Skip to Content

తెగాంతర వివాహముపై బైబిలు ఏమి చెప్తుంది?

  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-interracial-marriage.html

తెగాంతర వివాహము వుండకూడదని పాతనిబంధన ధర్మశాస్త్రము ఇశ్రాయేలియులకు ఆఙ్ఞాపించింది (ద్వితియోపదేశకాండము 7:3-4). ఏదిఏమైనప్పటికి ప్రాధమిక కారణము తెగకాదుగాని మతము. తెగాంతర వివాహము చేసుకొనకూడదని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆఙ్ఞాపించుటకు కారణము ఇతర తెగలకు చెందిన ప్రజలు విగ్రహారాధికులు, మరియు ఇతర దేవతలను ఆరాధించువారు. ఇశ్రాయేలీయులు ఒకవేళ విగ్రహారాధికులను, అన్యులను వివాహమాడినట్లయితే దేవునినుండి దూరపరచబడుతారు. ఇలాంటి నియమమే నూతన నిబంధనలో కూడా ఇచ్చారు. గాని అది వేరే స్థాయిలో వుంటుంది. 2 కొరింధి 6:14, మీరు అవిశ్వాసులతో జోడుగా వుండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఏ విధంగా ఇశ్రాయేలీయులు (నిజమైన ఒక దేవునియందు విశ్వాసముంచినవారు) విగ్రాహారాధికులను పెళ్ళిచేసుకోకూడదని ఆఙ్ఞాపించబడ్డారో అదే విధంగా క్రైస్తవులు (నిజమైన ఒక దేవునియందు విశ్వాసముంచినవారు)అవిశ్వాసులను పెండ్లిచేసుకొనకూడదని ఆఙ్ఞాపించబడుతున్నారు. పైన పేర్కొనబడిన ప్రశ్నకు ఖచ్చితమైన జవాబు లేదు, అని అనాలి. బైబిలు తెగాంతర వివాహము తప్పని ఎక్కడ పేర్కొనలేదు.

మార్టిన్ లూధర్ కింగ్ ప్రస్తావించినట్లు ఒక వ్యక్తి శీలాన్నిబట్టి గాన్ని చర్మపు రంగునుబట్టిగాని (యాకోబు 1:1-10) తీర్పు తీర్చకూడదు. ఒక క్రైస్తవుని జీవితములో తెగ కారణంగా ప్రత్యేకతను సంక్రమించుకోవటం ఎక్కడా లేదు. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకొనేటప్పుడు ఆ వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసముంచి తిరిగి జన్మించినదా లేదా జన్మించినాడా (యోహాను 3:3-5) అనేది మొట్టమొదటిగా నిర్ధారించుకోవాలి. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవటంలో బైబిలు నియమము చర్మపు రంగు కాదు గాని క్రీస్తునందు విశ్వాసమే. తెగాంతర వివాహము ఙ్ఞానము, వివేచన, ప్రార్ధనకు సంభంధించినది గాని నైతికంగా తప్పా సరియైనదా అన్నది కానేకాదు.

తెగాంతర వివాహము విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సింది ఒకే ఒక్క ప్రాముఖ్య కారణన్ని బట్టి- మిశ్రిత తెగ, జోడి, ఒకరినొకరు అంగీకరించుకోవటం విషయంలో కష్టాల్ని ఎదుర్కోవటమే. తెగాంతర వివాహాము చేసుకొన్న భార్యభర్తలు పక్షపాతముతో, ఎగతాళి కొన్ని సార్లు కుటుంబ సభ్యులనుండి అనుభవిస్తారు. మరికొన్ని సార్లు వీరికి జనించిన పిల్లలు వేరువేరు చర్మపు రంగులనుబట్టి వ్యత్యసాన్ని, కష్టాన్ని అనుభవిస్తుంటారు. ఎవరైతే తెగాంతర వివాహము చేసుకోవాలి అని ఆశపడుతున్నారో వారు ఈ పరిస్థితులన్నిటికి సంసిద్దపడాలి. ఒక క్రైస్తవుడు, ఎవర్ని పెళ్ళి ఛేసుకోవాలి అన్న దానిపై బైబిలు పెట్టే ఆంక్ష ఒక్కటే ఆ వ్యక్తి కూడ క్రీస్తు శరీరములో సభ్యుడు లేక సభ్యురాలు అయివుండాలి.


Share this post