Skip to Content

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 21వ అనుభవం

6 August 2024 by
Sajeeva Vahini
  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 21వ రోజు:

నేను నేరస్థుడనై యున్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి యుండలేదు. 2 తిమోతికి 2:9

మనస్సొక రణరంగం

మరుగును ప్రతిక్షణం

ఆరాటాల గమనంలో

అనుక్షణమొక పోరాటం

జీవన మరణాల మధ్య అనుభవం

సిలువను వీక్షిస్తే సమాధానం

సంకెళ్లతో బంధించబడి అన్యాయపు అహంకారాలు సంతవీధుల్లో నిలబెట్టినా, అడుగు ఆపితే శరీరాన్ని కోస్తున్న కొరడా కెరటాలు బాధను రెట్టింపు చేస్తున్నా, మరణంవైపు వేసే ప్రతి అడుగు మన జీవితాల్లో చీకటిని చీల్చే కొత్త వెలుగు దిశలుగా, సువాసనపు పరిమళాలను వెదజల్లిన ఆ సిలువ శ్రమానుభవమే సువార్త!

సమూల మార్పే లక్ష్యంగా నశించిపోయే మన జీవితాలను వెదకి రక్షించాలనే ప్రధాన సంకల్పం సిలువ పోరాటాన్ని స్వీకరించి...

సామాజిక, రాజకీయ, ఆధునిక వ్యవస్థలో తాను అంతర్భాగమని ...సగర్వంగా ప్రకటించుకున్న విస్ఫోటనలోంచి ప్రజ్వరిల్లిన అగ్ని జ్వాలలే సువార్త.

అసమానతలు - అణచివేతలను పటాపంచలు చేసి,

అజ్ఞానాన్ని - అంధకారాన్ని తరిమివేసే పాప బంధకాల విడుదలపు తాళపు చెవి సువార్త అని గ్రహించిన జీవితాలు వాస్తవరూపం ధరించిన ఈ వర్తమానంలో, విశ్వాసులపై అపవాది చేస్తోన్నయుద్ధంలో సువార్త ధ్వజం క్రీస్తు రాకడ సిధ్ధపాటు కొరకు పరుగులు తీస్తుంది.

నిరంతరం సామాజిక వైరుధ్యాలను తట్టి లేపుతూ, వాటి బహుముఖ రూపాలను వెలికి తీస్తూ, వాటితో తలపడుతూ, ప్రజలను పరిష్కర్తలుగా తీర్చిదిద్ది, జీవితాల మార్పు దిశగా సాగడమే.. సువార్త గమ్యం.

సువార్తను ప్రకటించే ఆసక్తి నీకుంటే!

బంధించే బంధకాలను బద్దలకొట్టి

ఆహ్వానించే ద్వారాలు తెరువబడుతాయి.

ఓపికతో పనిచేసే సాధనంగా నిన్ను నీవు సమర్పించుకో!

అనుభవం:

చీకటిని చీల్చే కొత్త వెలుగు రేఖల పరిమళాలు వెదజల్లిన క్రీస్తు సిలువ శ్రమానుభవమే సువార్త!

https://www.youtube.com/watch?v=qRr6LgLmq1Y

Experience the Suffering with Christ 21st Experience:

https://youtu.be/c2VtCVLcSy0

For which I am suffering even to the point of being chained like a criminal. But God-s word is not chained. - 2 Timothy 2:9.

Mind is a battleground

Every minute it bubbles

In the anxiety way

Every minute is a fight.

The experience between life and death.

Viewing the cross is peace...

When Bondages or an unrighteous pride made Him stand in the streets, every step with a whipping pain at the back and every step towards death could be a new light that breaks the darkness in our lives, this is the gospel of the cross experience that dispel the fragrance!

The main purpose of the cross is to save our lives from extinction and making the word of God an integral part of the social, political, and modern system, the explosion of words of fire is nothing but the gospel.

breaking the bonds of Inequalities and bondages, pulling out the darkness unknowledge, and sins bondages can only happen through the gospel. in the reality of present existence, satan-s war on the believer is preparing believers for the coming of Christ through this Gospel.

Constantly waking up social contradictions, uncovering their multifaceted forms, confronting them, making people the resolvers, and moving towards life change is the aim of the gospel.

If you are interested in proclaiming this gospel!

and to Break these bondages, the gates are open for you.

Dedicate yourself as a patiently working tool.

Experience: The rays of light shedding in the lives of the darkness through the gospel is the tribulation with Christ.

Share this post