Skip to Content

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 37వ అనుభవం

6 August 2024 by
Sajeeva Vahini
  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 37వ అనుభవం:

లూకా 23:26-31 “వారాయనను తీసికొని పోవు చుండగా పల్లెటూరి నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకనిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి.”

ఆ రోజు శుక్రవారం పస్కా పండుగతో సంతోషంగా ఉండాల్సిన పట్టణం అలజడితో నిండి ఉంది. సంతోషం, విషాదం కలగలిసిన ప్రజలు గొల్గొతా మార్గంలో గుంపులు గుంపులుగా ఉన్నారు. కొరడా దెబ్బలతో కొట్టబడి చీరిపోయిన యేసు ప్రభువు యొక్క శరీరం నుండి రక్తం కారుతూ ఉంది. నీరసించిపోయిన ప్రభువు తాను మోస్తున్న సిలువ క్రింద సొమ్మసిల్లి పడిపోయాడు. సైనికులు ఆయనను బలవంతంగా లేపుతున్నారే కాని ఆయన లేవలేకపోతున్నాడు. ఆగిపోయిన సిలువ యాత్రను ఎవరితో కొనసాగించాలో తెలియని పరిస్థితి.

ఉన్మాద యూదా మత నాయకులు, ప్రధాన యాజకులు కుమ్మక్కై - నీతిమంతుడు, నిందారహితుడు నజరేయుడైన యేసును నిందించి, దూషించి, పిడిగుద్దులు గుద్ది, ముఖముపై ఉమ్మివేసి, అన్యాయపు తీర్పు తీర్చి, కొరడాలతో కొట్టించి సిలువ మరణానికి అప్పగించారు. అక్కడ జరుగుతున్న నరమేధాన్ని చూసిన కురేనీయుడైన సీమోను హృదయం చలించిపోయింది. మానవత్వం మంటగలిసిన ఘోర కార్యాన్ని బిత్తరపోయి చూస్తుండిపోయాడు.

యేసు ఎవరో, సిలువను ఎందుకు మోయవలసివచ్చిందో సీమోనుకు తెలియదు. ఈ సిలువ యజ్ఞం ప్రవచనాల నెరవేర్పని బొత్తిగా తెలియదు. సీమోనుకు తెలిసినదల్లా మానవత్వమే. మానవత్వపు విలువలతో ప్రభువు కళ్ళలోకి చూచాడు. ఏ కనుదృష్టి ఈ లోకాన్నంతా పరీక్షించి చూస్తుందో ఆ ప్రభువు దృష్టిలోపడిన సీమోను తన గమ్యాన్నే మార్చివేసుకొన్నాడు. నాకెందుకులే అనుకోకుండా, సిలువ మోయుటే తన కర్తవ్యం అన్నట్లుగా, ప్రభువుతో పాటు సిలువను భుజానవేసుకొని సిలువ యాత్రను కొనసాగించాడు. ప్రభువు యొక్క అపారమైన శక్తి, పైశాచిక శక్తులపై ఆయన విజయం చూసి తరించాడు. ఎన్నడూ చూడని సుదీర్ఘమైన సూర్యగ్రహణంతో కలిగిన చీకటి చూసాడు, ఆ చీకటిలో యేసు ప్రభువు సిలువలో మాట్లాడిన మాటలు విన్నాడు తన జీవితంలో కొత్త వెలుగులను చూశాడు. సిలువలో యేసు పలికిన ఏడు మాటలు జీవపు బాటలుగా గ్రహించాడు. సిలువ శ్రమలో తనవంతు పాత్ర పోషించిన కురేనీయుడైన సీమోను జీవితం ధన్యమైంది.

అనుభవం : క్రీస్తు సిలువ భారాన్ని భుజాలను మార్చుకోగలిగిన మానవత్వ సహనమే క్రీస్తుతో శ్రమానుభవం.

https://youtu.be/xHZNt9yQbJQ

Experience the Suffering with Christ 37th Experience:

As they led him away, they seized Simon from Cyrene, who was on his way in from the country, and put the cross on him and made him carry it behind Jesus. Luke 23:26.

On Friday that day, instead of happiness on the event of Passover, the town was full of havoc. Groups of people gathered on the path of Golgotha filled with a mix of joy and tragedy. Blood is flowing from the body of the Lord Jesus, who was beaten up with whips. Jesus was slipped under the cross He was carrying. Soldiers are forcing him, but he is not able to rise. It is unknown at that situation with whom the journey of the cross was to continue.

Rude Jewish religious leaders and high priests together condemned the righteous and blameless Jesus of Nazareth, abused him, punched him in the face, beat him with a whip, condemned him with unrighteousness, and delivered him to death on the cross. Simon of Cyrene was heartbroken when he saw the massacre. He saw the horrible thing that humanity has burned down.

Simon does not know who Jesus is and why he must carry the cross. The fulfillment of these crucifixion prophecies is largely unknown to him. All that Simon knows is humanity. He looked into the eyes of the Lord with the values of humanity. When Simon looked into the eyes of the creator, whose eyes take care of this world, that moment changed his destination. He did not think -why should I?- but carried the cross as his duty, accompanied the Lord to the cross. He saw the immense power and victory of the Lord Jesus Christ over the evil power. He saw the darkness with the longest eclipse ever seen, and in that darkness, he heard the words of the Lord Jesus speaking on the cross and saw a new light of beginning in his life. He learned that the seven words that Jesus uttered on the cross as streams of life. The life of Simon of Cyrene, who played his part in the tribulation, was blessed.

Experience: Exchanging the burden of Christ with humanity and patience is the experience of suffering with Christ.

https://youtu.be/iEkh4rtJVOE

Share this post