Skip to Content

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 15వ అనుభవం

6 August 2024 by
Sajeeva Vahini
  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో శ్రమానుభవములు 15వ రోజు:

https://youtu.be/FazYybIGHV4

మనము శ్రమను అనుభవింపవలసియున్నదని మీతో ముందుగా చెప్పితివిు గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును;

అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. 1 థెస్స 3:3,4

దైవ ప్రణాళికలో స్థానిక సంఘం ఒక కుటుంబం; ఇది అనేక కుటుంబాల సముదాయం. అనేక అంశాల సమాహారం. వివిధ రంగాలకు, సామాజిక నైతిక జీవనానికి కేంద్రం.

కుటుంబం సావధానమైన పాఠాలు నేర్చుకుంటూ సమాజంలో జీవించాలి.

సంఘంలో ఉన్నవారిని సమాజం ప్రభావితం చేస్తూనే ఉంటుంది. అయినప్పటికీ దేవుని ప్రణాళికలో సంఘము స్థిరంగా ఉండాలి.

క్రైస్తవేతరులకు నిజమైన సంఘం అంటే ఏమిటో చూపించగలగాలి. ఎందుకంటే, సామాజిక జీవన మూల పాఠాలు, నైతిక విలువలు సంఘం మనకు నేర్పిస్తుంది. మన జీవితం కొరకైన ప్రతి ప్రణాళికకు సంఘం కేంద్రంగా ఉండాలి.

క్రీస్తు విషయమైన శ్రమ భారం సంఘంపై ఉన్నా, సామాజిక పరమైన శ్రమలు, సువార్త వలనైన వ్యతిరేకతలు సంఘంపై ఒత్తిడిని తెస్తాయి. కాబట్టి శ్రమ ఏ విధంగా వస్తుందో కనిపెట్టుకొని ఉండాలి. సంఘం, రాబోయే శ్రమను ఎదుర్కొవడానికి ముందుగానే సంఘప్రార్ధనలతో సిద్ధపాటు కలిగి ఉండాలి.

కుటుంబాలు ప్రభువునందు స్థిరపడి, ప్రేమలో అభివృద్ధి పొందగలిగితే ఎటువంటి శ్రమలనైనా ఎదుర్కొనే శక్తి దేవుడు దయజేస్తాడు.

అవును, దేవుడు మనలను రక్షణపొందుటకే నియమించాడు గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు.

క్రీస్తుతో ప్రతి శ్రమానుభవము మనలను అభివృద్ధి చేస్తూ, ఆయన రాకడలో ఆయనను ఎదుర్కొంటాము అనే నిశ్చయత కలుగజేస్తుంది.

అనుభవం:

క్రీస్తుతో ప్రతి శ్రమానుభవము, మన కుటుంబాలను అభివృద్ధిపథం వైపు నడిపిస్తాయి.

 

Experience the Suffering with Christ 15th Experience:

https://youtu.be/x_49MRmwUYA

So that no-one would be unsettled by these trials. You know quite well that we were destined for them. In fact, when we were with you, we kept telling you that we would be persecuted. And it turned out that way, as you well know. 1 Thessalonians 3:3,4.

The local church is a family in divine planning; It is a combination of many families and A collection of many other elements. The place where you can find good social and moral life. Our family needs to live in society while learning positive lessons.

But, society continues to influence those in the church. However, in God-s plan, the church must be consistent.

Christians should be able to showcase how a true church should be to the Non-Christians because the church teaches us the basic lessons of life and moral values. A church should be the center of every plan or decision that we make in our lives.

Even though the burden of Christ-s work is on the church, social hardships and opposition to the gospel are putting pressure on the church. So you have to figure out how to take care of these. church should be proactively prepared with strong prayers for the tribulations that may come.

God gives the power to endure any hardship if families can settle in the Lord and grow in love.

Yes, God has appointed us to be saved but not to face his wrath.

Every tribulation with Christ develops us and gives us the certainty that we encounter Him during His second coming.

Experience: Every suffering with Christ… leads our families towards path of development.

Share this post