Skip to Content

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 11వ అనుభవం

6 August 2024 by
Sajeeva Vahini
  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో శ్రమానుభవములు 11 వ రోజు:

https://youtu.be/Bde2XAr5bUY

నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి యున్నాను, ఇకమీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. గలతి 6 : 17

క్రీస్తు శ్రమలలో పాలుపంపులు కలిగి ఉండాలని అనుదినం ధ్యానిస్త్తున్నాం. ఈ అనుభవం మిమ్మును బలపరుస్తుందని విశ్వసిస్తున్నాను.

యుధ్ధములో విజయం పొందినవాడిని గెలుపెలా పొందావంటే తన అనుభవాన్ని ఒకవేళ కథలా వివరించి చెప్తే అంత నమ్మశక్యంగా ఉండదు. అదే రొమ్ము విరిచి తన ఒంటిమీద ఉండే గాయాలను చూపిస్తే వాటి మరకల సాక్ష్యం విజయమనే నమ్మకం కలుగుతుంది.

చిన్న కొడుకు తిమోతికి 6 ఏళ్ళు వచ్చాయి, పెద్దవాడు ఫిలిప్పుకు 10 ఏళ్ళు వచ్చాయి. వారి భవిష్యత్తు కోసం ఆలోచించాలి. ఏదైనా మంచి పాఠశాలలో చదివించి పెద్దవాళ్ళను చేసి ప్రయోజకులుగా నిలబెట్టాలి ఆలోచన ఏ తండ్రికి ఉండదు చెప్పండి!

కాని ఆ తండ్రి దీనికి భిన్నంగా ఆలోచించాడు. నశించిపోయే ఆత్మల కోసం నేను నా కుటుంబం ఏమైనా పర్వాలేదు అనుకున్నాడు. సువార్త ప్రకటిస్తే చంపేస్తామని బెదిరించారు. అయినా వినలేదు ఆ తండ్రి.

ఆత్మల భారం అంటే బెదిరింపులకు ఎదురు వెళ్ళడమే.

అనుకోకుండా ఓ రాత్రి శత్రుమూకలు చుట్టుముట్టి అన్నంత పనిచేశారు. తండ్రిని, ఇద్దరు బిడ్డలను సజీవదహనం చేసి హతసాక్షులను చేశారు. ఈ తండ్రి మన భారతదేశము నాశనమైపోకూడదనే తపన కలిగి, క్రీస్తు ప్రేమను వివరించాలనే ఆశయం కలిగిన గొప్ప మిషనరి గ్రాహం స్టెయిన్స్.

నోహర్పూర్ లో జరిగిన ఈ సంఘటన నన్ను కలచివేసింది. కన్నీరు కార్చాను. ప్రతి క్రైస్తవునికి ఇలాంటి వేడి ఉండాలనే నా ఈ సువార్త పరిచర్యలో అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.

మన జీవితాలు మనం ఊహించనిదానికంటే భద్రంగా ఉన్నాయంటే, సుఖ సంతోషాలతో జీవించగలుగుతున్నాం అంటే... కలువరి సిలువలో క్రీస్తు శ్రమపడి పొందిన గాయాలే నిదర్శనం.

ప్రతి గాయం వెనుక ఒక బాధ ఉంటుంది. కాని, క్రీస్తు పొందిన గాయాలు మన జీవితాన్ని రక్షిస్తే, క్రీస్తు కొరకైన శ్రమల వలన పొందిన గాయాలే క్రీస్తుతో శ్రమానుభవములు.

ఓ సేవకుడా, క్రీస్తు సేవలో పొందిన గాయం మచ్చలు చూపించగలిగేంత సేవచేయాలి. మహిమలో ఆయనతో ఉండి నీకోసం సిద్ధం చేసిన నీతికిరీటం కోసం ప్రయాసపడాలి. సిద్దమా?

అనుభవం: ప్రతి గాయం వెనుక ఒక బాధ ఉంటుంది. ప్రతి బాధ వెనుక ఒక ఓర్పు ఉంటుంది. ప్రతి ఓర్పు వెనుక ఒక నిరీక్షణ ఉంటుంది. ఈ నిరీక్షణే క్రీస్తుతో శ్రమానుభవం, శ్రమపై విజయానికి సోపానం.

https://youtu.be/KiLuCyyFbk8

From henceforth let no man trouble me: for I bear in my body the marks of the Lord Jesus.- Galatians 6:17.

We are meditating daily on suffering with Jesus Christ. I hope these experiences are strengthening you.

It would not be so believable if a person who won a war and narrated his experience of winning a battle. If he shows his wounds on his body, the wounds which are evidence makes us believe it to be a victory.

One father had youngest son named Timothy was 6 years old, and the eldest son Philip, was 10 years old. Every Father would have the idea of their children-s future, make them study in any decent school and raise them into a respectable adult! But this father thought differently. He risked himself and his family, for the sake of perishing souls. He was threatened to kill if the gospel was proclaimed. But the father did not listen to the threats. The burden of souls is to withstand threats.

Unexpectedly one night, enemies surrounded and attacked him all over. The father and his two children were burnt alive and martyred. This father was the greatest missionary Graham Staines, who had a quest to save our India by proclaiming the love of Jesus Christ. This incident took place in Manoharpur, which touched me. I shed tears. These experiences I am sharing with you are the part of the gospel ministry I do and I urge that every Christian should have such passion for the Lord.

If our lives are safer than we expected, if we are able to live happily, it is because of the wounds that Christ had on the cross. There is a suffering behind every injury. But, if the wounds inflicted by Christ save our lives, the wounds inflicted by the sufferings for Christ are the best experiences of suffering with Him.

My dear servant of Christ if you want to give the best for the Lord? Then show the wounds you received in the suffering with Christ. To live with Him in the glory.You must strive for the crown of righteousness prepared for you. Are you Ready?

Experience: There is a suffering behind every injury. There is an endurance behind every suffering. There is an expectation behind every endurance. This expectation is the experience of suffering with Jesus Christ, the steppingstone to victory over hardships.

Share this post