Skip to Content

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 30వ అనుభవం

6 August 2024 by
Sajeeva Vahini
  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

 

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 30వ అనుభవం

మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా 53:5

ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు (రోమా 3:23). దేవుడు తన మహిమను మనకివ్వాలని క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి పాపముతో, అవిధేయతతో నిండిన మన జీవితాలను కలువరి రక్తములో శుద్ధిపరిచాడు. ఆయన మన అతిక్రమ క్రియలనుబట్టి గాయపరచబడ్డాడు, మన దోషములకై నలుగగొట్టబడ్డాడు, సర్వలోక శాంతి సమాధానం కోసం సిలువ శిక్ష అనుభవించాడు.

క్రీ.పూ 700 సంవత్సరల ఈ ప్రవచనం 2000 సంవత్సరాల క్రితమే క్రీస్తు మొదటి రాకడలో లో నెరవేర్చబడింది. ఇది నిజం. సిలువలో క్రీస్తు పొందిన ప్రతి శ్రమ మన జీవితాలకు పాపక్షమాపణ కలిగిస్తే, అతడు పొందిన ప్రతి గాయం మనలను పరిశుద్ధపరుస్తూ మన ఆత్మీయ జీవితానికి స్వస్థత కలుగజేస్తుంది.

మన కళ్ళముందు ఈ సత్యం ఋజువు అయితే, మనమింకా దేవునికి దూరంగా జీవిస్తూ ఆయన మహిమను పొందలేని పరిస్థితిలో ఉన్నామని గ్రహించాలి. ఆయన...నమ్మకస్తులైనవారు లోకములో ఎవరైనా ఉన్నారా అని ఆకాశమునుండి మనవైపు చూస్తున్నాడు. లోకములో లోకముతో జీవించే జీవితాలు దేవునికి భయపడక అవిధేయతతో అంధకారంలో ఉన్నాయి. ఈవిధంగా ఆధునిక మానవుడు జీవిస్తున్నాడు.

ఆయన మహిమ భూమి మీదకు రావడానికి ఆటంకంగా ఉన్నప్పుడు భయంకరమైన ఉపద్రవాలతో, మరణకరమైన తెగుళ్లతో తన కోపాగ్ని దేవుడు బయలుపరచి మన జీవితాలను మార్చుకోమని హెచ్చరిస్తున్నాడు.

భయముతో, వణకుతో క్రీస్తు శ్రమానుభవమును జ్ఞాపకము చేసుకోవాలి. తన ప్రేమను చూపించడానికి, మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెనను సంగతి జ్ఞాపకము చేసుకోవాలి.

ప్రతి శ్రమలో దేవుడు మనలను పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో కొన్నిసార్లు దేవుడు మనలను శిక్షిస్తాడు. "నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము" (ప్రకటన 3:19) అని ప్రభువు హెచ్చరించిన రీతిగా మారుమనస్సు కలిగి అయన శిక్షలో, శిక్షణలో అనుదినం మన జీవితాలను సరిచేసుకొని లోతైన ప్రార్ధనా అనుభవాలు కలిగియుండేలా జీవిద్దాం. సమర్పణ సిద్ధపాటుకలిగి ఒకరికొరకు ఒకరము ప్రార్ధిస్తూ జీవించుటకు ప్రయతినిద్దాం దేవుని ఉగ్రతనుండి తప్పించుకుందాం.

అనుభవం :

సిలువ యాగంలో గాయాలు క్రీస్తు శ్రమానుభవాలు

మన జీవితాలను సరిచేసే ఆత్మీయ స్వస్థతానుభవాలు.

https://youtu.be/S-DVi14aPT4

Experience the Suffering with Christ 30th Experience:

But he was pierced for our transgressions, he was crushed for our iniquities; the punishment that brought us peace was upon him, and by his wounds, we are healed. Isaiah 53:5.

For all have sinned and fall short of the glory of God, (Romans 3:23). God came to this world as Christ Jesus to give us his glory, and he purified us from sin and disobedience with the precious blood. He was wounded for our transgressions, He was crucified for our iniquities, and to finally to give peace to the world.

This prophecy of 700 years was fulfilled in Christ-s first coming in 2000 years ago. It-s true. If Christ-s suffering on the cross forgives our lives, each wound on his body He receives will cleanse us and heal our spiritual life. If we do not believe this is the truth, then we must realize that we are living in a situation where we are living apart from God and unable to receive His glory. He is looking down at us from the sky to see if there is anyone faithful in the world. The lives of the world are in darkness through disobedience and without fear of God. This is how a modern man living today.

When His glory is interrupted to come to earth, God reveals His wrath with terrible plagues and deadly plagues and warns us to change our lives.

We must remember the tribulations of Christ with fear and shivering. We must remember that Christ died for us while we were sinners, He died to express His love towards us.

God tests us in every labor. God sometimes punishes us in this test. Repent, as the Lord has warned: "Those whom I love I rebuke and discipline. So be earnest, and repent." (Revelation 3:19). As the Lord has warned us to change our lives through training, and undergo punishment. Let us escape the wrath of God by preparing to offer ourselves and pray for one another.

Experience: The wounds of Christ were sufferings that give spiritual healings that fix our lives.

https://youtu.be/encSrRU6n9o

Share this post