Skip to Content

యేసు నందు నా విశ్వాసమును ఉంచియున్నాను....ఇప్పుడు ఏమిటి?

16 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-now-what.html

1.రక్షణను అర్ధం చేసుకున్నావని నిర్ధారణ చేసుకో.

యోహాన్ 5 13 “దేవుని కుమారునిగా మాయ౦దు విశ్వాస ముంచు. మీరు నిత్యజీవము గల వారని తెలిసికొనునట్లు, నేను ఈ సంగతులను మీకు తెలుపుచున్నాను ” రక్షణను అర్థ౦ చేసుకోవాలని దేవుడు కోరుచున్నారు. మనము రక్షింపబడినామనే ఖచ్చితమైన విషయము నందు గట్టి నమ్మకము కలిగియుండాలని దేవుడు కోరుచున్నారు. క్లుప్తముగా రక్షణ యొక్క ముఖ్యమైన అంశములు చూద్దాం:

a) మనమందరము పాపము చేసియున్నాము. దేవుని సంతోషపరచలేని విషయములను మనము చేసియున్నాము (రోమా 3 :23).

b) మన పాపములను బట్టే దేవుని నుండి శాశ్వతమైన ఎడబాటుతో శిక్షించబడుటకు అర్హులము (రోమా 6:23).

(c) మన పాపములకు పరిహారము చెల్లించుటకై శిలువపై మరణించినారు (5 8, 2 కొరింథి 5 21) యేసు మన స్థానములో మరణించి మనము పొందవలసిన శిక్షను ఆయన పొందెను. యేసు యొక్క మరణము మన పాపములకు సరి అయిన పరిహారమని ఆయన పునరుద్ధానము రుజువు చేసెను.

(d) యేసు నందు విశ్వాసము ఉంచిన వారికి, క్షమాపణ, రక్షణ, దేవుడు అనుగ్రహించును- ఆయన మరణము మన పాపములకు పరిహారముగ చెల్లించబడెనని నమ్ముట వలన (యోహాను 3: 16, రోమా 5: 1, 8: 1)

అదే రక్షణ వర్తమానము.యేసుక్రీస్తు నీ రక్షకునిగా నీవు నీ విశ్వాసము ఆయన నందు ఉ౦చినట్లైతే, నీవు రక్షింపబడుదువు. నీ పాపములన్నీ క్షమించబడినవి, నిన్ను ఎన్నడూవిడువను, ఎడబాయను అని దేవుడు వాగ్దానము చేస్తున్నారు (రోమా 8: 38, 39, మత్త 28 :20) యేసే నీ రక్షకుడని నమ్మినట్లైతే, పరలోకమందు దేవునితో శాశ్వత౦గా గడపగలవనే నీకు ధైర్యము వుండును!

2.పరిశుద్ధ గ్రంధమును బోధించే మంచి చర్చిని చూచుకో.

చర్చి అంటే ఒక భవంతి అని తలంచకు. చర్చి అనగా ప్రజలు. యేసు క్రీస్తు నందు విశ్వాస౦ కలవారు. ఒకరితో నొకరు సహవాసము కలిగియుండుట చాలా ముఖ్యము. అది చర్చి యొక్కప్రాథమిక ఉద్దేశ్యములలో ఒకటి ఇప్పుడు నీవు యేసు క్రీస్తు నందు విశ్వాసముంచినందున, మీ ప్రాంతములో బైబిలును నమ్మే చర్చిని కనుగొని, ఆ కాపరితో మాట్లాడవలెనని, మిమ్ములను చాలా ప్రోత్సహిస్తున్నాము. యేసు క్రీస్తు న౦దుంచిన నీ విశ్వాసమును, ఆ కాపరిని గ్రహించనివ్వు !

చర్చి యొక్క రెండవ ఉద్దేశ్యము బైబిల్ నందు బోధించుట. దేవుని ఉపదేశములను నీ జీవితమునకు ఎలా అన్వయించు కోవాలో నీవు నేర్చుకోగలవు. విజయవంతమైన, శక్తివంతమైన క్రైస్తవ జీవితమును జీవించుటకు బైబిల్ ను అర్థము చేసుకొనుటయే తాళపు చెవి. 2 తిమో 3:16,17 లో దైవజ్ఞుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు స౦పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతీ లేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, శిక్షణకును పరిశుద్ధమైన భావము కలిగియున్నది.

చర్చి యొక్క మూడవ ఉద్దేశ్యము ఆరాధన. ఆరాధన అనగా దేవుడు చేసిన వాటన్నిటికి కృతజ్ఞత చెల్లించుట. దేవుడు మనలను రక్షించును. దేవుడు మనలను ప్రేమించును. దేవుడు మనకు సమకూర్చును. దేవుడు త్రోవ చూపి నడిపించును. ఆయనకు కృతజ్ఞత చెల్లించకుండ ఎలా ఉ౦డగలము? దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమగల వాడు, కనికరముగలవాడు; ప్రకటన 4 11, “ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమును బట్టి అనియుండెను. దానిని బట్టియే సృష్టింపబడెను. కనుక నీవే, మహిమ ఘనత, ప్రభావములు పొందనర్హుడవు” చెప్పబడినది.

3.దేవుని కొరకు కొంత సమయము కేటాయించుము.

ప్రతి దినము దేవునిపై దృష్టియుంచుట యందు సమయము గడుపుట చాలా ముఖ్యము. కొంత మంది దీనిని “నిశ్శబ్ద సమయము” అని కొంత మంది “దైవచింతన” అనిఅందురు. ఏలయనగా, మనము దేవునితో గడిపే సమయము. కొంత మంది ఉదయ కాలమును ఎంచుకుంటే మరి కొందరు సాయంత్ర సమయమును ఎంచుకొందురు. ఈ సమయములను ఏమని పిలిచామా, ఎప్పుడు గడిపామా అనేది విషయం కాదు. విషయమేమిట౦టే క్రమముగా దేవునితో గడుపుట ముఖ్యము. ఏ పరిస్థితులు దేవునితో సమయము గడుపునట్లుగ చేయును?

(a) ప్రార్థన అనగా దేవునితో మాటడ్లాడుట. నీ సమస్యల విషయమై దేవునితో మాట్లాడు. నీకు, జ్ఞానమును, దారిచూపుమని దేవుని అడుగు. నీ అవసరాలను తీర్చమని అడుగు. ఆయనను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, ఆయన చేసిన వాటికి, ఆయనను ఎంతగా అభినందిస్తున్నావో ఆయనతో చెప్పు. ప్రార్థన అంటే అదే!

(b) బైబిల్ పఠించుట, చర్చిలో బోధించుట దానికంటె. సండే స్కూల్ లో బైబిలు తరగతుల్లో బోధించిన దానికంటె, నీకు నువ్వు బైబిలు చదువుట అవసరము. విజయవంతమైన క్రైస్తవ జీవితము జీవించుటకు అవసరమైనవన్నీ బైబిల్ (పరిశుద్ధ గ్రంధము) నందు పొందుపరచబడినవి. దేవుని యొక్క మార్గము , జ్ఞానము గల నిర్ణయములు ఎలా తీసుకోవాలో, దేవుని చిత్తమును ఎలా తెలుసుకోవలెనో, ఇతరులకు పరిచర్యలు ఎలా చేయవలెనో ఆత్మీయుడిగా ఎలా ఎదగవలెనో అవన్నీ బైబిలు నందు ఉన్న౦దున బైబిలు మనకు దేవుని మాటయైయున్నది. మన జీవితములు దేవునికి ఇష్టమైన రీతిలో, మనకు తృప్తి కలిగించు రీతిలో జీవించుటకు బైబిల్ దేవుని ఉపదేశ పుస్తకమై యున్నది.

4. ఆత్మ సంబంధంగా నీకు సహాయము చేయు వ్యక్తులతో సంబధము అభివృద్ధిచేసుకొనుము.

“మోసపోకుడి: దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును” (1కొరి 15 33) మనపైన ప్రభావితము చేయు మనుష్యుల గురించి బైబిలు నందు ఎన్నో హెచ్చరికలు ఉన్నవి. పాప సంబంధమైన క్రియలు చేయు వారితో సమయము గడిపినప్పుడు ఆ క్రియల చేత శోధించబడెదవు. నీ చుట్టు వున్న మనుష్యుల శీలము నీ మీద ‘రుద్ద బడును’. కాబట్టి ఎవరైతే దేవుని ప్రేమించి ప్రభువుకు కట్టుబడి ఉ౦టారో వారితో మనము కలిసియుండుట ముఖ్యము.

నిన్ను ప్రోత్సాహ పరచి. నీకు సహాయము చేసే ఇద్దరిని నీ నుండి ఏర్పాటు చేసుకో (హెబ్రీ 3 13 1024) నీవు గడిపే ఒంటరి సమయము, నీవు చేసే పనులు, లెక్క ఒప్ప చెప్పుటకై నీ స్నేహితుని అడుగు. వారి విషయమై నీవు అలాగని యేసు క్రీస్తుని రక్షకునిగా ఎరుగని నీ స్నేహితులందరినీ విడిచి పెట్టమని కాదు. వారికి నువ్వు స్నేహితునిగానే వుంటూ, వారిని ప్రేమించుము. యేసు నీ జీవితం మార్చినాడని, మరియు ఇది వరకు నువ్వు చేసే పనులు ఇప్పుడు చేయవని వారు తెలిసికొననిమ్ము. నీ స్నేహితులతో యేసే నీ జీవితం మార్చినాడని, మరియు ఇది వరకు నువ్వు చేసే పనులు ఇప్పుడు చేయవని వారు తెలిసికొననిమ్ము. నీ స్నేహితులతో యేసు గురించి చెప్పుటకు అవకాశములను ఇవ్వమని దేవుని అడుగుము.

5. బాప్తిశ్మము పొందుడి.

చాలా మందికి బాప్తిశ్మము అంటే తప్పు అభిప్రాయము కలదు. “బాప్తిశ్మము” అను మాటకు అర్థము నీటిలో మునుగుట. బాప్తిశ్మము అనగా క్రీస్తు నందు నీ యొక్క నూతనమైన విశ్వాసము, ఆయనను అనుసరి౦చుటకు నిశ్చయతను ప్రకటించుటయే బైబిల్ ప్రకారం బాప్తిశ్మము అను నీటియ౦దు మునుగు అను క్రియ, క్రీస్తుతో కూడా, పాతి పెట్టబడినావని విశదీకరించుచున్నది. నీటి నుండి పైకి వచ్చుట ద్వారా క్రీస్తు యొక్క పునరుద్ధానమును చూపించుచున్నది. బాప్తిశ్మము పొందుట ద్వారా నీవు క్రీస్తు తో కూడా మరణించి, పాతిపెట్ట బడి పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనలో ఐక్యముగల వాడవై యున్నావు (రోమా 6 3 4), బాప్తిశ్మము నిను రక్షించదు. బాప్తిశ్మము నీ పాపములను కడుగదు. రక్షణ కొరకు, బహిరంగముగా క్రీస్తునందే నీ విశ్వాసమును ప్రకటించుటకు ప్రాముఖ్యమైనది. ఎందుకనగా అది విధేయతతో వేసే ఒక అడుగు. క్రీస్తు నందు నీకున్న విశ్వాసము, ఆయనతో కట్టుబడియున్నావని చెప్పి, బహిరంగముగ తెలియపరచుట.నీవు బాప్తిశ్మము కొరకు సిధ్ధమైతే, మీ పాస్టరును స౦ప్రది౦చ౦డి.


Share this post