Skip to Content

ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి కోడులు మరియు గుర్తింపు వ్యవస్థలు

18 July 2024 by
Sajeeva Vahini
  • Author: Bro. Samuel Kamal Kumar
  • Category: Articles
  • Reference: Jesus Coming Soon Ministries


1. అంతర్జాతీయ గుర్తింపు వ్యవస్థలో జరుగుతున్న సన్నాహాలు మరింత ఊపందుకుంటాయని మనము తెలుసుకున్నాం.

2. గుర్తింపు కార్డులను తమ ప్రజలకు ఎన్నో దేశాలు ఇప్పటికే అందజేశాయి మరియు ఇతర దేశాలు కూడా అదే మార్గంలో ఇప్పుడు పయనిస్తున్నాయి.

3. పిల్లలు మరియు కుక్కల శరీరంలోకి ఇప్పటికే చిప్స్ చొప్పించడం జరిగింది.

4. బియ్యపు గింజ సైజులో స్మార్ట్ కంప్యూటర్ చిప్ అయినా బయోచిప్ సృష్టి ఇప్పటికే ఉన్న విషయాన్ని మనం చూశాం. దీనిని వ్యక్తి యొక్క చర్మము క్రింద అమర్చవచ్చు.

5. బయో చిప్లను ట్రాన్స్ పాండర్స్ అని కూడా పిలుస్తారు. ఇవి వివిధ పరిమాణాల్లో లభిస్తాయి. అతి చిన్న బయోచిప్ యొక్క సైజు బియ్యపు గింజ అంతగా 11 మిల్లీమీటర్లలలో (mm) ఉంటుంది. ఈ చిప్ పైభాగంలో గాజు ట్యూబ్ ఉంటుంది. లోపల ఒక చిన్న మైక్రోచిప్ ఉంటుంది. దానిలో గుర్తింపు సంఖ్య, కెపాసిటర్ మరియు ఆంటీనా కాయిల్స్ ఉంటాయి. ఇవి ఒక చిన్న రేడియో అంటీనాలాగా గా పని చేస్తాయి. బయట నుండి సంకేతాలను సేకరించి లోపలికి పంపుతుంది. దీనికి బ్యాటరీల అవసరం లేదు మరియు పాడైపోయే అవకాశం లేదు. స్కానర్ నుండి వచ్చే తక్కువ  రేడియో తరంగాలతో దీన్ని శక్తివంతం చేయవచ్చు.

6. ప్రపంచంలో అనేక కోట్ల మంది ప్రజలపై బయో చిప్స్ ఇప్పటికే ప్రయోగించి చూశారు. మన దేశంలో కూడా ఆధార్ కార్డు లాంటివెన్నో ప్రజలంతా పొందారు. ఇవన్నీ కూడా 66 6సంఖ్యను గుర్తు చేస్తున్నాయి. 666 నమూనా ఈ కార్డులలో మనం చూస్తాం. ఈ కోడ్ ఎవరు ఎక్కడ ఉన్నా అత్యంత సులభంగా దొరికించే వ్యవస్థ. ఈ వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వ ఆధీనములో ఉంటుంది.

7. సంఘం ఎత్తబడిన తరువాత ప్రపంచం చివరికి క్రీస్తు విరోధి చేతిలోనికి వెళ్లినప్పుడు నియంతయైన క్రీస్తు విరోధి ఈ వ్యవస్థను వాడుకొని తానే దేవుడిని అని చెప్పుకొని ఈ లోకాన్ని తన పాలన క్రిందికి తెచ్చుకుంటాడు.విడువపడిన వారిని శ్రమల పాలు చేస్తాడు. మరియు నీవు ఎత్తబడే గుంపులో ఉంటావో లేదో విడువబడి ఈ భూమి మీద ఈ నియంతపాలన క్రింద ఉంటావో నీవే నిర్ణయించుకో.కావున దేవుని వాక్యం విని చదివి రక్షించబడి ప్రభు రాకడకు నీవు సిద్దపడి ఆయనను మహిమ పరచే వ్యక్తిగా ముందు సాగిపోవాలని కోరుచున్నాను.దేవుడుమిమ్మును దీవించునుగాక. ఆమెన్!




Share this post