Skip to Content

నా ఆత్మీయవరాలు ఏంటో నేనేవిధంగా తెలిసికోగలను?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-spiritual-gift.html

మన ఆత్మీయ వరాలేంటో అని కనుగొనటానికి ఒక నిర్ధిష్టమైన మంత్ర సూత్రాలు గాని ఖచ్చితమైన పరీక్షలు గాని లేవు. పరిశుధ్ధాత్మ దేవుడు నిర్ణయించిన ప్రకారము అందరికి వరాలు పంచుతాడు ( 1 కొరింథీ 12:7-11). సామాన్యంగా క్రైస్తవులకు వచ్చే సమస్య ఏంటంటే మనలను దేవుడు ఏ వరములతో నింపాడో అని గ్రహిస్తామో ఆ వరాన్ని మాత్రమే వుపయోగించి దేవుని సేవ చేయటానికి శోధింపబడతాము. అయితే ఆత్మీయవరాలు పనిచేయాల్సింది ఆవిధంగా కాదు. దేవుడు అన్ని విషయాలలో విధేయతతో ఆయనను సేవించాలని మనల్ని పిలిచాడు. అయితే ఒక వరము లేక వరాలతో మనలను తర్ఫీదు చేసి మనలను పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనము ఏదైతే సాధించవలసిన కార్యము సాధించాలో దానికి సంసిధ్ధులను చేస్తాడు.

మనకివ్వబడిన ఆత్మీయవరాల స్థితిని గుర్తించుటకు అనేక మార్గాలలో సాధించవచ్చు. అత్మీయవరాలా పరీక్ష లేక కనుగొనుటద్వారా పూర్తిగా వాటిమీద అధారపడపోయినప్పటికి, ఖచ్చితంగా మనకివ్వబడిన వరమేదో గుర్తించుటలో అవగాహన కల్పించుటకు తోడ్పడుతుంది. ఇతరులు మనకున్న ఆత్మీయవరాల సామర్ధ్యతను గుర్తించి, మనకు వారిచ్చే సంకేతములవలన అవీ ధృవీకరించబడును. కొంతమంది తరచుగా మనము ప్రభువుని సేవించేటప్పుడు చూచేవారు ఏ ఆత్మీయవరములను ఉపయోగిస్తున్నామో అది మనకు ఖచ్చితముగా దేవుడిచ్చిన వరముగా మనము గుర్తించకపోవటాన్ని లేక స్వీకరించుటను గుర్తిస్తారు. ప్రార్థన చాల ముఖ్యం. మనము ఏ విఢఃఅంగా ఆత్మీయవరాల సామర్ధ్యత కలిగియున్నామో ఒకేఒక వ్యక్తికి ధృఢంగా తెలుసు. ఆయనే ఆవరాలాను అనుగ్రహించేవాడు తన్నుతానే అయిన పరిశుధ్ధాత్ముడు. మనము ఎటువంటి వరములతో నింపబడమో, శేష్టమైన పద్దతిలో ఆత్మీయవరాలను తన మహిమ కొరకు ఉపయోగించుటకుగాను మనము దేవునిని అడగవచ్చు.

అవును, దేవుడు కొంతమందిని భోధకులుగాను పిలిచి వారికి భోధించేవరాన్ని ఇచ్చాడు. దేవుడు కొంతమందిని పరిచారకులుగాను పిలిచి వారికి సహాయముచేసే వరాన్ని ఇచ్చాడు. ఏదిఏమైనా, మన ఆత్మీయవారాల్ని ఖచ్చితముగా తెలిసికోవటం వలన ఆ వరాలకు బయట వేరే వరాలను దేవుని సేవించుటకు ఉపయోగించకూడదని అది క్షమించే విషయం కాదు. దేవుడు మనకు ఏదైతే వరం లేక వరాలు అనుగ్రహించాడో వాటిని తెలిసికోవటము అంతా ఉపయోగకరమేనా? ఆత్మీయవరాలపై ఎక్కువ దృష్టి పెట్టి దేవునిని సేవించటానికి ఇవ్వబడిన అనేక అవకాశాలు పోగొట్టుకోవడం తప్పేనా? అవును. మనలను మనము దేవునిచేత వాడబడటానికి సమర్పించుకున్నట్లయితే ఆయనే మనకు అవసరమైన ఆత్మీయవరాలలో ఆయన మనలను సంసిధ్దంచేస్తాడు.


Share this post