Skip to Content

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 24వ అనుభవం

6 August 2024 by
Sajeeva Vahini
  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

https://youtu.be/Lo7QOCItXCo

ఆయన, కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను. హెబ్రీయులకు 5:8

ప్రపంచంలో మానవుని మహత్తర జ్ఞానం, శక్తి, నైపుణ్యత గణనీయంగా - ఘననీయంగా వర్ణించే సందర్భం అంటూ ఉంది అంటే అది చంద్రమండలంపై మొట్టమొదటి సారిగా మానవుడు కాలు మోపిన రోజే కదా!

అంతరిక్షాన్ని చేరుకునే మానవ మేథస్సు "విజ్ఞానం" అని లోకం చెప్తుంటే, ఆయన దేవాది దేవుడైయుండి పరలోకమునుండి ఈ భూమిమీద అడుగుపెడితే అది "విధేయత" అని బైబిల్ చెప్తుంది.

క్రీస్తు పుట్టుకలో ఆయన చూపిన విధేయత... 30 సంవత్సరాలు తనను తాను సిధ్ధపరచుకొని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు సువార్త అడుగులు ముందుకు వేసాడు. ఈ విధేయత సిలువ శ్రమ వైపు నడిపించినా అడుగు వెనకకు పడలేదు; సిలువ ఎత్తుకొని ముందుకే నడిచాడు. మరణపర్యంతం ఆ విధేయత వెనుకాడలేదు... ఆ విధేయతే మరణంపై విజయం పొందింది.

విధేయతకు మాదిరిగా జీవించి మనమూ ఆయనవలే జీవించడానికి ప్రోత్సాహిస్తున్నాడు. ఎందుకంటే, సిలువలో క్రీస్తు విధేయతా ప్రతిబింబాలు మన జీవితాల్లో చూడాలనుకుంటున్నాడు కాబట్టి. ఈ విధేయత మహిమలో క్రీస్తును చేరుకోడానికే కదా!

నేనంటాను - మనలో ఉండే శక్తి సామర్ద్యలు, నైపుణ్యతలకంటే దేవునికి మనలో ఉండే విధేయత కావాలి.

శ్రమల్లో రెట్టింపయ్యే అనుభవం విశ్వాసం అయితే

ఆ విశ్వాస ఫలమే విధేయత.

విశ్వాసానికి సువాసన విధేయత అయితే

ఆ విశ్వాస విధేయతే మన నడవడి.

ఇదే మన జీవితం.

అనుభవం : విశ్వాసం విధేయతా జీవితమే సిలువలో క్రీస్తుతో శ్రమానుభవం.

https://youtu.be/sKmEBFdqypU

Although he was a son, he learned obedience from what he suffered. - Hebrews 5:8.

There is a time when the world-s most remarkable knowledge, power, and skill is described as the greatest - that is, when the first time a human has set his foot on the moon.

If the world says "knowledge" is the human intelligence that reaches the celestial world, but the Bible says that it is called "obedience" when the God of heaven set his foot on the earth.

 

The obedience that we see in the birth of Christ and when He prepared himself for 30 years and took the gospel forward to fulfill the will of the Father. This obedience led Christ to the cross and handle the tribulations, but he never made His step backward; He took up the cross and walked forward. His obedience did not hesitate to die, and that obedience made Him victorious over death.

 

Now, He encourages us to live with obedience like him, because Christ wants to see His reflection of obedience of the cross in our lives. This obedience shall bring us to Christ when we reach the glory!

 

I must say that we need to obey God - more than our strengths, skills, and abilities.

If the outcome of tribulations is faith, Obedience is the fruit of that faith.

If the fragrance of faith is obedience, that faithful Obedience is our way of life.

And, this is our life.

Experience: Faithful obedience is a life of tribulations with Christ.

Share this post