Skip to Content

పరిశుధ్దాత్ముడు ఎవరు?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-Holy-Spirit.html

పరిశుద్ధాత్ముని గుర్తింపు విషయమై అనేక అపోహాలున్నాయి. కొంతమంది పరిశుద్ధాత్ముని ఒక అతీత శక్తిగా పరిగణిస్తారు. క్రీస్తును వెంబడించువారందరికి దేవుడనుగ్రహించు పరిశుద్ధాత్ముడు కేవలము శక్తి అని అర్ధమౌతుంది. పరిశుద్ధాత్ముని గురించి బైబిలు ఏమని భోదిస్తుంది? బైబిలు ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు దేవుడు అని తెలియచెప్పుతుంది. పరిశుద్ధాత్ముడు మనస్సు, భావోద్రేకాలు, చిత్తం కల్గియున్న దైవికమైన (దైవ)వ్యక్తి అని బైబిలు భోదిస్తుంది.

అపోస్తలుల కార్యములు 5:3-4 వచనాలతో సహా పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా దేవుడు అని అనేక పాఠ్యభాగాలలో చూడవచ్చు. ఈ వచనంలో పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా నీవు అబద్దమాడితివని పేతురు అననీయాను ఖండించి, మరియు “నీవు మనుష్యులతోకాదు గాని దేవునితోనే అబద్దమాడితివని” వానితో చెప్పెను. పరిశుద్ధాత్మునితో అబద్దమాడితే దేవునితోనే అబద్దమాడినట్లు అని ఇక్కడ బహిర్గతమౌతుంది. దేవునికి మాత్రమే వుండదగిన స్వభావలక్షణాలు పరిశుద్ధాత్ముడు కల్గియుండుటనుబట్టి, పరిశుద్ధాత్ముడుకూడా దేవుడే అని తెల్సుకోవచ్చు. కీర్తన 139: 7-8 లో : “నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పారిపోవుదును? నీ సన్నిదినుండి నేనెక్కడికి పారిపోవుదును?” మరియు 1కొరింధి 2:10-11 లో పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞాని అనే లక్షణం వున్నదిఅంటానికి నిదర్శనమైయున్నది. “మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి యున్నాడు. ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములనుకూడ పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు మనుష్యాత్మకేగాని మనుష్యులలో మరి ఎవనికిని తెలియదు. ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకేగానీ మరి ఎవనికిని తెలియవు.”

మనస్సు, భావోద్రేకం, చిత్తం ఈ లక్షణాలు కల్గియుండటాన్ని బట్టి పరిశుధ్ధాత్ముడు తప్పనిసరిగ్గా దైవికమైన వ్యక్తి. పరిశుధ్ధాత్ముడు అన్నిటిని ఆలోచించేవాడు, తెలుసుకోగలిగేవాడు (1 కొరింధి 2:10), పరిశుధ్ధాత్ముని ధుఖపరచవచ్చు.(ఎఫెస్సి 4:30), ఆత్మ మనకొరకు విజ్ఞాపనచేస్తాడు (రోమా 8:26-27). తన చిత్తానుసారముగా నిర్ణయాలుతీసుకుంటాడు (1కొరింధి 12: 7-11). పరిశుద్ధాత్ముడు దేవుడు, త్రిత్వములోని మూడవ వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువు వాగ్ధానం చేసినట్లుగా దేవునిలాగే పరిశుద్ధాత్ముడు కూడ ఆదరణకర్తగా, భోధకుడుగా(యోహాను 14:16;26; 15:26) వ్యవహరిస్తాడు.


Share this post