Skip to Content

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 19వ అనుభవం

6 August 2024 by
Sajeeva Vahini
  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో శ్రమానుభవములు 19వ రోజు:

https://youtu.be/gOV5bqkcIgc

క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. 1 పేతురు 4:1

అనుదినం కష్టపడుతూ, పోరాటంచేస్తూ సమస్య వెంబడి సమస్యతో అలసిపోయిన ఒక కూతురు తన తండ్రిని సమస్యను పరిష్కరించమని అడిగింది.

బాగా వంటలు చేసే ఆమె తండ్రి ఆమెను వంటగదిలోకి తీసుకువెళ్ళి మూడు కుండలు తీసుకొని ఒక కుండలో దుంపలు, రెండవ దానిలో గుడ్లు, మూడవ దానిలో కాఫీ గింజలు నీళ్లతో ఉంచి వేడిచేసాడు. కాసేపటి తరువాత కుండల నుండి దుంపలు, గుడ్లు బయటకు తీసి ఒక గిన్నెలో మరియు కాఫీ ఒక కప్పులో ఉంచి కూతురి వైపు తిరిగి ‘నీవు ఏమి చూస్తున్నావు?’ అని అడిగాడు. పరిశీలించి చూచిన ఆమె, ఏమిటి దీని అర్థం? అని ఆతృతగా నాన్నను అడిగింది.

దుంపలు, గుడ్లు మరియు కాఫీ గింజలు ఒకే విధంగా వేడిచేయబడ్డాయి అయితే, ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఉడికాయి. బలంగా, గట్టిగా ఉండే దుంప మెత్తగా అయిపోయింది, అంటే మృదువుగా మరియు బలహీనంగా మారింది. పెళుసైన సన్నని పెంకు లోపల ఉండే గుడ్డు లోపలి భాగం గట్టిపడింది. కాఫీ గింజలు వేడినీటికి కొత్త రుచి కలిగించాయి.

గమనించారా, వివిధ అనుభవాల నడుమ ప్రతి ఒక్కరికి శ్రమ ప్రత్యేకమైనది. ప్రతి శ్రమానుభవం శక్తివంతమైన ఆయుధం కంటే బలమైందని గ్రహిస్తే గొప్ప అనుభవం కదా!

ఆలోచనలు తలంపులు మధ్య నిరంతర సంఘర్షణలమయమైన శ్రమలు మనలను క్రీస్తు స్వభావ ప్రతిబింబాలుగా మారుస్తాయి.

క్రీస్తు శరీరమందు ఏ అనుభవాన్నైతే పొందాడో అట్టి సంపూర్ణ సమర్పణ స్వభావాన్ని మనం ఆయుధంగా ధరించుకున్నప్పుడు మన జీవితం కొత్తరూపం దాల్చబడుతుంది.

ఆధునికత వలనైన కొత్త మార్పులు మన జీవితాలను ఒత్తిడి చేస్తున్నా, లోకాశలవలనైన శరీర క్రియలను విసర్జిస్తూ ఉండగలిగే అనుభవం కావాలి. ఇలాంటి వైఖరి కలిగివుండటం కష్టమైనదే కానీ అసాధ్యమైనది కాదు.

చీకటిని చీల్చుకొచ్చిన ఆ వెలుగును, భూమికి ఆకాశానికి మధ్య వ్రేలాడదీసి...గాయాలతో తన శరీరాన్ని సిలువపై శ్రమపెట్టిన ఆ సన్నివేశాన్ని జ్ఞాపకము చేసుకుంటే సిలువలో క్రీస్తు పొందిన ప్రతి శ్రమ ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని మేకులతో కొట్టి ఒక నూతన నిబంధనలోనికి మనలను నడిపించాడనే అనుభవంలోనికి నడిపిస్తుంది.

ఇట్టి అనుభవం కలిగియుండడం ఎంత ధన్యత!

అనుభవం: సంపూర్ణ సమర్పణ స్వభావంలోని సిలువ అనుభవం...శక్తివంతమైన ఆయుధం. ఇదే క్రీస్తుతో శ్రమానుభవం.

 

Experience the Suffering with Christ 19th Experience:

https://youtu.be/xksOG7jvyMc

Therefore, since Christ suffered in his body, arm yourselves also with the same attitude, because he who has suffered in his body is done with sin.- 1 Peter 4:1.

A daughter who has been struggling with the problem all day has asked her father to solve the problem.

Her father, who cooks well, took her into the kitchen, took three pots, and heated the potatoes in one pot, eggs in the second, and coffee beans in the third. After a while, he pulled the potatoes and eggs out of the pots and put them in a bowl. Also, a cup of coffee and turned back to the daughter. "What do you see?". She looked up, and asked, "what does it mean? Can you please explain"

Father explained… while the potatoes, eggs, and coffee beans are boiled in the same way, each one is cooked individually. The strong stiff potato became soft, which meant it became soft and weak. The inside of the egg, the brittle thin shell is hardened. Coffee beans added a new flavor to boiling water.

Notice that, among the various experiences, each one is unique. It is a great experience to realize that every struggle is stronger than a powerful weapon!

When Persistent encounters, thoughts can transform us into reflections of Christ-s nature.

Our life is refreshed when we are fully armed with the complete submission of what we have learnt through Christ.

Though the new changes form the modern world are stressing our lives and we need to be able to get rid of the worldly desires and acts. Having an attitude like this is difficult but not impossible.

The light that broke the darkness and hung between the earth and the sky, Recalling the scene where his body was tortured on the cross, the experience of Christ-s sufferings on the cross nailed us to a new testament, nailing down the law.

It-s a pleasure for having such an experience!

Experience: Experiencing the Cross with an absolute submission is a powerful weapon. This is the suffering with Christ..

 

Share this post