- Author: Dr. G. Praveen Kumar
- Category: Suffering with Christ
- Reference: Sajeeva Vahini
Audio: https://youtu.be/UDmDor5iq_U
క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి. 1 పేతురు 4:13
క్రీస్తు విషయమములో మనకు కలిగే శ్రమలు ఎదురైనప్పుడు ఆ శ్రమల వలన కలుగు బాధ కంటే, ప్రతి శ్రమ చివర పొందిన అనుభవాలు మనకు మహా ఆనందము కలుగజేస్తాయి.
ఎప్పుడైతే "క్రీస్తు శ్రమలలో" పాలిభాగస్తులుగా ఉంటామో అప్పుడే కదా! పరిపూర్ణ క్రైస్తవుడిగా సిద్దపడగలము. "శ్రమల సంతోషాల మధ్య సంఘర్షణలో క్రీస్తుతో శ్రమానుభవము మహా అనందం" అని దేవుని వాక్యము సెలవిస్తోంది.
క్రీస్తు శ్రమలలో పాలుపంపులు కలిగినప్పుడు, ఈ శ్రమానుభవములు మనలను విజయ మార్గంవైపే నడిపిస్తాయే కాని కృంగదీయవు.
శ్రమ కలిగినప్పుడు లేదా శ్రమలో ఉన్నప్పుడు మనం దేవునిపై ఆధారపడితే ఈ శ్రమను అధిగమించే శక్తి పొందగలుగుతాము. అందుకే ప్రతి శ్రమానుభవములో మనము సంతోషంగా ఉండాలి.
అనేక సందర్భాల్లో శ్రమ కలిగినప్పుడు సంతోషించమని కాదు గాని శ్రమను అధిగమించటంలో పొందిన శక్తి దేవుని వాగ్ధానాలు మన జీవితంలో నెరవేర్చబడుతాయనే నిశ్చయత కలుగజేస్తుంది.
ఈ నిశ్చయత రక్షణలో మరింత లోతైన అనుభవాన్ని జతచేస్తూ... యేసయ్య రాకడ సమయంలో ఆయనను ఎదుర్కొంటాము అనే ఖఛ్చితమైన నిరీక్షణను కలుగజేస్తుంది. ఈ నిరీక్షణే మనకు మహా ఆనందము.
అనుభవం : శ్రమల సంతోషాల మధ్య సంఘర్షణ; క్రీస్తు శ్రమానుభవం మనకు మహా ఆనందం.
2nd EXPERIENCE
But rejoice that you participate in the sufferings of Christ, so that you may be overjoyed when his glory is revealed. - 1 Peter 4:13.
The afflictions we experience for Christ, gives us great joy than the pain at the end of each tribulation.
Only when we be the partakers of "the Tribulations of Christ" we can be prepared to be a perfect Christian. The Word of God proclaims that the conflict between happiness and tribulations, suffering with Christ is a great joy.
When we are involved in the Tribulations of Christ, these experiences lead us to the path of victory but are not depressing.
If we depend on God when we are in Tribulations, we can be able to gain the power to overcome. That is why we should be happy in every tribulation experience.
In many cases, it does not mean to rejoice when we are afflicted, but the power gained to overcome these afflictions ensures that God’s promises are fulfilled in our lives.
This certainty adds a more profound experience in salvation, creating a definite hope that we will meet Jesus Christ at his second coming. This expectation is a great pleasure for us.
Experience: Conflict between happiness and tribulations, suffering with Christ is a great Joy to us.