Skip to Content

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 18వ అనుభవం

6 August 2024 by
Sajeeva Vahini
  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో శ్రమానుభవములు 18వ రోజు:

https://youtu.be/jsgNcMXPMnY

అందువలన మీ హింసలన్నిటిలోను, మీరు సహించుచున్న శ్రమలలోను, మీ ఓర్పును విశ్వాసమును చూచి, మేము దేవుని సంఘములలో మీయందు అతిశయ పడుచున్నాము. 2 థెస్సలొనీకయులకు 1:4

విశ్వాసములో నిలకడ, ప్రేమలో అభివృద్ధి ఈ రెంటిలో థెస్సలొనీకయ సంఘం మొదటి స్థానంలో ఉంది. లౌకిక సంబంధమైన ప్రతి ఒత్తిడిలో సిలువ శ్రమ ఎదురైనా; నమ్మకంగా, ఓపికగా, నిలకడగా మరియు సమర్ధవంతంగా ప్రతి శ్రమను ఎదుర్కోగలిగే అనుభవం పొందింది ఈ సంఘం. శ్రమల ఒత్తిడిలో తమ జీవితాలను లెక్కచేయకుండా మరణానికి కూడా అప్పగించబడినవారున్నారు. అయినప్పటికీ, ప్రతి శ్రమానుభవంలో... శ్రమ సంతోషంగా మార్చే రోజు కోసం వేచిచూస్తోంది ఈ సంఘం.

ఎదుగుదలకు పోషణ చాలా అవసరం. పరిశుద్ధాత్మ ద్వారా పొందే ఈ పోషణలో దేవుడు మన విశ్వాసమును అభివృద్ధిపరుస్తుంటాడు. మనం ఎదుగుతున్నప్పుడు మన ఆత్మీయతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు అపవాది చేస్తూనే ఉంటాడు. సంఘంలోని తప్పుడు బోధలు, సహవాసంలో కలిగే తప్పుడు నిర్ణయాలు...ఇవన్నీ విశ్వాసంలో బయటకు బాగానే కనిపించినా...క్రమ క్రమంగా మన విశ్వాసాన్ని దిగజారుస్తుంటాయి. వీటిని గమనించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

"మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగరా?" (2 కొరింథీయులకు 13:5).

అవును, క్రీస్తు మనలో ఉన్నప్పుడు...పరిశుధ్ధాత్మ నింపుదల పొందినప్పుడు...ఆత్మలో దేవుడు బయలుపరుస్తుంటాడు. వ్యత్యాసమైన బోధనలను గ్రహించగలిగే అనుభవంలోనికి మనమందరం రావాలన్నదే నా ఆశ.

అజాగ్రత్త గల సోమరితనము విడిచిపెట్టి, లేచి క్రీస్తు కొరకు కఠినముగా సేవ చేయాలన్నదే ఆనాడు పాలు థెస్సలొనీకయ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈనాడు మన సంఘాలను కూడా మాదిరి కలిగిన సంఘంగా సిద్దపడమని ఆలోచింపజేస్తున్నాడు.

మన ఈ అనుదిన ధ్యానంలో... క్రీస్తుతో ప్రతి శ్రమానుభవమును పొందుతూ, మన జీవితాలకొరకైన జాగ్రత్తలు కలిగియుండవలెనని గ్రహించి, క్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చిన సిధ్దమనసును ప్రభవు మనందరికీ దయచేయును గాక. ఆమెన్.

అనుభవం: అజాగ్రత్త గల సోమరితనమును విడిచిపెట్టి, లేచి క్రీస్తు కొరకు కఠినముగా సేవ చేయాలనే ఆలోచన...క్రీస్తుతో శ్రమను అనుభవించాలనే పట్టుదల.

Experience the Suffering with Christ 18th Experience:

https://youtu.be/x83Rx-RisTk

Therefore, among God- s churches we boast about your perseverance and faith in all the persecutions and trials you are enduring. - 2 Thessalonians 1:4.

Thessalonica Church is in first place for Persistence in Faith and Love. Despite the tribulations of the cross, in every worldly stress; This church has the experience of being able to face every task confidently, patiently, consistently, and effectively.

Some people have been put to death without even counting their lives under the stress of tribulations. However, in every effort, the church is waiting for a day that turns every tribulation into happiness.

Nutrition is essential for any growth factor. In this nourishment received through the Holy Spirit, God develops our faith.

As we grow up, the Devil keeps on trying to mislead our spirituality. False teachings in the church, wrong decisions in fellowship, all of these seem to be good in faith but gradually worsen our faith. There is much to be noticed.

Examine yourselves to see whether you are in the faith; test yourselves. Don’t you realize that Christ Jesus is in you-- unless, of course, you fail the test? - 2 Corinthians 13:5

Yes, when Christ is in us then we are filled by Holy Spirit, and God reveals everything through that Spirit. My hope for all of us is to have the experience of being able to discern different teachings.

Paul reminds the congregation of Thessalonica to give up the careless laziness and get up and work hard for Christ. Today he is making our churches to be like an ideal church.

In our meditation on this, May the Lord Jesus Christ, on his second Coming, bestow upon all of us the preparation realizing that we should take care of our lives and be mindful of our lives with Christ. Amen.

Experience: Give up Laziness and Get up to Serve Hard for Christ with a firm determination is an experience of Suffering with Christ..

Share this post