Skip to Content

ఒకసారి రక్షింపబడితే ఎప్పటికి రక్షింపబడినట్లేనా?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-always-saved.html

ఒకసారి రక్షింపబడితే ఎప్పటికి రక్షింపబడినట్లేనా? యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించినవారు దేవునితో సంభంధాన్ని ఏర్పరచుకొనుటయే కాక నిత్య భధ్రతను రక్షణ నిశ్చయతను కల్గి యుంటారు. పలు వాక్యభాగాలు ఈ వాస్తావాన్ని ప్రకటిస్తున్నాయి. ఎ) రోమా 8:30 ఈ విధంగా ప్రకటిస్తుంది. “మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.” ఈ వచనం ప్రకారం దేవుడు మనలను ఎంపిక చేసిన క్షణమునుండి పరలోకములో ఆయన సన్నిధానములో మహిమ పర్చబడినట్లుగావుంటుంది. దేవుడు ఒక విశ్వాసిని పరలోకములో మహిమపర్చబడటానికి ఏర్పర్చాడు కాబట్టి దేనినుండి ఆపలేడు. దేవుడు ఉద్దేశించిన మహిమనుంచి ఒక విశ్వాసిని ఏది కూడ ఆపలేదు. నీతిమంతుడుగా తీర్పుతీర్చబడినటువంటి వ్యక్తికి రక్షణ ఖచ్చితము. పరలోకములో మహిమ ఉన్నదంతగా రూఢి గల్గినవాడు.

బి).రోమా 8:33-34 లో పౌలు రెండు కీలక ప్రశ్నలు లేవనెత్తుచున్నాడు. “దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్పుతీర్చువాడు దేవుడే; శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతేకాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విఙ్ఞాపనముకూడ చేయువాడును ఆయనే.” దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద ఎవరు నేరము మోపగలరు? ఎవరు చేయలేరు ఎందుకంటే క్రీస్తే మన న్యాయవాది. ఎవరు శిక్ష విధించగలరు? ఎవరివలనా కాదు. మనకొరకు చనిపోయిన యేసుక్రీస్తు ఒక్కడే శిక్ష విధించగలడు. మనకు ఒక ఉత్తరవాదిగా, న్యాయవాదిగా ఆయన మనకు ఉన్నాడు.

సి).విశ్వాసులు తిరిగి జన్మించినవారు (యోహాను 3:3; తీతుకు 3:5) విశ్వసించినవారు. ఒక క్రైస్తవుడు రక్షణను కోల్పోవటం అంటే జన్మించకుండా ఉండిన వాడై యుండాలి. నూతన జన్మను తీసివేయబడతాది అంటానికి బైబిలులో నిదర్శనాలు లేవు. డి). ప్రతి విశ్వాసులందరిలో పరిశుధ్ధాత్ముడు ఉంటాడు (యోహాను 14:17; రోమా 8:9). క్రీస్తు యొక్క ఒక్క శరీరములోనికి బాప్తిస్మమిస్తాడు. ఒక విశ్వాసి రక్షణను కోల్పోవాలంటే పరిశుధ్ధాత్ముడు అతనిని “విడిచి వెళ్ళిపోవాలి.” క్రీస్తు శరీరమునుండి వేరు చేయబడాలి.

ఇ).యేసుక్రీస్తు నందు విశ్వాసముంచినవారు “నిత్య జీవముకలవారని” యోహాను 3:16 తెల్పుతుంది.ఒక రోజు నీవు క్రీస్తునందు విశ్వాసముంచినట్లయితే నీకు నిత్య జీవముంటుంది అయితే దానిని నీవు కోల్పోయినట్లయితే దానిని “నిత్యమైనది” అనలేము. కాబట్టి రక్షణను కోల్పోయినట్లయితే బైబిలులో నిత్య జీవమునకు సంభందించిన వాగ్ధానములు అబద్దములవుతాయి. ఎఫ్). వీటన్నిటిని ఆధారముచేసుకొని , ఈ వాదనలన్నిటిని రోమా 8:48-39 లో చూడగలము, “మరణమైనను, జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను,మన ప్రభువైన క్రీస్తునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.” నిన్ను రక్షించినటువంటి దేవుడే నిన్ను కాపాడతాడన్న మాటను ఙ్ఞాపకముంచుకో. ఒకసారి రక్షింపబడినట్లయితే ఎప్పటికి రక్షింపబడినట్లే. మన రక్షణ ఖచ్చితముగా నిత్యమూ భధ్రమే.


Share this post