరిధులులేని మానవుని జీవనశైలిలో కలిగే మార్పులను నిదానించి గమనిస్తే ఇహలోక సంబంధమైన వాటి విషయంలో మనిషి లోతుగా కూరుకుపోయాడని అర్థమవుతుంది. కారణం? ఆత్మీయ విషయాలలో బలహీనతేనని నా అభిప్రాయం.

క్రీస్తును నామకార్థంగా విశ్వసిస్తే ఎటువంటి ప్రయోజనం లేదు. సిలువలోని క్రీస్తు త్యాగం..సిలువ మేకులపై అంటిన రక్తపు మరకలే సాక్ష్యం. సిలువలో క్రీస్తు పొందిన ప్రతి శ్రమ "నా కొరకే" అనే ఆలోచన మనిషి జీవిత కొలతల్నే మార్చేస్తుంది. సిలువపై క్రీస్తు శ్రమను పరికించి చూస్తే భవితవ్యం కనిపిస్తుంది.

అనుదిన జీవన శైలిలో ప్రార్థనకు మనమిచ్చే ప్రాధాన్యత మన ఆధ్యాత్మిక జీవితపు లోతును తెలియజేస్తుంది. లౌకిక జీవితంలో ఆత్మీయ విషయాలకు సమయం కేటాయించలేనప్పుడు, వీటి పరిణామం... రోజువారి జీవితం బలహీనపడి సమతుల్యత కోల్పోతుంది. దీనిని సుళువుగా ఎదుర్కొనగలిగే క్రైస్తవుని జీవనశైలి ఆధ్యాత్మికతతో పరుగెత్తాలంటే దైనందిక జీవిత పునాదుల్లో లోతైన విశ్వాస అనుభవం కలిగియుండాలి. ప్రార్ధనతో అధిగమించగలిగే విశ్వాసి స్పందన నేడు అవసరం అనివార్యం.

క్రీస్తుతో అనుదినం మనం పొందగలిగే శ్రమానుభవాల రేఖలు సాధారణ జీవితంలో కొత్త వెలుగులు చిమ్మే విజయ మార్గాలు. ఈ అనుభవం రాకడ కొరకైన సిద్ధపాటులో నిరీక్షణ కలుగజేస్తుంది. ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై మధ్యాకాశములో క్రీస్తును ఎదుర్కొనే కృపను కలుగజేసి పరలోకరాజ్యాన్ని ప్రవేశించే భాగ్యాన్నిస్తుంది. ఎటువంటి శ్రమలనైనా ఎదుర్కొని మరణం వరకు నమ్మకంగా జీవించే జీవిత సాఫల్యమే నిత్యరాజ్యంలో జీవ కిరీటం. ఇట్టి ధన్యత ప్రభువు మనందరికి దయజేయును గాక. ఆమేన్ఆమేన్ఆమేన్.

అనుభవం: నిత్యజీవం కొరకై క్రీస్తుతో శ్రమానుభవం, నిత్యరాజ్యంలో జీవకిరీటం.

https://youtu.be/EAiOC7w9aHI

Experience the Suffering with Christ 40th Experience:

The changes that have taken place over nearly a decade have become increasingly common in the face of modernity. Observing the changes in the lifestyle of an unmanageable human being means that man is deeply involved in worldly affairs. The reason? My point is that we are weak in spirituality and spiritual things.

There is no benefit in believing Christ for namesake. The bloodstain on the cross is the evidence. Every thought that Christ-s sacrifice on the cross when we say it is "for my sake" transforms man-s dimensions of life. If we observe the suffering of Christ on the cross, it gives us a clear picture of our future actions.

Our emphasis on prayer in our life reveals the depth of our spiritual life. If we cannot devote time to spiritual things in our worldly life, the consequence of this is that our daily life is weakened and lost in the balance. The lifestyle of a Christian who can easily cope with this is to have a profound faith in the foundations of spirituality in everyday life. The believer-s response, which can be overcome with prayer, is indispensable today.


The experience that we obtain with Christ is the new way of giving light to ordinary life. This experience gives hope to prepare for the second coming. This hope sets the stage for the grace of entry into the kingdom of heaven, through the steadfastness and stability to meet Christ in the mid sky. The crown of life in the eternal kingdom, which is the achievement of living a life of faithfulness in hardships until death. May the Lord give such grace to all of us. Amen. Amen. Amen.

Experience: Experience of Suffering with Christ for eternity is crown of life in eternal kingdom

https://youtu.be/eeyrJd3zoBQ

Share this post