Skip to Content

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 29వ అనుభవం

6 August 2024 by
Sajeeva Vahini
  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 29వ అనుభవం

మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 1 కొరింథీయులకు 11:26

దేవుడు మనలను ఈ లోకంలో పుట్టించుటకు గల కారణం, ఈ లోకసంబంధమైన శ్రమలను జయించి, ఆత్మసంబంధమైన శ్రమలపై విజయంపొంది, పరిశుద్ధులముగా నీతిమంతులముగా ఈ లోకములో తీర్చబడి, మహిమలో ఆయనను ఎదుర్కోవాలనేదే తండ్రి ఉద్దేశం.

క్రీస్తు సిలువకు అప్పగింపక మునుపు... సిలువలో అయన పొందబోతున్న శ్రమలను గూర్చి వివరిస్తూ, సిలువలో మనకొరకు అర్పించనున్న తన శరీరానికి-రక్తానికి సాదృశ్యమైన రొట్టె-ద్రాక్షారసమును భుజించమని నేర్పించాడు. రక్షణ పొంది, ప్రభువు బల్లలో పాలుపంపులు కలిగియున్న మనం క్రీస్తు సిలువ మరణమును జ్ఞాపకము చేసుకోవలసిన వారమై యున్నాము.

"నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచి యుందుము" (యోహాను 6:56).

అయనయందు మనం మనయందు ఆయన నిలిచి ఉన్నప్పుడే, అనగా ప్రభువు బల్లలో పాలుపొందిన అనుభవమే పరిశుద్ధులముగా నీతిమంతులుగా చేయబడి పరలోకాన్ని చేరుకోగలుగుతాము.

ప్రభువు బల్లలో పాలుపొందడం సిలువ మరణానుభవం. ఈ అనుభవం అపో. పౌలు వివరిస్తూ "నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి యున్నాము" అని వివరించారు. లోకమును జయించినప్పుడే ఇట్టి సిలువ మరణానుభవమును పొందగలం. లోకమాలిన్యము అంటకుండా జీవించి, అనగా ఇహలోక జీవితం మరణించి, పరలోక జీవితాన్ని అనుభవించే వారముగా రూపాంతరం చెందాలి.

అంతేకాదు, క్రీస్తు శరీరానికి సాదృశ్యం సంఘం, ఆత్మీయ పాఠశాలైన ఆ సంఘములో చేర్చబడి, ఎవరైతే పరిశుద్ధమైన బల్లను పరిశుద్ధముగా భుజిస్తారో వారు క్రీస్తు మరణాన్ని జ్ఞాపకము చేసుకొని ఆయన మరణమును ప్రచురించేవారవుతారు. ఇట్టి అనుభవం సిలువలో క్రీస్తు మరణంపై విజయం పొందినరీతిగా, శారీరికంగా ఈ లోకంలో మరణించినా...ఆత్మీయ సంఘముగా ఎత్తబడి, క్రీస్తుతో లేపబడినవారమై మరణంపై విజయం పొందగలుగుతాము.

నేనంటాను, క్రైస్తవుని త్యాగ పూరితమైన జీవితం క్రీస్తుతో శ్రమానుభవం. లోకమును జయిస్తూ జీవించడం సిలువ మరణానుభవం. ప్రభువు బల్లలో చేయివేసి క్రీస్తు మరణమును జ్ఞాపకము చేసుకొని, ఆయన మరణాన్ని ప్రచురించే జీవితమే క్రీస్తుతో సమానానుభవం.

అనుభవం:

త్యాగపూరిత జీవితం క్రీస్తుతో సమానానుభవం.

బల్లలో పాలుపొందడం క్రీస్తుతో మరణానుభవం,

ఆయన మరణమును ప్రచురించడం క్రీస్తుతో శ్రమానుభవం.

https://youtu.be/rb4awZYA8u0

Share this post