- Author: Christian Tracts
- Category: Articles
- Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-Jesus-resurrection.html
యేసుక్రీస్తు మరణమునుండి పునరుత్ధానమవుట వాస్తవమని లేఖానాలు ఖండితమైన ఆధారాన్ని చూపిస్తుంది. యేసుక్రీస్తు పునరుత్ధాన వృత్తాంతామును మత్తయి 28:1-20;మార్కు16:1-20; లూకా 24:1-53; మరియు యోహాను 20:1–21:25 లో పేర్కోంటుంది. పునరుత్ధానుడైన యేసుక్రీస్తు అపోస్తలుల కార్యములు గ్రంధములో కూడ ( అపోస్తలుల కార్యములు 1:1-11) అగుపడుతారు. ఈ లేఖానాల భాగాలనుండి క్రీస్తు పునరుత్ధానుడు అనుటకు అనేక “ఋజువులు”న్నాయి. మొదటిది ఆయన శిష్యులలో వచ్చిన నాటకీయ మైన మార్పు. పిరికివారిగా దాగియున్న ఈ శిష్యులగుంపు శక్తివంతమైన ధైర్యముకలిగి సాక్ష్యులుగా ప్రపంచమంతటికి సువార్తనందించటానికి వెళ్ళారు. ఈ నాటకీయమైన క్రీస్తు అగుపడుట కాక మరి ఏ కారణము చూపుదుము?
రెండవది అపోస్తలుడైన పౌలు జీవితము. సంఘాన్ని హింసించే ఈ వ్యక్తి సంఘానికి అపోస్తలుడుగా మార్పు చెందటానికి కారణం ఏంటి? దమస్కు మార్గమును పునరుత్ధానుడైన క్రీస్తు అగుపడినప్పుడే అది జరిగింది (అపోస్తలుల కార్యములు 9: 1-6). మూడవ ఖండితమైన ఋజువు ఖాళిసమాధి. ఒకవేళ క్రీస్తు పునరుత్ధానుడు కాని యెడల ఆయన దేహము ఏమయ్యింది? ఆయన శిష్యులు మరియు ఇతరులు ఆయనను పాతిపెట్టినటువంటి సమాధిని చూశారు. వారు వెనుదిరిగి వచ్చినపుడు ఆయన శరీరం (శవం)అక్కడ లేదు. వాగ్ధానము చేసిన ప్రకారము మూడవదినమున తిరిగి లేపబడ్డారని దేవదూతలు ప్రకటించారు (మత్తయి 28:5-7). నాలుగవ నిదర్శనము ఆయన పునరుత్ధానుడయ్యాడనుటకు అనేక మందికి ప్రత్యక్ష్యమయ్యాడు (మత్తయి 28:5, 9, 16-17;మార్కు 16:9; లూకా24:13-35; యోహాను 20:19, 24, 26-29, 21:1-14; అపోస్తలుల కార్యములు 1:6-8; 1 కొరింథీయులకు 15:5-7).
యేసుక్రీస్తు పునరుత్ధానానికి అపోస్తలులు ఇచ్చిన అధిక ప్రాముఖ్యమైన మరొక ఋజువు, క్రీస్తు పునరుత్ధానికి 1కొరింధీ 15. ఈ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు క్రీస్తు పునరుత్ధాన్ని విశ్వసించుట. అర్థంచేసికొనుట ఎందుకు మౌళికమైనదో వివరించాడు.ఈ కారణాలుబట్టి పాముఖ్యమైంది. మొదటిది, క్రీస్తు మరణము నుండి పునరుత్ధానుడు కాని యెడల విశ్వాసులు కూడా అవ్వరు (కొరింధీయులకు 15:12-15). రెండు క్రీస్తు మరణమునుండి తిరిగి లేవనియెడల పాపము కోసమే ఆయన చేసిన త్యాగం పరిపూర్ణమైంది కాదు (కొరింధీయులకు 15:16-19). క్రీస్తు పునరుత్ధానుడగుటను బట్టి ఆయన మరణాన్ని మన పాపమునకు ప్రాయశ్చిత్తముగా దేవుడు అంగీకరించునట్లు ఋజువవుతుంది. ఆయన ఒకవేళ మరణించి అదే మరణములో కొనసాగిన యెడల ఆయన త్యాగము పరిపూర్ణమైందికాదు. అంతేకాదు, విశ్వాసుల పాపములు క్షమించబడనేరవు. మరియు వారు మృతులుగానే కొనసాగెదరు (కొరింధీయులకు 15:16-19). నిత్యజీవము అనేది వుండి వుండేదికాదు (యోహాను 3:16). ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రధమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు (కొరింధీయులకు 15:20).
అంతిమముగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచినవారు ఆయనవలె నిత్యజీవముతో లేపబడుతారని లేఖానాలు స్పష్టముచేస్తాయి (1కొరింధీయులకు 15:20-23). యేసుక్రీస్తు పునరుత్ధానము ఏవిధంగా పాపముపై విజయాన్ని అనుగ్రహిస్తుందో మరియు పాపమును జయించుటానికి శక్తి ప్రసాదిస్తుందో ఋజువు పరుస్తుంది(1కొరింధీయులకు 15:24). మహిమా స్వాభావముకలిగిన పునరుత్ధాన శరీరము మనము ఏవిధముగా పొందుతామో వివరిస్తుంది (1కొరింధీయులకు 15:34-39). క్రీస్తు పునరుత్ధానానికి ప్రతిఫలముగా ఆయనయందు విశ్వాసముంచినవారందరు మరణముపై అంతిమ విజయము పొందుతారని ప్రకటిస్తుంది (1కొరింధీయులకు 15:50-58).
క్రీస్తు పునరుత్ధానము ఎంత మహిమ గలిగిన సత్యం! కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృధ్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి (1కొరింధీయులకు 15:58).కాబట్టి బైబిలు ప్రకారము యేసుక్రీస్తు పునరుత్ధానము ఖచ్చితమైన వాస్తవము. క్రీస్తు పునరుత్ధానానికి 400 కంటె ఎక్కువమంది సాక్ష్యులని బైబిలు చెప్తుంది. మరియు ఈ వాస్తవము పై మౌళిక క్రైస్తవ సిధ్ధాంతాన్ని నిర్మిస్తుంది.