Skip to Content

రక్షణ విశ్వాసము వలనే కలుగుతుందా? లేక క్రియలుకూడా అవసరమా?

16 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-faith-alone.html

క్రైస్తవ సిధ్దాంతములోనే బహుశా యిది అతి ప్రాముఖ్యమైన అంశంకావచ్చు. ఈ ప్రశ్న ప్రొటెస్టెంటు, ఖథోలిక్ సంఘాలకు మధ్యన విభజనకు, మరియు దిద్దుబాటుకు (రిఫర్మేషన్- మతోథ్దారణకు) దారితీసింది. బైబిలుకేంద్రిత క్రైస్తవత్వానికి, అబద్ద భోధనలకు మద్యన తారతమ్యం చూపించే ప్రాముఖ్యమైన అంశం కూడా ఇదే. రక్షణ విశ్వాసమువలనే కలుగుతుందా? లేక క్రియలుకూడా అవసరమా? నేను రక్షణపొందటానికి యేసుప్రభువునందు విశ్వాసముంచితే సరిపోతుందా లేక ఇంకేమైనా పనులు చేయాల్సిన అవసరం వుందా?

రక్షణ విశ్వాసము ద్వారానే మరియు విశ్వాసముతోకూడిన పనులవలనే అనే ఈ రెండు అంశాలుకు సంభందించి, ఖఛ్చితమైన వాక్యభాగాలు వుండటంబట్టి ఈ ప్రశ్న మరింత జఠిలంఅవుతుంది. రోమా 3:28: 5:1; గలతీ 3:24; యాకోబు 2:24 తో పోల్చిచూడండి. కొంతమంది పౌలు (రక్షణ విశ్వాసము వలనే) మరియు యాకోబు (రక్షణ విశ్వాసముతో కూడిన క్రియలువలన) మధ్య వ్యత్యసాన్ని చూస్తుంటారు (ఎఫెసి 2:8-9). విశ్వాసముమూలముగానే నీతిమంతుడుగా తీర్పుతీర్చబడుతారు అని పౌలు ఖండితముగ భోధిస్తే యాకోబు విశ్వాసమునకు క్రియలు జోడిస్తున్నట్లు అనిపిస్తుంది. యాకోబు యేమి రాస్తున్నాడు అని గమనించినట్లైతే ఈ విభేధాన్ని తొలగించుకోవచ్చు. ఓవ్యక్తి మంచి క్రియలులేకుండా విశ్వాసము కల్గియుండవచ్చు అనే నమ్మకాన్ని యాకోబు తృణీకరిస్తున్నాడు (యాకోబు 2:17-18). యేసుక్రీస్తునందు యధార్దమైన విశ్వాసము మార్పునొందిన జీవితముగా, మంచిక్రియలుగా ఫలిస్తుందని యాకోబు నొక్కివక్కాణించాడు (యాకోబు 2:20-26). నీతీమంతుడుగా తీర్పుతీర్చబడుటకు విశ్వాసంతోకూడిన క్రియలు అవసరము అని యాకోబు చెప్పడంలేదుగాని విశ్వాసముతో నీతిమంతుడుగా తీర్పు తీర్చబడిన వ్యక్తి జీవితములో మంచి క్రియలు ఖచ్చితముగా వుంటాయని యాకోబు చెప్పుతున్నాడు. ఓ వ్యక్తి విశ్వాసిని అని చెప్పుకొంటూ జీవితములో మంచి క్రియలు కనపర్చకపోనట్లయితే యేసుక్రీస్తునందు యధార్దమైన విశ్వాసము లేనట్లే(యాకోబు 2:14, 17, 20, 26).

పౌలు తన రచనలలో అదే విషయం చెప్పుతున్నాడు. ఓ విశ్వాసికి వుండాల్సిన మంచి ఫలముల జాబితను గమనించవచ్చు (గలతీ 5:22-23). మనకు క్రియలను బట్టి కాక విశ్వాసము వలననే రక్షణ అని భోధించిన పౌలు (ఎఫెసి 2:8-9), మంచి క్రియలు చేయుడానికే మనం సృజించబడ్డామని పౌలు తెల్పుతున్నాడు(ఎఫెసి 2:10). జీవితములో మార్పు అవసరమని యాకోబు భోధించినట్లే పౌలు కూడా ఆశిస్తున్నాడు.కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను. ఇదిగో క్రొత్తవాయెను (2కొరింధి 5:17). రక్షణకు సంభంధించిన విషయంలో యాకోబుపౌలు ఒకరినొకరు విభేధించుకోవడంలేదు. ఒకే అంశాన్ని వేర్వేరు కోణంలో భోధిస్తున్నారు. విశ్వాసము ద్వారానే ఒకడు నీతిమంతుడుగా తీర్చబడును అని పౌలు క్షుణ్ణంగా నొక్కివక్కాణిస్తే క్రీస్తునందు అట్టి యధార్దమైన విశ్వాసము మంచిక్రియలుగా ఫలిస్తుందని యాకోబు వొక్కాణించాడు.


Share this post