Skip to Content

నేడు క్రైస్తవ సంఘములో ఉన్న మూఢాచారాలు

18 July 2024 by
Sajeeva Vahini
  • Author: Unknown
  • Category: Articles
  • Reference: General


- మొదటి నుండి ప్రార్థనలో లేకపోయినా పర్వాలేదుగాని ముగింపు ప్ర్రార్థనలో ఆశీర్వాదం ఇచ్చే సమయానికి వచ్చి కళ్ళు మూసుకుని ఆమెన్ అంటే చాలు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. (దేవునికి తెలియదా ఎవరికి ఆశీర్వాదాలు ఇవ్వాలి అని?)


- Church నుండి నేరుగా మీ ఇంటికే వెళ్ళాలి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే నీకు రావాల్సిన ఆశీర్వాదాలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. (ఆచరించేదే తప్పు దానిలో కూడా స్వార్ధం)


- Church నుండి ఇంటికి వెళ్ళాక కాళ్ళు కడుక్కుని ఇంటిలోనికి వెళ్తే ఆశీర్వాదలు పోతాయి. (అశీర్వాదలేమన్న గాలా, ధూలా కాళ్ళు కడుక్కుంటే పోవటానికి)

పోయినసారి ప్రభువు బల్లలో పాలుపంచుకోలేదు అందుకే ఈ నెల అంతా నాకు ఆరోగ్యం బగాలేదు. (రొట్టె ద్రాక్షారసం అంటే paracetemol tablet అనుకున్నావా! ప్రభువు రక్తశరీరాలు, జాగ్రత్త!)


- ఎలా సంపాదించినా పర్వాలేదు నెలకు పదియవ భాగం తీసి ఇచ్చేస్తే ఇంట్లో డబ్బులు నిలబడతాయి. (నువ్వు ఇచ్చేది పదియవ భాగమా లేక నీ అక్రమ సంపాదనలో 10% partnership share ఆ?)


- నేను వ్యక్తిగత ప్రార్థన చేసుకోనక్కరలేదు pastor గార్కి గాని prayer towers కి గాని వాళ్ళు ఇచ్చే prayer packages ప్రకారం డబ్బులు చెల్లిస్తే చాలు నా గురించి వాళ్ళే ప్రార్థన చేస్తారు. నేను మాత్రం హాయిగా నాకేమి పట్టనట్టు నిద్రపోతాను. (నీకు ఆకలి వేస్తె వాళ్ళకి అన్నం పెడుతున్నావా? దేవుడు నువ్వు మాట్లాడతావేమో, నీ మాట్లాడితే విందామని చూస్తున్నాడు)


ఏలా జీవించినా పర్వాలేదు ఎదొకటి మొక్కుకుని కృతజ్ణతగా ఎంతో కొంత దేవుడికి ఇచ్చేస్తే మనం ఏం చేసినా క్షమించేస్తాడు. (నువ్వు ఇచ్చేది లంచమా, కృతజ్ణతా?)


- మిగిలిన రోజుల్లో ఎలా జీవించినా పర్వాలేదు 40 దినాలు మాత్రం non-veg తినకుండా మధ్యం తాగకుండా శ్రమదినాలు పాటిస్తే చాలు. (నీకోసం ఆయన already శ్రమ అనుభవించాడు. ఇప్పడు నీకు కావాల్సింది నీ పాపాలకై పశ్చాత్తాపం, award కోసం acting కాదు. ఆయనను శిలువ వేసినట్టే నువ్వు కూడా వేయించుకుంటావా?)


నా ప్రియ సహోదరా! నువ్వు ఆచరించే లోకాచారాలు తీసుకొచ్చి క్రైస్తవ్యం మీద రుద్దకు. దేవుడు అంటే ప్రేమాస్వరూపి మాత్రమే కాదు, ఉగ్రపాత్రను చేతబట్టుకున్నాడు అనే విషయం గుర్తుపెట్టుకో. ఇలాంటివి ఆచరించి దేవుని ఉగ్రతకు గురి కాకు. ఒక్కసారి దేవుడు నీకు ఇచ్చిన ఇంకిత జ్ఞానాన్ని ఉపయోగించు. అనుదినం వాక్యాన్ని చదువుకుంటూ దేవుని చిత్తనుసారంగా జీవించు. ఇలాంటివి నువ్వు ఆచరిస్తున్నట్లైతే సరిచేసుకోవటానికి ప్రయత్నించు.


Share this post