Skip to Content

పాపుల ప్రార్థన ఏమిటి?

5 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-sinners-prayer.html

తము పాపులమని అర్థం చేసుకుని ఒక రక్షకుని అవసరం ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రార్థించేదే పాపుల ప్రార్థన. పాపుల ప్రార్థనని పలుకడం వల్ల దానంతట అదే దేన్నీ సాధించదు. ఒక వ్యక్తికి ఏమిటి తెలుసో, అర్థం చేసుకుంటాడో మరియు తమ పాపపు స్వభావం గురించి ఏమిటి నమ్ముతాడో అన్నదాన్ని శుద్ధముగా సూచిస్తే మాత్రమే ఒక పాపుల ప్రార్థన సఫలమవుతుంది.

పాపుల ప్రార్థన యొక్క మొదటి పక్షం మనమందరము పాపులమని అర్థం చేసుకోవడం. “ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా- నీతిమంతుడు లేడు. ఒక్కడును లేడు” అని రోమీయులు 3:10 ప్రకటిస్తుంది. మనమందరము పాపం చేసేమని బైబిల్ స్పష్టపరుస్తుంది. మనమందరము దేవుని వద్దనుంచి వచ్చే కృప మరియు క్షమాపణ యొక్క అవసరం ఉన్న పాపులమి( తీతుకు 3:5-7). మన పాపం వల్ల మనం నిత్యశిక్షకి పాత్రులం (మత్తయి 25:46). పాపుల ప్రార్థన తీర్పుకి మారుగా అనుగ్రహం కోసం మొర్ర. అది ఉగ్రతకి మారుగా దయకోసం ఒక ప్రార్థన.

పాపుల ప్రార్థన యొక్క రెండవ పక్షం మన పోగొట్టుకున్న మరియు పాపపూరితమయిన పరిస్థితిని బాగు చేయడానికి దేవుడు ఏమిటి చేసేడో అని తెలిసికోవడం.

దేవుడు శరీరధారియై, మన మధ్య ప్రభువు యేసుక్రీస్తు రూపమందు నివసించెను( యోహాను 1:1,14). యేసు మనకి దేవుని గురించి బోధించి, ఒక పరిపూర్ణమయిన నీతియుతమైన మరియు పాపరహితమయిన జీవితాన్ని జీవించేడు( యోహాను 8:46, 2 కొరింధీయులు 5:21). తరువాత యేసు మనం పాత్రులమయిన శిక్షని మోస్తూ శిలువపైన మరణించేడు(రోమీయులు 5:8). పాపం, మరణం మరియు పాతాళలోకంపైన తన విజయాన్ని నిరూపించడానికి యేసు మృతులలోనుండి లేచేడు( కొలొస్సయులు 2:15, 1 కొరింధీయులు అధ్యాయం 15). దీనంతటివల్లా మన పాపాలు క్షమింపబడి మనకి పరలోకంలో ఒక నిత్యగృహం వాగ్దానం చేయబడుతుంది- అది మనం కనుక మన నమ్మకాన్ని యేసుక్రీస్తునందు ఉంచితేనే. మనం చేయవలిసినదల్లా ఆయన మన స్థానాన్న మరణించేడని నమ్మడమే( రోమీయులు 10:9-10). మనం ఒక్క కృపద్వారానే యేసుక్రీస్తునందు మాత్రమే రక్షింపబడగలం. “మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు. ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే” అని ఎఫెసీయులు 2:8 ప్రకటిస్తుంది.

పాపుల ప్రార్థనని పలకడం మీ రక్షకునిగా మీరు యేసుక్రీస్తుపైన ఆధారపడుతున్నారని దేవునికి చాటే ఒక సరళమయిన విధానం మాత్రమే. రక్షణగా పరణమించే గారడీ చేసే పదాలేవీ లేవు. యేసు మృత్యువు మరియు పునరుత్ధానంపైన నమ్మకం మాత్రమే మనలని రక్షించగలదు. మీరు ఒక పాపి అని మరియు రక్షణ యొక్క అవసరం ఉన్నవారని కనుక మీరు అర్థం చేసుకుంటే మీరు దేవునితో పలుకవలిసిన ఒక పాపుల ప్రార్థన ఉందిః “ దేవా, నేను పాపినని నాకు తెలుసు. నా పాపానికి ఫలితాలకి నేను పాత్రుడనని నాకు తెలుసు. ఆయన మృత్యువు మరియు పునరుత్ధానం నా క్షమాపణకి వీలు కల్పించేయని నేను నమ్ముతాను. నా స్వకీయమైన ప్రభువుగా మరియు రక్షకునిగా యేసునందు ఒక్క యేసునందు మాత్రమే నాకు నమ్మకం ఉంది. నన్ను రక్షించినందుకు మరియు క్షమించినందుకు నీకు నా కృతజ్ఞతలు ప్రభువా! అమెన్


Share this post