Skip to Content

పాతనిబంధనలోని ధర్మశాస్త్రమునకు క్రైస్తవులు విధేయత చూపించాలా?

16 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-Christian-law.html

ఈ అంశమును అవగాహన చేసుకొనుటకు మూల కారణము పాతనిబంధనలోని ధర్మశాస్త్రము ప్రాధాన్యముగా ఇశ్రాయేలీయులకే గాని క్రైస్తవులకు కాదుఅన్నది. ఇశ్రాయేలీయులు విధేయత చూపించటం ద్వారా దేవునిని ఏవిధంగా సంతోషపెట్టాలని కొన్ని ఆఙ్ఞలు బహిర్గతము చేస్తున్నాయి (ఉదాహరణకు: పది ఆఙ్ఞలు).మరి కొన్నైతే ఇశ్రాయేలీయులు దేవునిని ఏవిధంగా ఆరాధించాలి అంటే ప్రాయశ్చిత్తం చెల్లించాలి (బలి అర్పించే విధానము). మరి కొన్ని నియమములు ఇశ్రాయేలీయులను ఇతర రాజ్యాలనుంచి ప్రత్యేకించటానికి (ఉదాహరణ: ఆహారపు పద్దతులు, దుస్తులు) పాతనిబంధనలోని ధర్మశాస్త్రముకూడా నేడు మనపై కట్టుబడిలేదు. యేసుక్రీస్తు ప్రభువువారు సిలువమీద చనిపోయినపుడు పాతనిబంధన ధర్మశాస్త్రమును అంతమొందించారు (రోమా 10:4; గలతీ 3:23-25; ఎఫెసీ 2:15)

పాతనిబంధన ధర్మశాస్త్రమునకు బదులుగా క్రీస్తు నియమము క్రింద మనము తేబడ్డాము (గలతీ 6:2)అదేదనగా, “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆఙ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆఙ్ఞయు దానివంటిదే” (మత్తయి 22:37-39). ఈ రెండు ఆఙ్ఞలకు ధర్మశాస్త్రమునకు విధేయత చూపించినవారు యేసుక్రీస్తు ఆశించినవన్ని పరిపూర్ణము చేసినట్లే, “ఈ రెండు ఆఙ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమైయున్నవని” అతనితో చెప్పెను (మత్తయి 22:40). దీన్ని అర్ధం పాతనిబంధన ధర్మశాస్త్రము నేటికి వర్తించదని కాదు. దానిలోని అనేక ఆఙ్ఞలు, దేవునిని ప్రేమించడం, పొరుగువారిని ప్రేమించడం అనేవి జాబితాలో వున్నవే. “దేవునిని ఏవిధంగా ప్రేమించాలి,” “పొరుగువారిని ప్రేమించడంలో” ఏముంటాది అనేదానికి/ అనితెలుసుకోవటానికి పాతనిబంధన ఒక మంచి దిక్సూచి. అదే సమయంలో పాతనిబంధన ధర్మశాస్త్రము నేటి క్రైస్తవులకు వర్తిస్తాది అనేది పొరపాటే. పాతనిబంధన ధర్మశాస్త్రమంతటినీ ఒకటిగా తీసుకోవాలి (యాకోబు 2:10). అయితే పూర్తిగా వర్తిస్తాది లేకపోతే పూర్తిగా వర్తించకుండా పోతాది. యేసుక్రీస్తు ప్రభువువారు ప్రాయశ్చిత్తార్ధబలిని నెరవేర్చినట్లయితే దానిని పరిపూర్ణంగా నెరవేర్చినట్లే.

“మమాయన ఆఙ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆఙ్ఞలు భారమైనవి కావు” (1 యోహాను 5:3). పది ఆఙ్ఞలు ప్రాధామికంగా పాతనిబంధన ధర్మశాస్త్రము యొక్క సారాంశము. పదింట తొమ్మిది ఆఙ్ఞలు క్రొత్త నిబంధనలో బహు స్పష్టముగా తిరిగి చెప్పబడ్డాయి (సబ్బాతు దినము పాటించండి అనే ఆఙ్ఞ తప్ప మిగిలినవి). ఎందుకంటే ఎవరైతే దేవునిని ప్రేమిస్తున్నారో వారు ఇతర దేవుళ్ళను ఆరాధించరు లేక విగ్రహాలకు మొక్కరు. మనము మన పొరుగువారిని ప్రేమిస్తున్నట్లయితే మరి వారిని హత్యచేయము, వారితో అబద్దమాడము, వారితో వ్యభిచరించము, మరియు వారికి సంభంధించినది ఏదియు ఆశించము. పాతనిబంధన ధర్మశాస్త్రము మనకు ఇవ్వబడింది ప్రజల యొక్క అవసరతను చూపిస్తూ రక్షణయొక్క అవసరతనను గుర్తించేటట్లు చేయటమే (రోమా 7:7-9; గలతీ 3:24). దేవుడు పాతనిబంధన ధర్మశాస్త్రమును సార్వత్రికంగా అందరికి వర్తించేదిగా చేయలేదు.మనము దేవుని, పొరుగువారిని ప్రేమించాలి ఈ రెండు ఆఙ్ఞలను నమ్మకముగా విధేయత చూపించాలన్నదే దేవుడు మన అందరినుండి కోరుకొంటున్నాడు.


Share this post