Skip to Content

ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం అంటే ఏంటి?

  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-substitutionary-atonement.html

ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు పాపులకు బదులుగా మరణించుట సూచిస్తుంది. లేక్ఝానాలు భోధిస్తున్నాయి మానవులందరు పాపులని (రోమా 3:9-18, 23).పాపమునకు శిక్ష మరణము. రోమా 6:23 చదివినట్లయితే ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.

ఈ వచనం చాల విషయాలు మనకు భోధిస్తుంది. క్రీస్తులేకుండా, మనము చనిపోయినట్లయితే నరకములో నిత్యత్వాన్ని గడపాలి. ఎందుకంటే పాపమునకు వెల కాబాట్టి. లేఖనాలలో మరణము వేరుపరచబడటం ను సూచిస్తుంది. ప్రతీ ఒక్కరూ చనిపోతారు, అయితే కొందరు నిత్యత్వములో దేవునితో పరలోకములోనుంటారు. మరికొంతమంది నిత్యత్వం నరకములోనే జీవిస్తారు. ఇక్కడ చెప్పబడిన మరణం అది నరకములో జీవించే దాని గురుంచి సూచిస్తుంది. ఏదిఏమైనా, రెండవ విషయం ఈ వచనభాగం భోధిస్తుంది, నిత్యజీవం కేవలం యేసుక్రీస్తు ద్వారానే లభించును. ఇదే ఆయన ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం.

యేసుక్రీస్తు సిలువ వేయబడినపుడు ఆయన మనకు బదులుగా మరణించాడు. మనము ఆరీతి మరణము, సిలువమీద చనిపోవటానికి యోగ్యులము ఎందుకంటె మనమే పాపపూరితమైన జీవితం జీవిస్తున్నాము కాబట్టి. అయితే క్రీస్తు ఆపాప శిక్షను ఆయన తనపై మనకు బదులుగా వేసుకున్నాడు- తనకు తానే మనకు ప్రత్యమ్నాయం ఆయనే మనము ధర్మముగా యోగ్యులమైన దానికి ఆయనపై తీసుకున్నాడు ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను (2 కొరింథీ 5:21).

మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను (2 పేతురు 2:24)- ఇక్కడ మరలా మనము చూస్తున్నాం. క్రీస్తు మనము చేసిన పాపాలను ఆయనపై వేసుకొని, ఆపాపములకు తనకు తానే వెలచెల్లించటానికి. కొన్ని వచనాల తర్వాత మనం చదువుతాం ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు , అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరములో చంపబడియు , ఆత్మ విషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను (1 పేతురు 3:18). ఈ వచనాలు మాత్రమే క్రీస్తు మనకొరకు చేసిన ప్రత్యామ్నాయం గురుంచి భోధించుటలేదుగాని ఆయన ఒక్కసారే ప్రాయశ్చిత్తం లేక పరిహారం చెల్లించారనికూడా భోధిస్తున్నది. దాని అర్థం పాపభురితమైన మానవపాపానికి వెల చెల్లించి దానిని సంతృప్త్జిచేసాడు.

మరొక పాఠ్యభాగము ఆ ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం గురుంచి ప్రస్తావిస్తుంది యెషయా 53:5. ఈ వచనం మన పాపాముల నిమిత్తమై సిలువపై చనిపోవాల్సిన క్రీస్తు మొదటి రాకడ విషయమై ఉచ్చరిస్తుంది. ప్రవచనాలు చాలా వివరంగా ఉన్నవి. మరియు సిలువపై చంపివేయబడటం ముందుగానే జరిగినవి. మన యతిక్రమక్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్ధమైన శిక్ష అతనిమీద పడెను. అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రత్యామ్నాయాన్ని” గుర్తించండి. ఇక్కడ మరలా క్రీస్తు మన పాపంకై వెల చెల్లించుట చూస్తూన్నాం.

మనం మన పాపములనిమిత్తమై మనమే శిక్షనొంది వెలచెల్లించుటవలన మరియు నిత్యత్వం అనే నరకములో జీవించుటవలన వెల చెల్లించవచ్చు. గాని దేవుని కుమారుడు యేసుక్రీస్తు, ఈ భూమిమీదకు కేవలం మన పాపాలకు చెల్లించాల్సిన వెల చెల్లించటానికి వచ్చాడు. ఎందుకంటె ఇది మనకొరకు ఆయన చేశాడు. ఇప్పుడు మనకు ఒక తరుణం ఇవ్వబడింది, అది ఆయన మన పాపములను క్షమించుటయే కాదు గాని, నిత్యత్వమూ ఆయనతోనే గడపటానికి కూడ ఇచ్చాడు. ఈ విధంగా చేయటానికి మనము యేసు సిలువపై చేసిన క్రియయందు విశ్వాసముంచడమే. మనలను మనం రక్షించుకోలేం. మనకు, మన బదులు మన స్థలం తీసుకోవడానికి ప్రత్యామ్నాయం కావాలి. యేసుక్రీస్తు మరణమే మనకు ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం.


Share this post