Skip to Content

యేసు మన పాపములనిమిత్తము మరణించకముందే ప్రజలు ఏవిధంగా రక్షింపబడ్డారు?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-before-Jesus.html

మానవుడు పడిపోయిన స్థితినుండి రక్షణకు ఆధారము యేసుక్రీస్తుప్రభువుయొక్క మరణమే. ఎవరూ లేరు. అయితే సిలువ వేయబడకముందు లేక సిలువవేసినదగ్గరనుండి, చారిత్రాత్మకంగా జరిగిన ఆ ఒక్క సన్నివేశంకాకుండా ఎవరైనా రక్షించబడగలరా? పాతనిబంధన పరిశుధ్ధుల గతించిన పాపాలకు మరియు క్రొత్త నిబంధన పరిశుధ్ధుల పాపాల నిమిత్తము క్రీస్తుమరణము పాపపరిహారము చెల్లించబడింది.

రక్షణ పొందుటకు కావల్సింది ఎప్పుడూ విశ్వాసము మాత్రమే. ఒకడు రక్షణపొందుటకు విశ్వాసముంచవలసిన అంశం దేవుడే. కీర్తనకారుడు రాశాడు ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు (కేర్తనలు 2:12). ఆదికాండం 15:6 చెప్తుంది అబ్రహాము దేవుని నమ్మెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను (రోమా 4:3-8ని చూడండి). పాతనిబంధన ప్రాయశ్చిత్తార్థ పద్దతి పాపములను తిసివేయలేదు అని హెబ్రీయులకు 10:1-10 వరకు స్పష్టముగా భోధిస్తుంది. అది జరిగింది, ఏది ఏమైనా, దేవుని కుమారుని రక్తము పాపభూయిష్టులైన మానవులకొరకే చిందించిన దినాన్ననుండి అది తీసివేయబడింది.

యుగాలనుండి ఏదైతే మార్పు వస్తుందో దాని విషయం ఏంటంటే అది ఒక విశ్వాసియొక్క నమ్మిక. దేవునికి కావల్సినది ఆ సమయానికి మానవజాతికి ఏదైతే ప్రత్యక్షపరచాడో దానిని ఆధారంగా చేసుకొని నమ్మికయుంచటం. దీనిని క్రమమైన ప్రత్యక్షత అని పిలుస్తారు. ఆదాము, ఆదికాండం 3:15 లో చెప్పబడిన వాగ్ధానమునందు విశ్వాసముంచెను. స్త్రీని నుండి వచ్చిన బిడ్డ సాతానును ఏలును. ఆదాము ఆయనయందు విశ్వాసముంచెను. దృష్టాంతముగా కనపరచుటకు హవ్వ అని పేరు పెట్టెను (20). మరియు అయ్యన అంగీకారమునకు సూచనగా వారికి చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను (వ21). ఆ విషయానికి అంత వరకు ఆదాము ఎరుగును గాని అతడు దానిని నమ్మాడు.

అబ్రహాము వాగ్ధానప్రకారము దేవుని యందు విశ్వాసముంచెను మరియు నూతన ప్రత్యక్షతననుగ్రహించెను ఆదికాండం 12 మరియు 15 లో. మోషేకు ముందుగా, లేఖనాలు వ్రాయబడలేదుగాని మానవజాతి మాత్రము భాధ్యులు. వారికి దేవుడేదైతే ప్రత్యక్షపరచిన దానికి. పాతనిబంధన అంతట , విశ్వాసులందరు రక్షణానుభవములోనికి వచ్చారు. ఎందుకంటె వారు దేవునియందు నమ్మికయుంచారు. ఒక దినాన్న వారి పాపపుసమస్యను ఎవరో ఒకరు పటించుకుంటారని. ఈ దినాన్న, మానవులు వెనక్కి తిరిగి చూచినట్లయితే మన పాపముల నిమిత్తము ముందుగానే ఎప్పుడో భాధ్యత తీసుకున్నాడని ఆయనయందు విశ్వాసముంచటం (యోహాను 3:16; హెబ్రీయులకు 9:28).

యేసుక్రీస్తుదినాలలో ఆయన సిలువ, పునరుథ్ధానాలకు ముందు విశ్వసించిన వారి సంగతి ఏంటి? వారు యేసుక్రీస్తు సిలువపై వారి పాపముల నిమిత్తము మరణించుట వారు పూర్తిగా అవగాహనకిలిగియున్నారా? చివరిగా ఆయన సేవ పరిచర్యలో అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్డలచేతను యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలుపొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా (మత్తయి 16:21-22). అయితే ఈ సమాచారానికి శిష్యులు ప్రతిచర్య ఏంటి? పేతురు ఆయన చేయి పట్టుకొని- ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడును కలుగదని గద్దింపసాగెను. పేతురు మరి ఇతర శిష్యులకు పూర్తి సత్యమేంటో తెలీదు. అయినా వారు రక్షింపబడరు ఎందుకంటె వారి పాపపుసమస్యను దేవుడు భాధ్యత వహిస్తాడని వారికి తెలియదు. యేసు ఏవిధంగా దీనిని నెరవేరుస్తాడో అని ఆదాము,అబ్రహాముమోషే దావీదుకు తెలియదు ఏవిధంగా అని, గాని ఆయనయందు విశ్వాసముంచారు.

ఈదినాన్న యేసుక్రీస్తు పునరుత్ధానమునకు ముందు ప్రజలకున్న ప్రత్యక్షతకంటె ఇప్పుడు చాలావిధాలుగా ప్రత్యక్షపరచబడ్డాడు. మనకు పూర్తిగా తెలుసు పూర్వాకాలమందు నానాసమయములలోను నానా విధాలుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారును ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆకుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను (హెబ్రీయులకు 1:1-2). మనరక్షణ ఇంకను యేసుక్రీస్తుమరణం మీద ఆధాపరపడింది. మన విశ్వాసము రక్షణకు కావాల్సినది. మన విశ్వాసానికి అంశం దేవుడు మాత్రమే. ఈ దినాన్న, మనకొరకు, మన విశ్వాసానికున్నా విషయానికి కర్త, యేసుక్రీస్తు మన పాపములనిమిత్తము సిలువపై మరణించి, చనిపోయి సమాధిచేయబడి, తిరిగి మూడవదినాన్న లేపబడుట (1 క్రింథీయులకు 15: 3-4).


Share this post