Skip to Content

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 20వ అనుభవం

6 August 2024 by
Sajeeva Vahini
  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో శ్రమానుభవములు 20వ రోజు:

క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునివలె నాతోకూడ శ్రమను అనుభవించుము. 2 తిమోతి 2:3

నేటికి దాదాపు 20 సంవత్సరాలైంది, కార్గిల్ యుద్ధరంగంలో మన భారతదేశం కుమారులను, తండ్రులను, అన్నదమ్ములను కోల్పోయింది. అయితే, తమ ప్రధాన కర్తవ్యాన్ని నిర్వర్తించి దేశాన్ని, దేశ శాంతి భద్రతలను, దేశ సరిహద్దుల భద్రతను కాపాడడం కోసం ప్రాణాల్నే పణంగా పెట్టిన అమరవీరులని గర్వంగా చెప్పుకున్నాము.

స్వచ్ఛందంగా ఆసక్తిగలవారు మాత్రమే సైనికులుగా శిక్షణ పొందగలుగుతారు.

సైనికులు వారి మాతృభూమిని తమ శక్తితో రక్షించడం ద్వారా గౌరవిస్తారు.

దేశం కోసం పోరాడేటప్పుడు సైనికుడు కుటుంబాన్ని మరచిపోతాడు.

దేశ గౌరవాన్ని పరిరక్షించడంలో పాల్గొనడం సైనికులకు సంతోషం.

దేశం కోసం వారి శ్రమ ఎప్పుడూ ఉన్నతంగా ఉంటుంది.

మరణం ఎదుటే ఉందని తెలిసినా దానిని వెంబడించటానికి పరిగెత్తుతాడు.

యుద్ధంలో గెలిచినా, ఓడినా తమ దేశం కోసం అమరవీరులలా పోరాడుతారు

అయితే...

క్రీస్తు శ్రమ అనుభవాల్లో పాలుపంపులు కలిగి ప్రతి శ్రమతో పోరాడి గెలిచే వీరులు కావాలి.

తీర్మానాలకు కట్టుబడి, నియమ నిబంధనలతో పోరాడే సమర్పణ కావలి.

నడిచే మార్గం ముళ్లబాటైనా, చివరికి మరణమైనా అంతంవరకు నమ్మకంగా ఉండే స్వభావం కావాలి.

తన చుట్టూ ఉండేవారిని సంతోషపెట్టే ఆలోచనలు లేకుండా, తన ప్రధాన లక్ష్యమైన సిలువ మర్మాన్ని ప్రకటించే సువార్తికుడు కావాలి.

ప్రతి పోరాట కెరటాలను ఎదురీదుతూ క్రీస్తు సిలువ ఆశయ సాధనం కోసం పరితపించి ఆత్మలను సంపాధించే యోధుడు కావాలి.

ప్రగల్భాలు పలికే అపవాదిని అణగద్రొక్కి, క్రీస్తు రాజ్యాన్ని నిలిపే సిలువ సైనికుడు కావాలి.

భూదిగంతములకు వెళ్లి, అనుభవించిన కలువరి ప్రేమను వివరించే సేవకులు కావాలి.

సిధ్ధమా?

అనుభవం:

సిలువ మర్మాన్ని ప్రకటించాలనే ప్రధాన లక్ష్యం

క్రీస్తు రాజ్యాన్ని నిలిపే సిలువ సైనికుడు

క్రీస్తుతో శ్రమను అనుభవించే వాడు.

https://youtu.be/3OAN9kG70EE

 

Experience the Suffering with Christ 20th Experience:

Endure hardship with us like a good soldier of Christ Jesus. - 2 Timothy 2:3.

Today, nearly 20 years ago, India has lost sons, fathers, and brothers in the battle field of Kargil. However, we are proud to say that these martyrs who have risked their lives to protect the peace and security of the country.

1. Only those who are interested in volunteering will be able to get trained as soldiers.

2. Soldiers respect their homeland by protecting it with their strength.

3. The soldier forgets the family while fighting for the country.

4. It is a pleasure for the soldiers to participate in protecting the dignity of the country.

5. Their labor for the nation is always superior.

6. Knowing that death is coming, he rushes to chase it.

7. Whether they win or lose the battle, they will fight like a martyr for their country.

However

1. We need heroes who must share in Christ-s sufferings and win every hardship.

2. The submission requires adherence to resolutions and fighting the rules and regulations.

3. Though the walking path is dangerous, we must be faithful, even to the end and even to death.

4. He wants us to be an evangelist to proclaim the crucifixion, His main goal, without thinking of pleasing those around him.

5. He needs a warrior who can face any obstacle and save the souls to achieve the aim of Christ.

6. He needs a warrior who could crucify the boasting of the devil and establish the kingdom of Christ.

7. He wants his servants to go to the end of the world and proclaim the love they have experienced.

Are you ready?

Experience:

The soldier of Cross when suffering with Christ,

upholds the Kingdom of Christ…

his purpose is to reveal the mystery of Cross.

https://youtu.be/esBOyOxhRPc

Share this post