Skip to Content

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 14వ అనుభవం

6 August 2024 by
Sajeeva Vahini
  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో శ్రమానుభవములు 14వ రోజు:

Audio: https://youtu.be/F0UHI2LNjBU

ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. కొలస్సయులకు 1:24

సంఘం - క్రీస్తు ప్రణాళికల కేంద్రం.

క్రైస్తవులందరి కొరకు క్రీస్తు ఒక ప్రణాళిక కలిగి యున్నాడు. ఈ ప్రణాళికలో సంఘం చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తును ప్రేమిస్తే సంఘమును కూడా ప్రేమించాలి.

కుటుంబాల కుటుంబమైన సంఘంలో మన చేర్చబడినప్పుడు, దేవుని ప్రణాళికలు మన వ్యక్తిగత, కుటుంబ జీవితాల్లో నెరవేర్చబడుతాయి.

క్రీస్తు శరీరము సంఘానికి సాదృశ్యంగా ఉంది. కుటుంబాల కుటుంబమైన సంఘం వాక్యానుసారమైన బోధనలో, ప్రార్ధనలో, సహవాసములో మరియు రొట్టె విరుచుటలో ఎడతెగక ఉండాలి.

సంఘం క్రీస్తు ప్రణాళికలో ఉందో లేదో గమనించుకోవాల్సిన అవసరం, ఆ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి బాధ్యత. ఈ బాధ్యత క్రీస్తు శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో పాలుపంపులు కలిగియుండడం.

ప్రతి విశ్వాసికి తన స్థానిక సంఘం పట్ల భారం కలిగియుండాలి. సంఘంలో సహవాసం కలిగియుండడం మనందరి బాధ్యత.

రక్షించబడ్డామంటే దేవుని కృపలో ఉన్నామనే కదా! క్రీస్తు సిలువలో అనుభవించిన ప్రతి శ్రమ మనలను రక్షించుకొని, ఒక సంఘముగా చేయాలనేదే ఆయన చిత్తం.

క్రీస్తు శరీరంలో పాలిభాగస్తులమైనప్పుడే అయన పొందిన శ్రమ సంపూర్ణమవుతుంది.

అంతేకాదు, ఆ ప్రతి శ్రమానుభవమును మనం కూడా పొందాలంటే, దేవుడు మనకిచ్చిన తలాంతులకొలది ఆయన పరిచర్యలో వాడబడాలి.

అనుభవం: క్రీస్తు శరీరమైన సంఘంలో పాలిభాగస్తులమైనప్పుడే; క్రీస్తు సిలువలో అనుభవించిన ప్రతి శ్రమ సంపూర్ణమవుతుంది.

 

Audio: https://youtu.be/10atly8pje0

Now I rejoice in what was suffered for you, and I fill up in my flesh what is still lacking in regard to Christ-s afflictions, for the sake of his body, which is the church. - Colossians 1:24.

Church - A Center for God-s Plan. Christ has a plan for all Christians. The Church is very crucial in this plan. If you love Christ, you must also love the church.

God-s plans are fulfilled in our personal and family lives, only when all the families of the church come together as one family. That one family represents the body of Christ and the body of Christ is analogous to the Church. The church is a group of families that should be continually involved in Scriptural teaching, prayer, fellowship, and breaking of bread.

It is the responsibility of every believer to observe whether the Church is in the right format. The responsibility should extend to take part in the hardships of Christ for his bride.

Every believer should have a burden on their local church. It is our responsibility to have fellowship in the Church.

Receiving Salvation means being in God-s grace! .It is his will that all the tribulations that Christ experienced on the cross should save us and prepare us to be his bride.

The tribulations we receive will be completed only when we become a part of the body of Christ.

Moreover, while we receive these hardships, we must also use the talents that God has given us in His ministry.

Experience: Every tribulation that Christ experienced on the cross will be completed, only when we become a part of His body as a Church.

Share this post