Skip to Content

నిత్య భద్రత లేఖానానుసారమా?

  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-eternal-security.html

ఒక వ్యక్తి క్రీస్తుని రక్షకుడుగా తెలుసుకొన్నప్పుడు దేవునితో సంభంధం ఏర్పడుతుంది. మరియు నిత్య భద్రత వున్నదని భరోసా దొరుకుతునంది. యూదా 24:ఈ విధంగా చెప్తుంది. “తొట్ట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్ధోషులనుగా నిలువబెట్టుటకును.” దేవుని శక్తి ఒక విశ్వాసిని పడిపోకుండా కాపాడుతుంది. దేవుని మహిమ సన్నిధిలో నిలువ బెట్టుట ఆయన పని. నిత్య భద్రత దేవుడు మనలను కాపాడంటం బట్టి వచ్చే నిత్య భద్రత గాని మన రక్షణను మనము కాపాడుకొనుట కాదు.

“నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును అపహరింపలేడు” అని యేసయ్య ప్రకటిస్తున్నాడు. తండ్రి మరియు యేసయ్య ఇరువురును తమ చేతులలో భద్రపరుస్తున్నారు. తండ్రి కుమారుల కభంధ హస్తాల నుంచి మనలను ఎవరూ వేరు చేయగలరు?

విశ్వాసులు “విమోచన దినమువరకు ముద్రింపబడియున్నారు” ఎఫెసీ4:30 తెల్పుతుంది. ఒకవేళ విశ్వాసుల నిత్య భద్రత విమోచన దినమువరకు ముద్రింపబడకుండా వుండినట్ట్లయితే అది మతభ్రష్టత్వమునకు, అపనమ్మకత్వమునకు లేక పాపమునకు అయిఉండాలి. యోహాను 3:15-16 చెప్తుంది ఎవరైతే యేసునందు విశ్వాసముంచుతారో వారికి “నిత్యజీవము వుందని.” ఒక వ్యక్తి నిత్య జీవాన్ని వాగ్ధానించి అది అతని యొద్దనుండి తీసివేయబడినట్లయితే అది “నిత్యమైనది” కానే కాదు.

నిత్య భద్రత వాస్తవము కానియెడల బైబిలులో వెల్లడించిన నిత్య జీవపు వాగ్ధానాలు అబద్దములే. నిత్య భధ్రత అతి శక్తివంతమైనటువంటి వాదన. రోమా 8:48-39 లో చూడగలము “మరణమైనను, జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను,మన ప్రభువైన క్రీస్తునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.” మన నిత్య భధ్రత మనలను ప్రేమించి, విమోచించిన దేవునిపై ఆధారపడివుంది. మన నిత్య భధ్రతను క్రీస్తువెలపెట్టి కొన్నాడు. తండ్రి వాగ్ధానంచేసాడు. పరిశుధ్దాత్ముడు ముద్రించాడు.


Share this post