Skip to Content

నేను ఏ విధంగా పరిశుధ్ధాత్మ నింపుదలను పొందగలను?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-filled-Spirit.html

పరిశుధ్ధాత్మ నింపుదలను అవగాహన చేసుకొనుటకు ఒక ముఖ్యమైన వచనము యోహాను 14:16 అక్కడ యేసు ప్రభువువారు వాగ్ధానం చేసింది ప్రతీ విశ్వాసిలో పరిశుధ్ధాత్ముడు నివసించును. మరియు నివసించుట శాశ్వతమైనది. ఒకనిలో ఆత్మ నివసించుట నుండి ఆత్మ నింపుదలపొందుట అనేది ప్రత్యేకించుట చాలా ముఖ్యమైనది. శాశ్వతంగా విశ్వాసిలో ఆత్మ నివసించుట అనేది కొంతమంది ప్రత్యేకించిన విశ్వాసులకు మాత్రమే కాదుగాని అందరి విశ్వాసులకు. కొద్ది లేఖనభాగాలు మాత్రమే దీనిని తుది పలుకుటకు సహయాపడ్తున్నాయి. మొదట పరిశుధ్ధాత్మ అనే కృపావరము ఒకరికి తప్పకుండ అందరి విశ్వాసులకు ఇవ్వబడింది. మరియు దానిపై యేసు క్రీస్తులో విశ్వాసముంచుట తప్ప మరి ఏ షరతు ఈ కృపావరము మీదనుంచబడలేదు (యోహాను 7:37-39). రెండవది, రక్షణ క్రియ జరిగినప్పుడే ఆ క్షణములోనే పరిశుధ్ధాత్ముడు అనుగ్రహించబడెను (ఎఫెసీ 1:13). గలతీయులకు 3:2 లోకూడా ఇదే సత్యాన్ని నిక్కివకాణిస్తుంది ఏంటంటే ఆత్మచే ముద్రించబడటం మరియు ఆయనయందు విశ్వాసముంచిన సమయంలో అంతర్వర్తియైన ఆత్మ నివసించుట మొదలుపెట్టెను. మూడవది, పరిశుధ్ధాత్ముడు విశ్వాసిలో శాశ్వతంగా నివసించును. విశ్వాసులందరికి పరిశుధ్ధాత్ముడు ప్రధమంగా అనుగ్రహించబడ్డాడు లేక భవిష్యత్తులో క్రీస్తులో మహిమపర్చబడుట నిజపర్చుటకు(2 కొరింథీ 1:22; ఎఫెసీ 4:30).

ఎఫెసీ 5:18 లో చెప్పబడిన ఆత్మ నింపుదల విషయంకు పరస్పర భేధము కలిగియుంది. మనము పరిశుధ్ధాత్మకు సంపూర్తిగా లోబడినట్లయితే ఆయన మనలను స్వతంత్రించుకొని పూర్తిగా తన ఆత్మతో నింపుదల ననుగ్రహిస్తాడు. రోమా 8:9 మరియు ఎఫెసీ 1:13-14 చెప్తుంది ఆయన ప్రతీవిశ్వాసిలో నివసిస్తాడు గాని మనము ఆయనను ధు:ఖపరుస్తున్నాము(ఎఫెసీ4:30), ఆయన క్రియను మనలో ఆర్పివేయవచ్చు (1 థెస్సలోనీయులకు 5:30). ఈ విధంగా ఆయన ఆత్మను ఆర్పివేసినట్లయితే మనము తన ఆత్మ నింపుదల కార్యమును మరియు ఆయన శక్తిని మనలో , మన ద్వారా అనుభవించలేం. పరిశుధ్ధాత్మలో నింపబడటం అంటే మన జీవిత ప్రతీ భాగమును ఆయనకు అప్పగించి, ఆయనచే నడిపించబడి స్వాధీనపరచబడ్డామని భావించడం. తర్వాత ఆయన శక్తి మననుండి ప్రయోగించబడినట్లయితే మనము ఏమిచేయుచున్నామో అది దేవునికి ఫలవంతముగానుండును. ఆత్మ నింపుదల అనేది బాహ్యమైన జరిగే క్రియలతో పరిమితమైంది కాదు, లోలోపల ఆలోచనలను, భావోధ్ధేశ్యాలను అమ్రియు మన క్రియలకు పరిమితమైంది. కీర్తన19:14లో చెప్పినట్లు యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా,నా నోటిమాటలును నా హృదయధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక.

పాపము పరిశుధ్ధాత్ముని నింపుదలను అవరోధిస్తుంది. అయితే దేవునికి విధేయత చూపించుట ద్వారా పరిశుధ్ధాత్ముని నింపుదలను క్రమబద్దీకరిస్తుంది. ఎఫెసీ 5:18 మీరు ఆత్మ పూర్ణులైయుండుడి అని హెచ్చరిస్తుంది. ఏదిఏమైనప్పటికి, నింపుదల కలిగియున్నాము అనేదాన్ని నిరూపించుటకు పరిశుధ్ధాత్ముని నింపుదల కొరకు ప్రార్థించుటకాదు, కేవలము దేవుని ఆఙ్ఞల పట్ల విధేయతచూపుతూ పరిశుధ్ధాత్ముని పని జరుగు నిమిత్తం ఆత్మకు స్వాతంత్ర్యంనివ్వడం. ఎందుకంటె మనమింక పాపముచే సోకింపబడ్డాము కాబట్టి అన్ని సమయాలలో ఆత్మనింపుదల కలిగియుండటం అసాధ్యంగావుంటుంది. మనము పాపము చేసినపుడు, తక్షణమే దేవునిదగ్గర పాపపు ఒప్పుదలకలిగి, మరియు ఆయన ఆత్మనింపుదలతో, మరియు ఆయన ఆత్మనడిపింపు కలిగి జీవించుటకు తీర్మానించుకొనవలెను.


Share this post