Skip to Content

పరిశుధ్ధాత్మ బాప్తిస్మము అంటే ఏంటి?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-baptism-Spirit.html

పరిశుధ్ధాత్ముని యొక్క బాప్తిస్మము ఈ విధంగా నిర్వచించబడింది అదేమనగా పరిశుధ్ధాత్మ దేవుని కార్యము ఒక విశ్వాసిలో రక్షణ క్రియ జరిగిన క్షణములో ఆ వ్యక్తిని క్రీస్తుతో ఏకము చేయుటకు మరియు క్రీస్తు శరీరములోని ఇతర విశ్వాసులతో ఐక్యముచేయును. ఈ పాఠ్యభాగము మొదటి కొరింథీయులు 12: 12-13 బైబిలులో పరిశుధ్ధాత్మ బాప్తిస్మమును గూర్చిన కేంద్ర పాఠ్యభాగముగా ఎంచబడింది ఏలగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తీస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానముచేసినవారమైతిమి ( 1 కొరింథీయులు 12: 12-13). అప్పుడు రోమా 6:1-4 దేవుని ఆత్మనుగూర్చి విశేషంగా నొక్కి వక్కాణించలేదుగాని అది తప్పక దేవుని యంది ఒక విశ్వాసియొక్క స్థితిని వివరిస్తూ ఆ భాషకు సమతుల్యమైన పాఠ్యభాగమే 1 కొరింథీ పాఠ్యభాగము: ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగులేపబడెనో, ఆలాగే నూతనజీవము పొందినవారమై నడచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలుపొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి.

ఈ దిగువ చెప్పబడిన వాస్తవాలు చాల అగత్యమైనవి. ఎందుకంటె ఆత్మ బాప్తిస్మము గూర్చిన అవగాహనను వివక్షించి ఘనీకరించుటకు దోహదపడ్తుంది. మొదటిది, 1 కొరింథీయులు 12:13 స్పష్టంగా వర్ణిస్తుందేంటంటే ఒక్క ఆత్మయందే బాప్తీస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానముచేసినవారమైతిమి(అంతర్వర్తియైన ఆత్మ).రెండవది, లేఖనములు ఎక్కడ ఒక వ్యక్తి ఆత్మలో, తో, ద్వారా బాప్తిస్మముపొందవలెనని లేక పరిశుధ్ధాత్మ యొక్క బాప్తిస్మము కొరకు వేడుకొనవలెనని అర్థమిచ్చురీతిలో వక్రీకరించి చెప్పలేదు. మూడవది ఎఫెసీ 4:5 ఆత్మ బాప్తిస్మను సూచిస్తున్నట్లు అగుపడ్తుంది. ఇదే వాస్తవమయినట్లయితే ఒకే విశ్వాసము మరియు ఒకే తండ్రి అన్నట్లు ప్రతీ విశ్వాసిలో ఆత్మబాప్తిస్మకార్మము సత్యమే.

ఇక సమాప్తిలో పరిశుధ్ధాత్మునియొక్క బాప్తిస్మము రెండు పనులు చేయును. 1) క్రీస్తు శరీరములోనికి మనలను చేర్చును,మరియు 2). మనము క్రిస్తుతో సహా సిలువవేయబడ్డాము అనేది వాస్తవమని నిరూపించును. ఆయన శరీరములో ఉనికి కలిగియున్నాము అంటే నూతనజీవము పొందుటకై ఆయనతో కూడా తిరిగి లేపబడితిమి ( రోమా 6:4). 1 కొరింథీ 12:13 లో చెప్పిన సంధర్భ ప్రకారము శరీర అవయవములు అన్ని సక్రమంగాపనిచేయుటకు వ్యాయామము చేయునట్లు ఆత్మీయవరముల విషయములో కూడ వ్యాయామము చేయవలెను. ఎఫెసీ 4:5 చెప్పిన సంధర్భములో ఒకే ఆత్మ బాప్తిస్మమును అనుభవించినట్లయితే అది సంఘ ఐక్యతను కాపడుటకు ఆధారమవుతుంది.ఆత్మ బాప్తిస్మము ద్వారా ఆయన మరణము, సమాధిచేయబడుట మరియు తిరిగిలేపబడుటలో ఆయనతో సహా పాలిభాగస్థులమవుటవలన మనలను అంతర్వర్తియైన పాపపు శక్తినుండి వేరుచేసి నూతనజీవములో నడచునట్లు మనలను స్థాపించును ( రోమా 6:1-10; కొలస్సీయులకు 2:12).


Share this post