Skip to Content

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 28వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 28వ అనుభవం:

నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది. యోహాను 6:55

ఐగుప్తు బానిసత్వం నుండి బలిష్టమైన దేవుని హస్తం ఇశ్రాయేలీయులను విడిపించి, అరణ్య మార్గం గుండా పాలు తేనెలు ప్రవహించే దేశంవైపు నడిపించింది. కనాను ప్రయాణంలో ఇశ్రాయేలీయులను దేవుడు పరీక్షిస్తూ ప్రత్యేకంగా వారి ఆహార అలవాట్ల విషయమై జాగ్రత్తపడమన్నాడు. ఐగుప్తు ఆహారానికి అలవాటైన వారి శరీరాలకు అరణ్యంలో పరలోకపు మన్నాను బండనుండి జీవ జలపు ఊటలను ఇచ్చి ఆహార శైలిని మార్చి నేర్పించాడు.

జాగ్రతగా గమనిస్తే, ఇశ్రాయేలీయులను ఆకలితో అలమటించేలా చేసి మన్నాతో తృప్తిపరుస్తూ వచ్చాడు. వారైనను వారి తలిదండ్రులైనను మునుపెన్నడూ ఇటువంటి ఆహారమును తినలేదు గాని... మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అనే అనుభవాన్ని నేర్పించాడు. దేవుని బిడ్డలైన మనకు ఆహార పద్దతులను అలవాట్లను మార్చుకోమని తెలియజేస్తూ క్రీస్తు శరీరమును భుజించే ఒక గొప్ప అనుభూతిని నేర్పిస్తున్నాడు.

క్రైస్తవులమైన మనం శరీర సంబంధమైన ఆహారమును మాత్రమే కాక, ఆత్మీయ ఆహారమును భుజించే అనుభవంలోకి రావాలి. ఈ అనుభవం అన్ని సందర్భాల్లో దేవుని మాట వలన జీవిస్తూ సమస్తము ఆయన ద్వారా పొందియున్నామని విశ్వసించి, పరలోకమునుండి మన కొరకు జీవాహారమైన ఆ క్రీస్తు శరీరమును తిని నిత్యజీవానికి వారసులమయ్యే కృపను పొందుకోవాలి.

ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగినప్పుడు ఆత్మీయ జీవితం బలహీనపడి, శారీరిక జీవనం శిక్షకు గురౌతుంది. బాప్తీస్మ సాక్ష్యము పొంది... వారమంతా లోకానుసారంగా జీవించి, పరిశుద్ధ దినమున ఆయన బల్లలో చేయి వేస్తే వ్యక్తిగత, కుటుంబ, జీవితాలు దేవుని ఆశీర్వాదములు పొందలేకపోగా శాపానికి గురౌతాయి. అనేక సార్లు మన జీవితాల్లో అపజయం పొందుతున్నామంటే కారణం మన అజాగ్రత్తలే. తగినటువంటి నియమాలతో జాగ్రత్తలతో ఈ అనుభవాన్ని అలవాటు చేసుకుందాం.

అపొస్తలుల బోధ, ప్రార్ధన, సహవాసం ఇవన్నీ ఉన్నా, రొట్టె విరిచే అనుభవం కూడా ఎడతెగక ఉండాలని సంఘానికి దేవుడు నేర్పించాడు. ఈ అనుభవం ఆయన రాకడ కొరకు సంఘాన్ని సిధ్ధపరుస్తూ మనకు కూడా యేసుక్రీస్తు సిలువలో శ్రమానుభవమును జ్ఞాపకము చేసి పాప క్షమాపణ ఇచ్చి నిత్యజీవాన్ని స్వతింత్రిపజేస్తుంది.

అనుభవం : శరీరం - రక్తం సాదృశ్యమైన రొట్టె - ద్రాక్షారసం యేసు క్రీస్తు సిలువలో శ్రమానుభవ జ్ఞాపకమై పాపక్షమాపణ పొంది నిత్యజీవం కొరకై పరలోకరాజ్యం చేరాలి.

https://youtu.be/PU_tz6McI2w

Experience the Suffering with Christ 28th Experience:

For my flesh is real food and my blood is real drink. - John 6:55.

The mighty hand of God freed the Israelites from slavery in Egypt and led them into a land flowing with milk and honey through the wilderness. During the voyage to Canaan, God tested the Israelites and asked them to be especially careful about their eating habits. He taught them especially those who were accustomed to the Egyptian diet to change the diet by giving them heavenly manna in the wilderness and springs of living water.

When we observe, He made the Israelites hungry and satisfied them with manna. Neither they nor their parents had ever eaten such food before He taught the experience of living not only by bread but by every word that comes from the mouth of God. Jesus is teaching us a great feeling of eating the flesh, showing us to change our eating habits.

As Christians, we must come into the experience of eating not only fleshly food but also spiritual food. This experience is to live by the word of God in all cases and to believe that all things are received by Him and that we may eat the body of Christ, which is life for us from heaven, and receive the grace to inherit eternal life.

When we partake in the Lords table carelessly the spiritual life is weakened, and the physical life is punished. We are baptized, but sometimes we are living according to the world throughout the week, and lay hands on the holy communion on a Sunday. This kind of practice does not bring us blessings rather it brings a curse to our lives. Many times, we fail in our lives because of our negligence. Let us practice this experience with caution and with the appropriate rules that were prescribed to us.

God taught the congregation that despite the apostolic teaching, prayer, and fellowship, the experience of breaking bread must be uninterrupted. This experience prepares the congregation for His coming and reminds us of our labors on the cross of Jesus Christ, the forgiveness of sins, and the ascension to heaven for eternal life.

Experience: Holy Communion is the remembrance of crucifixion and suffering of Jesus Christ, the forgiveness of sins, and the ascension to heaven for eternal life.

https://youtu.be/yfW5w2L7-O8

Share this post