- ఒకరోజు ఒక అడవిలో నాలుగు ఎద్దులు ఒక చోట గడ్డి మేస్తూ వున్నాయి.........
- కొంతసేపటికి అక్కడికి ఒక సింహం వచ్చింది. వాటిని చూసి వాటిపై కన్నేసింది..
- అయితే అవి ఎంత సేపైనా ఒక్కటిగా ఒకచోటనే మేస్తూ వున్నాయి..
- ఏమి చేయలేక సింహం ఆలోచిస్తుండగా అటు వైపు ఒక జిత్తులమారి నక్క వచ్చింది..
- సింహానికి ఒక మంచి ఆలోచన వచ్చి నక్కను పిలచి నక్కకు దాని పధకాన్నివివరించింది.
- నక్క దానికి సరేనని పధకాన్ని అమలు చేసేందుకు వాటికి దగ్గరగా వెళ్ళింది.
- అది వెళ్లి.. ముందుగా ఆ గుంపులోని దాని రాకను గమనిస్తున్న ఒక ఎద్దును దగ్గరగా రమ్మని పిలిచింది.
- అది నక్క దగ్గరకు వెళ్ళింది.. వెళ్ళాక దాని చెవిలో నక్క ఏమీ లేదు అని చెప్పింది.
- అర్ధం కాక అది మరల అడిగేప్పటికి మరలా చెవిలో ఏమీ లేదు అంది.
- సరేనని అది వెళ్ళిపోయి మిగతావాటితో చేరి, మేస్తూ వుంది. అయితే ఆ గుంపులో మిగతావి ధీనిని నక్క చెవిలో ఏం చెప్పిందని ప్రశ్నించాయి..
- ఏమీ లేదని చెప్పింది అనగానే వాటికి అర్ధం కాక మరలా అడిగాయి .....అలానే చెప్పింది అంది..
- అయితే వీటికి బాగా కోపం వచ్చి నువ్వు అబద్దం చెప్తున్నావ్..
- మీరిద్దరూ మా మీదనే ఏదో చెప్పుకున్నారు... ఏమి చెప్పిందో చెప్పు అంటూ గొడవకు దిగాయి.
- ఇది వాటికి చెప్పి చెప్పి, ఇక వాదించలేక దూరంగా వెళ్లి పోయి వేరొక చోట గడ్డి మేయసాగింది.
- దీని కోసమే ఎదురుచూస్తున్న సింహం దానిని గమనించి వెంటాడి వెంటాడి చంపి తినేసింది..
- చివరిలో మిగిలిన మాంసాన్ని నక్క వచ్చి ఆరగించింది.
- ఇలా అవి రెండూ రోజుకొక ఎత్తుని వేసి దున్నలను వేరు చేసి అన్నిటినీ తినేశాయి..
- Moral:
- ఫ్రెండ్స్.....
- ఇది చిన్న పిల్లల నీతి కదే అయినప్పటికీ.... దీని నుండి మనం తెలుసుకోవాల్సింది చాలా వుంది...
- ఆ ఎద్దులు ఎపుడైతే ఒకటిగా ఒక చోటనే వున్నాయో శత్రువైన సింహానికి వాటిని వేటాడడానికి శక్తి చాలలేదు...
- అందుకే ఏమీ చేయలేకపోయింది..అయితే ఎపుడైతే నక్క ఒక్కొక్కదాని దాని కుయుక్తితో మోసం చేసి మబ్యపరచి
- వాటిలో వాటికే తగాదాలు, విభేదాలు సృష్టించిందో అవి ఒక్కొక్కటిగా వేరై పోయి శత్రువు చేతికి చిక్కోపోయాయి
- అలానే మన విశ్వాస సహవాస జీవితంలో క్రీస్తులో మనందరం ఐక్యత కలిగి ఎప్పుడైతే ఒక్కటిగా జీవిస్తామో
- అపుడు గర్జించు సింహం వంటి సాతాను మనల్ని ఏమీ చేయలేదు
- కాని అదే మనం మోసపూరితమైన లోకపు మాటల వైపు ద్రుష్టిస్తామో మనలను వాడు వంచించి పతనం చేస్తాడు.
- మనం చాలా జాగ్రత్తగా వుండాలి, మన శత్రువైన సాతాను ఎవరిని మ్రింగుదునా అని ఘర్జించు సింహం వలె చూస్తున్నాడు,
- పొరపాటున ఏ విషయం లో నైన చిక్కామా ?.. అంతే ఈడ్చుకుని తీసుకెళ్ళిపోతాడు లోకంలోకి..
- అన్ని వేళలా అన్ని చోట్లా అన్ని విషయాల్లో చాలా ఆచి తూచి నడవాలి..
- అన్నిటి కంటే ముందు మనం ఐక్యతను విడువకూడదు.
- సహోదరులు ఐక్యత కలిగి యుండుట ఎంత మేలు.. ఎంత మనోహరమూ...