Skip to Content

నా జీవితంపట్ల దేవుని చిత్తాన్ని ఏవిధంగా తెల్సుకోవాలి? దేవుని చిత్తం తెల్సుకోవటం విషయంలో బైబిలు ఏమిచెప్తుంది?

  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-know-will-God.html

ఒక విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికీ రెండు చిట్కాలు లేక అవసరతలు. 1) నీవేదైతే అడుగుతున్నావో లేక ఆశపడుతున్నావో దానిని బైబిలు తప్పుగా ఎంచినది కాదని ధృవీకరించుకో. 2). నీవేదైతే అడుగుతున్నావో లేక ఆశపడుతున్నావో అది దేవుని మహిమ పరచేదిగాను, నీకు ఆత్మీయ ఎదుగుదల అనుగ్రహించేదిగాను ఉన్నదో లేదో ధృవీకరించుకో.ఈ రెండు వాస్తవమై నీవు అడిగినదానిని దేవుడు ఇంకా అనుగ్రహించకుండా వుండినట్లయితే బహుశా అది నీవు కల్గియుండుట దేవుని చిత్తంకాదేమో, లేదా ఇంకా కొంచెం సమయం వేచి యుండాలేమో. దేవుని చిత్తాన్ని తెలుసుకొనుట కొన్నిసార్లు కష్టము. కొంతంమంది ఎక్కడ పని చేయాలి, ఎక్కడ జీవించాలి, యెవరిని పెళ్ళిచేసుకోవాలి వగైరా విషయాల్లో దేవుడు ఖచ్చితముగా తన చిత్తాన్ని బయలు పరచాలని ఆశిస్తున్నారు. అయితే దేవుడు చాలా అరుదుగా నిక్కర్చిగా, నేరుగా అలాంటి సమాచారాన్ని అనుగ్రహిస్తాడు. ఇలాంటి విషయాల్లో మనమే ఎంపిక చేసుకోవాలని దేవుడు అనుమతిస్తాడు.

రోమా 12:2 లో “మీరు ఈ లోకమర్యాదను ననుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి” అని చెప్పబడింది. పాపంచేయాలని లేకా ఆయన చిత్తాన్ని తృణీకరించాలి అన్న ఒక విషయంలో నిర్ణయాన్ని మనం తీసుకోకూడదని దేవుడు మనలనుండి ఆశిస్తున్నాడు. ఆయన చిత్తానికి కనుగుణంగా ఎంపికలు చేసుకోవాలని ఆశిస్తున్నాడు. అయితే నీ జీవితంపట్ల దేవుని చిత్తమేంటోనని నీకెలా తెలుస్తుంది? ఒకవేళ నీవు దేవునికి సన్నిహితంగా నడుస్తూ, యధార్ధంగా నీ జీవితంపట్ల తన చిత్తాన్ని నెరవేర్చాలని ఆశిస్తున్నాట్లైతే అప్పుడు దేవుడు తన ఆశయాలను, కోరికలను నీ హృదిలో వుంచుతాడు. నీ చిత్తం కోసం కాక దేవుని చిత్తంకోసమే వేచియుండటం చాలా ప్రాముఖ్యం. “యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయవాంచలను తీర్చును” (కీర్తన 37:4). నీవు ఆశిస్తున్నాదాన్ని బైబిల్ వ్యతిరేకంగా సూచించనట్లయితే అది యధార్దంగా నీ ఆత్మీయతకు అభివృధ్ధి కలగించేదేతై, దానిని ఎంపిక చేసుకోవడానికి నీ హృదయాను సారముగా నడవడానికి బైబిలు “అనుమతి”స్తుంది. వినయముతో, విన గలిగే మనస్సుతో ఆయన చిత్తాన్ని తెల్సుకోడానికి యధార్ధంగా ప్రయత్నిస్తే, దాన్ని బహిర్గతం చేయడానికి దేవుడు సంసిధ్దంగా నున్నాడు.


Share this post