Skip to Content

పాస్టరమ్మలు/ ప్రసంగీకురాలు? స్త్రీలు పరిచర్య చేయుట విషయములో బైబిలు ఏమంటుంది?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-women-pastors.html

స్త్రీలు ప్రసంగించడం, సంఘంకాపరులుగా వుండడం అనే అంశం కంటె ఎక్కువగా వాదించగలిగే అంశం సంఘంలో మరోకటి వుండదేమో. కాబట్టి పురుషులకు వ్యత్యాసముగా స్త్రీలను పెట్టి ఈ అంశంను చూడటం మంచిదికాదు. స్త్రీలు సంఘకాపరులుగా వుండకూడదని బైబిలు కొన్ని ఆంక్షలు పెడ్తుందని విశ్వసించే స్త్రీలున్నారు. మరియు కొంతమంది స్త్రీలు పరిచర్య చేయవచ్చని ప్రసంగీకులుగా వుండటానికి ఎటువంటి ఆంక్షలు లేవని నమ్మే పురుషులు కూడా వున్నారు. ఇది స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసము చూపించే అంశంకాదు. కాని బైబిలు భాష్యానికి సంభందించినది.

1తిమోతి: 2:11-12 లో స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా వుండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషులమీద అధికారము చేయుటకైనను ఆమెను సెలవియ్యను అని దేవుని వాక్యం ప్రకటిస్తుంది. సంఘంలో స్త్రీ పురుషులులకు వేర్వేరు పాత్రలు చేపట్టడానికి దేవుడు అప్పగించాడు. మానవులు సృజించబడినటువంటి విధానమునుబట్టి మరియు పాపము ప్రవేశించిన తీరునుబట్టి వచ్చిన పర్యవసానము (1తిమోతి: 2:13-14). దేవుడు అపొస్తలుడైన పౌలు ద్వారా స్త్రీలు భోధించే భాధ్యత, పురుషులపై ఆధిపత్య్హాని కల్గివుండరాదని ఆంక్షలు విధించాడు. దీనిని బట్టి స్త్రీలు సంఘకాపరులుగా పురుషులపై ఆదిపత్యాన్ని, భోధించడం, ప్రసంగించడం అనే పరిచర్యలు చేయకూడదని అడ్డగిస్తుంది.

స్త్రీలు పరిచర్య చేయుటవిషయంపై అనేకమైనటువంటి ఆక్షేపణలున్నాయి. అందులో సర్వ సామాన్యమైనది పౌలు మొదట శతాబ్దపు చదువులేనటువంటి స్త్రీలను భోదించవద్దని నియత్రించినది. అయితే 1తిమోతి: 2:11-14 విద్యస్థాయిని ప్రస్తావించుటలేదు. పరిచర్యకు విద్య అనేది అర్హత అయినట్లయితే యేసుక్రీస్తు శిష్యులలో ఎక్కువశాతం మంది యోగ్యతను కోల్పోతారు. పౌలు కేవలం ఎఫెస్స్సెసు పటణములో వున్న స్త్రీలను మాత్రమే నియత్రించాడు అన్నది రెండవ సామాన్య ఆక్షేపణ (తిమోతి మొదటి పత్రికను ఎఫెస్సీ సంఘంనకు కాపరిగా వున్నప్పుడు రాశాడు). ఎఫెస్సెసు పట్టణము గ్రీకు, రోమా దేవత అర్తమయిపేరనవున్న దేవాలయమునకు ప్రసిధ్ది. అర్తమయిని ఆరాధించుటలో స్త్రీలు అధికారము కలిగిన వారుగానున్నారు. అయితే మొదటి తిమోతి గ్రంధంలో అర్తమయిని ఎక్కువగా ప్రస్తావించలేదు. అంతేకాదు, అర్తమయిని ఆరాధించుట అనే విషయాన్ని బట్టి పౌలు ఆంక్షలు విధిస్తున్నట్లుగా 1తిమోతి: 2:11-12 లో వ్రాయలేదు.

పౌలు భార్య భర్తలకే సూచనలిస్తున్నాడని స్త్రీ పురుషులకు కాదు అన్నదే మూడవ ఆక్షేపణ. ఈ వాక్య భాగములో ఉపయోగించిన గ్రీకుపదాలు భార్య భర్తలకు వర్తిస్తాయి. అయితే వాటి ప్రాధమిక అర్ధం స్త్రీ పురుషులకు కూడా వర్తిస్తాయి. అంతేకాకుండా 8-10 లో అదే గ్రీకుపదాన్ని వాడారు. కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్ధన చేయుట కేవలం పురుషులకు మాత్రమేనా? (8) కేవలం స్త్రీలు మాత్రమే అణుకువయు స్వస్థబుధ్దియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రాలు కలిగి, దైవభక్తి కలిగియుండాలా? (9-10 వచనాలు) ముమ్మాటికి కాదు. 8-10 వచనాలు కేవలం భార్య భర్తలకే మాత్రమే కాకుండా స్త్రీ పురుషులందరికి వర్తిస్తాయి. వచనాలు 11-14 సంధర్భానుసారంగా గమనిస్తే భార్య భర్తలకే వర్తించినట్లు సూచనలు లేవు.

పాతనిభంధనలోని మిర్యాముదెబోరా, హుల్ధా లాంటి స్త్రీలు ప్రాముఖ్య నాయకత్వపు హోదాను కలిగి యుండటాన్ని సూచిస్తూ స్త్రీలు పరిచర్య అనే భాష్యంవిషయంలో తరచుగా మరొక ఆంక్షను ఎదుర్కోంటాం. ఈ ఆంక్ష కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను గుర్తించటంలో విఫలమౌవుతుంది. మొదటిది దెబోరా, పదముగ్గురు పురుష న్యాయాధిపతులమధ్య ఏకైక స్త్రీ న్యాయాధిపతి. భైబిలు పేర్కొన్న అనేక పురుష ప్రవక్తలమధ్య హుల్ధా ఏకైక స్త్రీ, ప్రవక్త్రినీగా వున్నది. మోషే అహరోనుల సహోదరునిగా మిర్యాము నాయకురాలిగా సూచించబడింది. రాజుల కాలములో పేర్కొనబడినటువంటి ప్రాముఖ్యమైన ఇద్దరు స్త్రీలు అతల్యా, జెజెబెలు, భక్తి కలిగినటువంటి నాయకురాండ్రగా ఉదహరించబడలేదు. పాత నిభంధనలో స్త్రీలు ఆధిపత్యముకలిగి యుండుట ఆనేది ప్రస్తుత అంశమునకు వర్తింపగలిగేది కానేకాదు. సంఘాలనుద్దేశించి రాసినటువంటి మొదటి తిమోతిలాంటి మరియు ఇతర సంఘము- క్రీస్తు- శరీరములో వచ్చిన మార్పులను సూచిస్తున్నాయి. ఆమార్పు ఇశ్రాయేలీయుల దేశము విషయము లేక పాతనిబంధనలోని మరి ఏ వ్యవస్థ విషయంకాదుగాని సంఘం అధికారం విషయమే.

క్రొత్తనిబంధనలోని ప్రిస్కిల్లా, ఫీబీల విషయమై ఇటువంటి వాదనేవున్నది. అపోస్తలుల కార్యములు 18 వ అధ్యాములో అకుల్లా ప్రిస్కిల్లాలు క్రీస్తునందు నమ్మకమైన పరిచారకులుగా చూడగలం. ప్రిస్కిల్ల పేరు ముందు ప్రస్తావించబడింది కాబట్టి పరిచర్యలో భర్త కంటే ఆమెదే “ప్రాముఖ్యమైన” స్థానమని కాబోలు. ఏది ఏమైనప్పటికి 1 తిమోతి 2:11-14 ప్రస్తావించిన విషయాలకు విరుద్దముగా సూచించలేదు. అకుల్లా ప్రిస్కిల్లాను అపొల్లోను తమ గృహములో చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విశదపరచిరి (అపొస్తలుల కార్యములు 18:26).

రోమా 16:1 ప్రకారము ఫీబేను “సేవకురాలిగా” కాకుండా “పరిచారకురాలిగా” గుర్తించినప్పటికి ఆమే సంఘంలో భోధకురాలు అని సూచించినట్లుగాదు. “భోధించుటకు సమర్థులు” అన్న అర్హత పరిచారకులకు వర్తిస్తుందిగాని పెద్దలకు ఇవ్వబడింది కాదు (1 తిమోతి 3:1-13 మరియు తీతుకు 1:6-9). తర్వాత “పెద్దలు” / “అధ్యక్షులు”/ “పరిచారకులు,” “ఏకపత్నీపురుషులు,” “ విశ్వాసులైన పిల్లలు” కలిగి మరియు “సజ్జన ప్రియులు” అని వివరించారు. ఈ అర్హతలన్ని పురుషులకే వర్తిస్తాయి. అంతేకాకుండా (1 తిమోతి 3:1-13 మరియు తీతుకు 1:6-9)మధ్యన పెద్దలకు, అధ్యక్షులకు, పరిచారకులకు పురుషలింగాన్నే ఉపయోగించారు.

తిమోతి 2:11-14 నిర్మాణపద్దతి “హేతువును” ప్రస్ఫుటముగా సూచిస్తుంది. పౌలు 11,12 వచనములలో ప్రస్తావించినటువంటి “కారణంను” 13లో చూడగలుగుతాం. ఎందుకు స్త్రీ భోధించకూడదు? లేక పురుషునిమీద ఎందుకు ఆధిపత్యాన్ని కల్గియుండకూడదు? ఎందుకంటే ఆదాము ముందు సృష్టించబడ్డాడు, ఆ తర్వాత హవ్వఆదాము మోసపరచబడలేదుగాని స్త్రీ మోసపరచబచబడింది. దేవుడు ఆదామును మొదట సృష్టించి ఆ తర్వాత హవ్వను సహకారిగా అనుగ్రహించాడు. ఈ సృష్టి క్రమము కుటుంబములోను (ఎఫెసీయులకు 5:22-33)సంఘంనకు సార్వత్రికంగా వర్తిస్తుంది. స్త్రీ హవ్వ, మోసగించబడింది అన్న వాస్తవాన్ని హేతువుగా తీసుకొని సంఘకాపరిలుగా వుండకూడదని పురుషునితో ఆత్మీయ అధికారం కలిగియుండకూడదని స్త్రీలు సంఘకాపరులుగాను, పురుషులపై ఆత్మీయ ఆధికారము కలవారనుటకు సూచనైంది. దీని ఆధారంగా స్త్రీలు భోధించకూడదు ఎందుకంటె వారు సుళువుగా మోసగించబడతారు అని అంటానికి దారి తీస్తుంది. ఈ అంశం చర్చనీయమైనది, ఎందుకంటె స్త్రీలు (సుళువుగా మోసగించబడేవాళ్ళు) సుళువుగా మోసగించబడేదైతే పిల్లలకు, ఇతర స్త్రీలకు (ఇంకా సుళువుగా మోసగించబడేవాళ్ళు) భోదించమని ఎందుకు ఇతరులకు అనుమతించాలి? పాఠ్యభాగము ప్రస్తావిస్తుంది అదికాదు. స్త్రీలు పురుషులకు భోధించకూడదు లేక పురుషులపై ఆత్మీయమైన ఆధిపత్యము కల్గియుండకూడదు ఎందుకంటే హవ్వ మోసగించబడుతుంది. దీని కారణంగా దేవుడు పురుషులకే సంఘంలో అధికారంతో భోధించటానికి అధికారంఇచ్చాడు.

చాలామంది స్త్రీలు అతిధులకు ఆతిధ్యమివ్వడం, దయను చూపించడం, భోధించడం, సహాయం చేయటం వంటి వరముల విషయములో అధిగమిస్తారు. ఒక ప్రాంతీయ సంఘం యొక్క పరిచర్య స్త్రీలమీద ఆధారపడియుంటుంది. బాహాటముగా ప్రార్థించుట లేక ప్రవచించుట విషయములో సంఘంలోనున్న స్త్రీలను నియత్రించలేదు (1 కొరింధీయులకు 11:5), గాని పురుషులపై ఆత్మీయమైన ఆధికారపూర్వకమైన భోధన విషయములో మాత్రమే. స్త్రీలు పరిశుధ్దాత్ముని వరము కల్గియుండటం విషయంలో బైబిలు మాత్రము నియత్రించలేదు (1 కొరింధీయులకు 12). స్త్రీలు పురుషుల వలె పరిచర్య చేయుటకు, ఆత్మ ఫలములు కల్గియుండుటకు (గలతీయులకు 5:22-23), నశించినవారికి సువార్త అందించటానికి పిలువబడ్డారు (మత్త్తయి 28:18-20; అపోస్తలుల కార్యములు 1:8; 1 పేతురు 3:15).

దేవుడు సంఘంలో కేవలం పురుషులకు మాత్రమే ఆత్మీయమైన అధికారపూర్వకమైన భోధను చేయటానికి అభిషేకించారు. దీనికి కారణం పురుషులు శ్రేష్టమైన భోధకులని కాదు, లేధా స్త్రీలు తక్కువ తెలివి తేటలు గలవారని కాదు. ఇది కేవలం దేవుడు సంఘం వ్యవహరించాల్సిన పద్దతిని అ విధముగా రూపొందించినదానిని బట్టే. పురుషులు ఆత్మీయమైనటువంటి నాయకులుగా తమ జీవితాలలో మాదిరియైయుండాలి. స్త్రీలు తక్కువ అధికార భాధ్యతలను చేపట్టాలి. స్త్రీలు ఇతర స్త్రీలకు భోధించాలని (తీతుకు 2:3-5)ప్రోత్సాహించారు. స్త్రీలు పిల్లలకు భోధించకూడదని బైబిలు నియత్రించుటలేదు. పురుషులకు భోధించుట విషయములో స్త్రీలు నియత్రించబడుతున్నారు. దీనిని బట్టి స్త్రీలు సంఘకాపరులుగా, ప్రసంగీకులుగా వుండకూడదని హేతుబద్దంగా అర్ధమౌతుంది. దీని అర్ధం స్త్రీలు తక్కువ ప్రాధాన్యత కలిగినవారు అని కాదు, కాని పరిచర్య విషయంలో నిర్ధిష్ట గురి కలిగియుండటానికి, దేవుని ప్రణాళికను అంగీకారంగా తమ కిచ్చిన వరములకు అనుగుణ్యంగా వుండటానికి దోహదపడ్తుంది.


Share this post