Skip to Content

పచ్చబొట్లు / శరీరమును చీల్చుకొనుట గురించి బైబిలు ఏమి చెప్తుంది?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-tattoos-sin.html

పాత నిబంధన ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆఙ్ఞ, చచ్చినవారికొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు; నేను మీ దేవుడైన యెహోవాను (లేవీకాండము 19:28). నేటి విశ్వాసులకు పాత నిబంధన ధర్మశాస్త్రము వర్తించకపోయిన (రోమా 10:4; గలతీయులకు 3:23-25; ఎఫెసీయులకు 2:15) పచ్చబొట్టుకు వ్యతిరేకంగా వున్న ఆఙ్ఞ కొన్ని ప్రశ్నలను లేవనెత్తాలి. విశ్వాసులు పచ్చబొట్టును కలిగి యుండవచ్చా లేదా అన్న విషయంపై క్రొత్త నిభందన ఏమి చెప్పలేదు.

ఓ పరీక్ష ద్వారా పచ్చబొట్టు శరీరము చీరుకొనుట సరియైనదా కాదా అని నిర్థారించుటకు యధార్థంగా మంచిమనసాక్షితో ఆ ప్రక్రియను తన మంచి ఉద్డేశ్యాలకు ఆశీర్వదించమని దేవున్ని అడగటమే (1కొరింధి 10:31). క్రొత్త నిబంధన పచ్చబొట్లు, శరీరమును చీల్చుకొనుట విషయమై వ్యతిరేకంగా ఏ ఆఙ్ఞ లేదు. అయితే దేవుడు వాటిని అనుమతిస్తున్నాడని హేతువును కూడా ఇవ్వలేదు.

బైబిల్ ఏ యే విషయాలలో నిర్ధిష్టమైనటువంటి సూత్రాలను ప్రస్తావించదో ఆ విషయాలలో దేవునికి ప్రీతికరంగా ఆ ప్రక్రియ ఉంటుందా లేదా అని అనుమానించాలి. “విశ్వాసమూలము కానిది యేదో పాపము” అని రో మా 14:23 ప్రస్తావిస్తుంది. మన దేహములు మన ప్రాణాలు విమోచించబడ్డయాని, అది దేవునికి చెందాయని ఙ్ఞాపకముంచుకోవాలి. 1 కొరింధి 6:19-20 పచ్చబొట్టు, శరీరము చీరుకొనుట విషయమై నేరుగా ప్రస్తావించపోయినప్పటికి ఒక నియమానైతే సూచిస్తుంది. “మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుధ్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.” ఈ గొప్ప సత్యము మన శరీరవిషయములో ఏమి చేస్తామో అన్న దాన్నిపై ప్రభావం చూపాలి. మన శరీరములు దేవునికి చెందినవైతే, వాటిపై పచ్చబొట్టు వేయుటకు లేక శరీరము చీరుటకు ఆయన దగ్గరినుండి ఖచ్చితమైన అనుమతి కలిగివుండాలి.


Share this post