Skip to Content

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 13వ అనుభవం

6 August 2024 by
Sajeeva Vahini
  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీ 3:11

https://youtu.be/iHrmd-WvE6s

ఈ లోక సంబంధమైన ఆస్తి - అంతస్తులు, పేరు - ప్రఖ్యాతులు ధనాపేక్షతో ముడిపడే ప్రతి కార్యము చివరకు నష్టమే అని దేవుని వాక్యం సెలవిస్తోంది. వీటిని విడిచి దేవునిపై ఆధారపడే జీవితాలే క్రీస్తు శ్రమలలో పాలుపంపులు కలిగి ఉండే అనుభవాలు. ఇక్కడ ధనాపేక్ష గురించి మాట్లాడుతున్నాను.

ఈ లోకపు ఆస్తి మాకొద్దని అపొస్తలులు తమ్మును తాము క్రీస్తు శ్రమల విషయములో పాలుపంపులు కలిగి స్వస్థతా వరములు పొందగలిగారు.

మోషే ... ఐగుప్తు ధనముకంటె క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకున్నాడు, అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఆలోచించాడు. "దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు" అనే సాక్ష్యం పొందగలిగాడు. ప్రతి శ్రమానుభవములో అద్భుతాలు చేయగలిగాడు.

సౌలు పౌలుగా మార్చబడినప్పుడు, "నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని; నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమని" క్రీస్తు కొరకైన శ్రమల కొరకే దేవుడతనిని ఏర్పరచుకున్నాడు. దేవుని చిత్తమైన శ్రమలలో పాలివాడగుటకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాడు. దేవుడు అతని పరిచర్యను అభివృద్ధి చేశాడు.

ఆత్మీయత లేకుండా, పరిశుద్దాత్మ నింపుదల లేకుండా, ధనవ్యాపారములతో సంఘాలను నిర్మించాలి, అభివృద్ధిపరచాలనే ఆలోచలున్న లవొదికయ సంఘాన్ని; నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవుగా కనబడుతున్నావని దేవుడు హెచ్చరిస్తున్నాడు.

సేవకుడా, ధనం సంపాదించుకోవాలని, ఆస్తులు సమకూర్చుకోవాలనే సువార్త స్వస్థతా పరిచర్యలు అభివృద్ధిలో పరిగెడుతున్నా; సంఘం ఎత్తబడుటకు సిద్ధంగా లేదని గ్రహించాలి.

ప్రతి క్రైస్తవునికి క్రీస్తు కొరకైన శ్రమ భరించే అనుభవం కావాలి. క్రీస్తుతో శ్రమను అనుభవించాలంటే సమస్తమును నష్టపరచుకునే సాహసం చేయాలి. అప్పుడే దేవుని ప్రణాళికలతో చెసే ప్రతి పరిచర్య అభివృద్ధి చెందుతుంది. ఆత్మలకొరకైన ఆ భారం చివరకు ఎత్తబడే గుంపులోకి చేర్చబడుతుంది.

అనుభవం:

క్రీస్తుతో శ్రమ అనుభవం అంటే సమస్తమును నష్టపరచుకొనే సాహసం.

https://youtu.be/cCcz-Wz9qno

 

What is more, I consider everything a loss compared to the surpassing greatness of knowing Christ Jesus my Lord, for whose sake I have lost all things. I consider them rubbish, that I may gain Christ - Phillipians 3:8.

The Word of God declares that every act that is associated with worldly properties like status, fame and greed are ultimately a loss. Those who can keep them aside and when their lives completely depend on God, they are the one who partake in the sufferings of Christ. I am talking about greed here.

In those days Apostles denied the worldly possessions and took part in the tribulations of Christ due to which they received the gift of healing from God.

Moses chose the condemnation for Christ more than the riches of Egypt; he chose to be mistreated along with the people of God rather than to enjoy the pleasures of sin for a short time. He was able to bear the witness that "Moses was faithful as a servant in all God-s house." He was able to do miracles in every tribulation he encountered with.

When Saul was transformed into Paul, God said, "This man is my chosen instrument to carry my name...I will show him how much he must suffer for my name." He was chosen for tribulations in the will of God. He chose everything a loss compared to the surpassing greatness of knowing Christ Jesus our Lord, for whose sake he has lost all things. He considers them rubbish, that he may gain Christ. God blessed his ministry.

The Laodicean church, which intends to build and develop churches with money, without spirituality, without the filling of the Holy Spirit; God warned the church that you are lukewarm—neither hot nor cold—I am about to spit you out of my mouth.  You say, ‘I am rich; I have acquired wealth and do not need a thing.’ But you do not realize that you are wretched, pitiful, poor, blind and naked. 

If the minister of the church is executing the healing ministries to earn money and to earn wealth, realize that the church is not ready to rapture.

Remember, suffering with Christ is an adventure of losing everything. Every Christian needs this experience of enduring toil for Christ . Only the ministry that does with God’s plans can thrive. Their burden for the souls finally gets ready for the rapture.

Experience: Suffering with Christ is an adventure of losing everything.

Share this post