Skip to Content

యేసు దేవుడా? యేసు ఎప్పుడైనా దేవుడని అన్నారా?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-is-Jesus-God.html

బైబిల్ లో ఎక్కడా “నేనే దేవుడను” అని ఖచ్చితమైన పదాలతో యేసు గురించి తెలుపలేదు. ఏమయినప్పటికీ, ఆయన దేవుడని తెలుపలేదని కాదు. ఉదాహరణకి యోహాను 10:30 లో “నేనుయు మరియి తండ్రి ఒకరై ఉన్నాము.” మొదట చూడగానే, ఇది దేవుడని చెప్పినట్లు లేదు. ఏమయినప్పటికీ, (యోహాను 10:33) అతని ప్రవచనానికి యూదుల ప్రతిస్పందనను చూస్తే, “నీవు మనుష్యుడవైయుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదుము గాని, మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి”. యూదులు యేసు దేవుడన్న ప్రవచనాన్ని అర్ధo చేసుకున్నారు. తరువాత వాక్యాలలో యూదులు “నేను దేవుడను కాను” అన్న దాన్ని వ్యతిరేకించలేదు. దీనివల్ల మనకు యేసు ఆయన వాస్తవంగా దేవుడని (యోహాను 10:33) లో “నేనుయు మరియు తండ్రి ఒకరై ఉన్నాము.”అని ప్రకటించారు. యోహాను 8:58 మరియొక ఉదాహరణ. అబ్రహాము పుట్టుక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను! మరల యూదులు యేసు పై రాళ్ళు ఎత్తినపుడు బదులు పలికెను (యోహాను 8:59). వారు దైవదూషణ అని నమ్మేటట్లు నేను దేవుడను అని చెప్పడం వంటిది కాకపోతే యూదులు యేసుపై ఎందుకు రాళ్ళు రువ్వాలనుకున్నారు?

యోహాను 1:1 చెబుతుంది “వాక్యము దేవుడై యుండెను.” యోహాను 1:14 ప్రకారం “ఆ వాక్యము శరీర ధారియై యుండెను.” ఇది శరీరంలో యేసు దేవుడైయున్నాడని సూచిస్తుంది. అపోస్తలు 20:28 మనకు తెలుపుతోంది, దేవుడు తన స్వరక్త మిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ...”. తన స్వరక్త ముతో ఎవరు సంఘాన్ని కొన్నారు? యేసు క్రీస్తు. అపోస్తలు 20:28 దేవుడు తన స్వరక్తముతో సంఘాన్ని కొన్నారు. కాబట్టి యేసే దేవుడు!

యేసు గురించి శిష్యుడు, “నా ప్రభువా నా దేవా” అనెను (యోహాను 20:28). యేసు అతనిని సరిచేయలేదు. తీతుకు లో 2:13 మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూడండి అని ప్రోత్సహిస్తుంది- . యేసు క్రీస్తు (2 పేతురు 1:1 కూడా చూడండి). హెబ్రీ 1:8 లో, యేసు తండ్రి గురించి చెబుతారు, తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది, మరియు నీ రాజ దండము న్యాయార్ధమయినది.

ప్రకటనలలో, ఒక దేవదూత యోహానును దేవునికి మాత్రమే నమస్కారము చేయుడని సూచించెను (ప్రకటనలు 19:10).లేఖనాలలో చాలా చోట్ల యేసు పూజలను అందుకున్నారు (మత్తయ2:11; 14:33; 28:9,17; లూకా 24:52; యోహాను 9:38).తనని పూజింజిన వారిని ఎప్పుడూ గద్దించలేదు. యేసు దేవుడు కాని ఎడల, ప్రకటనలలో దైవదూతలు తెలిపిన విధంగా, ఆయనను పూజించవద్దని ప్రజలను వారించెడివాడు. యేసు దేవుడనే వాదలకు లేఖనానలలోని పదబంధాలు మరియు సారాంశాలు ఇంకా చాలా ఉన్నాయి.

ఆయన దేవుడు కాకుండా యేసు దేవుడు కావటానికి ముఖ్య కారణము సర్వ లోక పాపములను చెల్లించుటకు ఆయన మరణము సరిపోయెడిదికాదు (1 యోహాను 2:2). అటువంటి అనంతమైన శిక్షను దేవుడు మాత్రమే చెల్లి౦చగలడు. దేవుడు మాత్రమే సర్వలోక పాపములను తీసుకుని, (2 కొరింథి 5:21), మరణించి- పాపము మరియు మరణమును జయించి మరియు పునరుద్ధానమయ్యెను.


Share this post