- Author: Dr. G. Praveen Kumar
- Category: Suffering with Christ
- Reference: Sajeeva Vahini
క్రీస్తుతో శ్రమానుభవములు 12వ రోజు:
Audio: https://youtu.be/Y45N3rLHawk
క్రీస్తునందు విశ్వాసముంచుటమాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఫిలిప్పీ 1:30
2016 లో జరిగిన ఒక వార్త విన్నాను. జపాన్ దేశంలో హోక్కైడో అనే ప్రాతంలో క్యూ-షిరాతక్కి అనే రైల్వే స్టేషనులో రోజు ఉదయం, సాయంత్రం కేవలం ఒక స్కూలకు వెళ్లే చిన్నారి కోసం ప్రభుత్వం వారు మరియు రైలు సిబ్బంది సేవలందించాలని నిర్ణయం తీసుకున్నారు. అనేక సంవత్సరాలు ఎంత ఖర్చైనా, ఎంత భారమైనా భరించి ఆ చిన్నారి భవిష్యత్తుకొరకైన ఆలోచన కలిగియుండడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.
అనేకమైన నిర్ణయాలు చిన్నవిగా అనిపించినా వాటి పరిమాణం చాలా పెద్దవిగా ఉంటాయి. దేవుడు మననుండి కోరుకునేది కూడా ఇదే.
క్రీస్తు కొరకైన మన నిర్ణయం చిన్నదిగా అనిపించినా దాని ప్రతిఫలం ఊహించిన దానికంటే గొప్పగా ఉంటుందని గమనించాలి.
"బ్రదుకుట క్రీస్తే చావైతే లాభము" అని అపొస్తలుడైన పౌలు ఒక నిర్ణయం చేసాడు. క్రీస్తు కొరకైన ప్రతి శ్రమను జ్ఞాపకము చేస్తూ... తానున్న స్థితినిబట్టి కాక, క్రీస్తు విషయము వలనైన బంధకాల వలన పొందిన శ్రమానుభవమును గూర్చి ఫిలిప్పీ సంఘానికి వివరిస్తున్నాడు.
ఈ నిర్ణయం కేవలం క్రీస్తును విశ్వసించుట వలన పొందే శ్రమనే కాదు గాని, క్రీస్తు పక్షమున శ్రమపడే అనుభవంలోకి మార్చేసింది.
ఈ మాటలు ఆనాడు ఫిలిప్పీ సంఘాన్నే కాదు, ఈనాడు మనలను మన సంఘాలను కూడా బలపరుస్తున్నాయి.
స్నేహితుడా! తొంబది తొమ్మిది గొఱ్ఱెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒకే ఒక్క గొఱ్ఱెపిల్లను వెదకగలిగే కాపరి వంటి వారు కావాలి. ఒక్క ఆత్మనైనా రక్షించాలనే పట్టుదల కలిగి ఎంత దూరమైనా ప్రయాణం చేసి ప్రయాస పడే సువార్తికులు కావాలి. వేసే ప్రతి అడుగు చిన్నదైనా, ఓర్పుతో వేస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చే జీవితం కావాలి.
ఈ ఉద్దేశాలు కలిగినవారు క్రీస్తు విషయములో కలిగే శ్రమలను బట్టి కాక, క్రీస్తు పక్షమున శ్రమానుభవమును పొందగలుగుతారు.
అనుభవం: విశ్వాసము లోకములో శ్రమలపై పోరాటాన్ని జరిపితే, క్రీస్తు శ్రమానుభవములు మహిమన్విత కిరిటం ధరింపజేస్తాయి.
Experience the Suffering with Christ 12th Experience:
Having the same conflict which ye saw in me, and now hear to be in me. - Philippines 1:30
In 2016 I heard some news that a government and the train staff decided to serve just for a child who goes to a school in the morning and evening at a railway station of Kyu-Shirataki in an area called Hokkaido in Japan. It amazed me for such idea that they really cared about the child-s future. Their ultimate decision was outstanding that no matter how much it cost and how many years it will complete let us help her. Many smaller decisions have a bigger impact. This is what God wants from us.
We need to observe that even if our decision for Christ seems to be so small, remember that the reward or its impact will be higher than the expected.
Apostle Paul decided that "to live is Christ; and to die is gain". This statement reminds about his struggles, Not about his situation. Paul wrote this experience to the Church of Phillipians describing his tribulations for Christ in his imprisonment.
This decision not only gives the experience of hardships we received for believing in Christ but also gives us the experience for the struggles on behalf of Christ.
These words strengthened the Philippian church those days. Today the same words strengthens us and our churches.
My Dear Servant of God! We need a shepherd who can leave ninety-nine sheep and search for the only missing lamb. We need evangelists who have the perseverance to save a single soul and travel no matter how far it is. Every step you take requires patience and fulfillment of God-s will.
Those who have these intentions will surely be able to experience sufferings on behalf of Christ rather than the struggles for Christ.
Experience: If fights of faith win hardships in the world then Christ-s tribulations will be crowned with glory.