Skip to Content

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 38వ అనుభవం

6 August 2024 by
Sajeeva Vahini
  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 38వ అనుభవం:

ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. 1 పేతురు 5:4

మనిషి తమ జీవితాల్లో బంధీయైన కలలను త్వరితంగా ఋజువు చేసుకోవాలని అడుగులు ముందుకు వేస్తుంటే, మృత్యువు ఒడిలోకి పడద్రోయాలని, ఆధునిక మాధ్యమాలతో అపవాది అనుదినం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ ఆధునికత మనిషిని సమాజంలో ఒంటరితనానికి గురి చేసిందని నా ఆలోచన.

ఇదిలాఉంటే, జీవన వ్యవస్థలో ఎన్ని వైరుధ్యాలున్నా క్రైస్తవ విశ్వాసంలో ఎటువంటి మార్పులు ఉండకూడదని నా అభిప్రాయం. ఈ వ్యవస్థను సరి చేయాలంటే క్రైస్తవ విశ్వాస క్రమశిక్షణలో రూపావళి మార్పు కావలి. అటు దైనందిక జీవితాన్ని ఇటు ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుని వాక్యంతో సంతులనం చేయగలిగితే ఒంటరితనాన్ని అధిగమించడమే కాకుండా వ్యవస్థల్లో ఎన్ని మార్పులు కలిగినా ఎదుర్కోగల శక్తిని పొందుకోగలం. మన వ్యక్తిగత వ్యూహాలు ఆధ్యాత్మిక స్థితిగతుల వైపుంటే, సామాజిక సంఘ వ్యవస్థలో క్రొత్త ధోరణి చూడగలం.

నేనంటాను, సమాజానికి సంఘం కేంద్రబిందువుగా ఉండగలిగితే, ఆ సంఘంలో ఆత్మీయ కుటుంబాన్ని మనం ప్రార్ధనతో కట్టుకోగలిగితేనే, దైనందిక ఆధ్యాత్మిక జీవితాల్లో నిరుపమాన మార్పులు చూడగలం. అనుదినం క్రీస్తుతో శ్రమానుభవాలు కలిగి జీవిస్తున్న జీవితం చివరకు రెప్పపాటులో కలిగే క్రీస్తు రాకడలో మార్పు పొందగలదు. సంపూర్ణ సమర్పణా సిద్ధమనసుతో ఈ అనుభవాలగుండా మనం ప్రయాణిస్తూ క్రీస్తును ఎదుర్కొన్నప్పుడే వాడబారని మహిమ కిరీటము పొందగలం. హల్లెలూయా!

ఓ స్నేహితుడా, ఈ లోక దురాశను విడిచి శుభప్రధమైన నిరీక్షణతో ప్రభువు రాకడకొరకు ఎదురుచూడు. దేవుని రాకడ ఈ రోజే వస్తే సిద్ధమా?

అనుభవం: క్రీస్తు శ్రమానుభవాల్లో దైనందిక జీవితం, క్రీస్తును ఎదుర్కొన్నప్పుడు వాడబారని మహిమా కిరీటం.

https://youtu.be/LMRLdt7Qlf0

Experience the Suffering with Christ 38th Experience:

And when the Chief Shepherd appears, you will receive the crown of glory that will never fade away. 1 Peter 5:4.

While a man was trying to step forward to quickly make his dreams that can come true, the devil will always break them and distract us especially with the latest changes in social media. My idea is that this modernity has made man lonely in society. What do you say?

It is my view, however, that there should be no change in the Christian faith no matter how many contradictions arise in the living system. To correct this system requires a paradigm shift in the discipline of the Christian faith. Balancing the daily life and the spiritual life with the Word of God is not sufficient to enable us to overcome loneliness but also gives us the power to cope with changes in social systems. If our strategies are towards spiritual conditions, we can see a new trend in the social community.

I believe that when the church can be the focal point of society by forming the spiritual family in prayer, we can observe the profound changes in the daily spiritual life. Living a life of suffering with Christ can finally change the mortal bodies in the twinkle of an eye during the rapture to immortal. Through these experiences, we can travel with complete dedication and willingness to receive the crown of glory that we can gain after we see Christ. Hallelujah!

My dear friend! Wait for the arrival of the Lord with auspicious hope and quit worldly greed. Are you ready to face God if He comes today? The decision is with you!

Experience: Suffering with Christ in daily life gives us the unfading crown of glory in the rapture.

https://youtu.be/Fn1STFtfp8g

Share this post