- Author: M. Bhanu Prabhudas
- Category: Articles
- Reference: Sajeeva Vahini Jun - Jul 2011 Vol 1 - Issue 5
సర్వాధికారి యొక్క లక్షణాలు:
సర్వాధికారి అయిన దేవుడు వర్తమాన భూతభవిష్యత్కాలములలో ఉండువాడు ప్రకటన 1:8 అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూతభవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువుసెలవిచ్చుచున్నాడు.
సర్వాధికారి అయిన దేవుడు పరిశుద్ధుడు
ప్రకటన 4:8 ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కలలోపటను కన్నులతో నిండియున్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానకు దివారాత్రము చెప్పుచుండెను.
సర్వాధికారి అయిన దేవుడు మహాబలము కలిగి ఏలుచున్నవాడు
ప్రకటన 11:17 వర్తమానభూతకాలములలో ఉండు దేవుడైన ప్రభూవా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
సర్వాధికారి అయిన దేవుని క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి;
ప్రకటన 15:3 వారు - ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి;
సర్వాధికారి అయిన దేవుని తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి
ప్రకటన 16:7 అవును ప్రభువా, దేవు, సర్వాధికారీ, నీ తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవని బలిపీఠము చెప్పుట వింటిని.
సర్వాధికారి యొక్క లక్షణములన్నిటిని బట్టి ఆయన స్తోత్రార్హుడు. రోమ 9:5 ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడైయున్నాడు ఆమెన్.
తండ్రి కుమారునికి అనుగ్రహించిన సర్వాధికారము: సర్వాధికారి అయిన దేవునికి పరలోకమందును భూమిమీదను అధికారము కలదు మత్తయి 28:18 అయితే యేసు వారియొద్దకు వచ్చి - పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. సర్వాధికారి అయిన దేవునికి పాపములు క్షమించుటకు అధికారము కలదు మార్కు 2:10 అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి.... సర్వాధికారి అయిన దేవునికి తీర్పు తీర్చుటకు అధికారము కలదు యోహాను 5:23 తండ్రిని ఘనపరుచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు; సర్వాధికారి అయిన దేవునికి నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరులమీద అధికారము కలదు. యోహాను 17:2 నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరులమీదను ఆయనకు అధికారమిచ్చితివి. ఇన్ని అధికరములను కలిగిన సర్వాధికారిని ఆరాధిస్తున్న మనము ఎంత ధన్యులము. దేవుడు మానవునికి అనుగ్రహించిన అధికారము: కీర్తన 8:6 నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చి యున్నావు. లూక 10:19 శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; మత్తయి 16:18,19 మరియు నీవు పేతురువు, ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దానియెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోకరాజ్యముయొక్క తాళపు చెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. (ఇది దేవుడు పేతురుకి ఇచ్చిన అధికారము). మత్తయి 18:18 భూమిమీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును; భూమిమీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. (ఇది దేవుడు సంఘమునకు ఇచ్చిన అధికారము) మత్తయి 10:1 ఆయన తన పన్నెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమిచ్చెను. ప్రకటన 2:26,27 నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను. కనుక మనము ఈ అధికరములను ఉపయోగించుకుంటూ యెషయా 61:1,2 ప్రకారము, దీనులకు సువర్తమానము ప్రకటించాలి, నలిగిన హృదయముగలవారిని దృఢపరచాలి, చెరలోనున్నవారికి విడుదలను, బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించాలి, యెహోవా హితవత్సరమును ప్రకటించి పరలోక రాజ్యం చేరాలి, చేర్చాలి.