Skip to Content

మరణము పిమ్మట జీవం ఉంటుందా?

  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-life-after-death.html

మరణము పిమ్మట జీవం ఉంటుందనా? బైబిల్ మనకి తెలియచెప్తుంది, “ స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును..... మరణమైన తరువాత నరులు బ్రదుకుదురా” ( యోబు 14:1-2,14).

యోబువలె మనలో ఇంచుమించు అందరిమీ ఈ ప్రశ్నని ఆక్షేపించేము. మనం మరణించిన పిమ్మట సరిగ్గా ఏమిటి జరుగుతుంది? మనం కేవలం ఉనికిలో ఉండటం ఆపివేస్తామా? వ్యక్తిగత అధిక్యతని సాధించే నిమిత్తము భూమిమీదనుంచి పోయి తిరిగి వచ్చే చుట్టూ తిరిగే తలుపా జీవితం? అందరూ ఒక్క చోటకే పోతారా లేక మనం భిన్నమైన స్థలాలని పోతామా? నిజంగా ఒక పరలోకం మరియు పాతాళలోకం ఉన్నాయా లేక అది మనస్సులో ఊహించుకున్నది మాత్రమేనా?

మరణానికి పిమ్మట జీవం ఉండటమే కాక నిత్యజీవితం ఎంత మహిమాత్మకమైనదంటే “దేవుడు తన్ను తాను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు,మనుష్య హృదయమునకు గోచరమవలేదు” (1 కొరింధీయులు 2:9). యేసుక్రీస్తు దేవుని శరీరంయందు మనకి నిత్యజీవితం యొక్క ఈ వరాన్ని ప్రసాదించడానికి భూమిమీదకి వచ్చేడు. “మన యతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను. అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది” (యెషయా 53:5).

మనలో ప్రతి ఒక్కరిమీ పాత్రులైన శిక్షని యేసు తన మీద మోపుకొని తన జీవితాన్నే త్యాగం చేసేడు. మూడు దినాల పిమ్మట ఆత్మయందు మరియు శరీరంయందు సమాధిలోనుండి లేవడంతో మరణంపైన తను విజయాన్ని పొందేనని నిరూపించేడు. ఆయన భూమిపైన నలువది దినాలు మిగిలిఉండి పరలోకమందు తన నిత్యనెలవుకి లేచేముందు వేలమందివల్ల సాక్ష్యమివ్వబడ్డాడు. “ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను” అని రోమీయులు 4:25 చెప్తుంది.

క్రీస్తు యొక్క పునరుత్ధానం యుక్తముగా వృత్తాంతపరచబడిన ఘటన. అపొస్తలు పౌలు దాని బలాన్ని పరీక్షించడానికి సాక్ష్యులని ప్రశ్నించమని మనుష్యులని ఆపేక్షించేడు. క్రైస్తవత్వం యొక్క మూలరాయి పునరుత్ధానం. క్రీస్తు మృతులలోనుండి లేపబడినందున మనం కూడా పునరుత్ధరించబడతామని మనకి నమ్మకం ఉండగలదు. దీన్ని నమ్మని కొంతమంది పూర్వపు క్రైస్తవులని అపొస్తలు పౌలు మందలించేడుః “క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు- మృతుల పునరుత్ధానము లేదని యెట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్ధానము లేనియెడల, క్రీస్తుకూడ లేపబడియుండలేడు” (1 కొరింధీయులు 15:12-13).

మరల సజీవులగుటకు లేపబడే ఒక గొప్ప ప్రధమఫలము ఒక్కడే. భౌతికమైన మృత్యువు మనందరికీ సంబంధం ఉన్న ఆదామునుంచి వచ్చింది. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా దేవుని కుటుంబంలోనికి దత్తత చేసుకోబడిన వారందరికి నూతన జీవితం ఇవ్వబడుతుంది ( 1 కొరింధీయులు 15:20-22). దేవుడు క్రీస్తు శరీరాన్ని లేపేడో అటువలె యేసు రాకడతో మన శరీరములు పునరుత్ధరించబడతాయి( 1 కొరింధీయులు 6:14).

మనమందరం ఆఖరికి పునరుత్ధరించబడేటప్పటికీ ప్రతి ఒక్కరు కలిపికూడి పరలోకంలోనికి ప్రవేశింపరు. అతను కానీ లేక ఆమెకానీ తమ నిత్యత్వాన్ని ఎక్కడ గడపబోతారో అన్న నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరూ ఎంచుకోవాలి. మనం ఒకసారే మరణించాలని నిర్ణయింపబడియున్నదని మరియు దాని పిమ్మట తీర్పు వస్తుందని బైబిల్ సెలవిస్తుంది. నీతిమంతులు అయినవారు పరలోకంలో నిత్యజీవితంలోనికి ప్రవేశిస్తారు కానీ అవిశ్వాసులు నిత్యశిక్షకి లేక పాతాళలోకానికి పంపించబడతారు (మత్తయి 25:46).

పరలోకంవలె పాతాళలోకం ఉనికి యొక్క ఒక స్థితి కానీ ఒక శబ్దతహ్ మరియు చాలా సత్యమైన స్థలం. అనీతిమంతులు దేవుని వద్దనుంచి వచ్చే నిరంతరమైన శాస్వతమైన ఉగ్రతని భరించే చోటది. వారు అవమానం, వ్యాకులత మరియు తిరస్కారం వల్ల కలిగే ఉద్వేగాత్మకమైన మానసికమైన మరియు భౌతికమైన పీడని అనుభవిస్తారు. పాతాళలోకము ఒక అగాధము అని (లూకా 8:31, ప్రకటన 9:1). మరియు అగ్నిగుండం అని అగ్నిగంధకములు గల గుండము అని మరియు అచ్చట ఉన్నవారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురని (ప్రకటన 20:10) వర్ణించబడింది. పాతాళలోకమందు తీవ్రమయిన దుఃఖం మరియు కోపాన్నీ సూచిస్తూ ఏడ్చుటయు పండ్లు కొరుకుటయు ఉండును (మత్తయి 13:42). అది పురుగు చావని మరియు అగ్ని ఆరని ఒక చోటు( మార్కు 9:48). దుర్మార్గుడు మరణమునొందుట వలన దేవునికి సంతోషము లేదు కానీ వారు తమ దుర్మార్గతనుండి మరలి బ్రదుకుట వలన ఆయనకు సంతోషం కలుగును( యెహెజ్కేలు 33:11). కానీ వారు లోబడేటట్లు ఆయన బలవంతము చేయడుః మనం కనుక ఆయన్ని తిరస్కరించాలనుకుంటే తిరస్కరించాలనుకుంటే, మనకి కావలిసినది ఇవ్వడం తప్పితే ఆయన వద్ద ఇంకే ఎంపికా లేదు- అది ఆయననుంచి దూరంగా జీవించడం. భూమిమీదన జీవితం ఒక పరీక్ష, రాబోయేదానికి సన్నాహం. విశ్వాసులకి ఇది దేవుని సన్నిధిని తక్షణమైన నిత్యజీవితం. కాబట్టి మనం ఎలా నీతిమంతులమి అయి మిత్యజీవితాన్ని పొందుకోగలం? ఉన్న ఒక్కటే దారి దేవుని కుమారుడైన యేసుక్రీస్తుయందు విశ్వాసం మరియు నమ్మకం ద్వారా మాత్రమే. ”అందుకు యేసు-పునరుత్ధానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును. బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు”.....(యోహాను 11:25-26) అని చెప్పెను.

నిత్యజీవితం యొక్క వరం మనకందరికీ లభిస్తుంది కానీ దీనికి మనం మన ఐహిక సంతోషాలని విడిచిపెట్టవలిసిన అవసరం మరియు మనల్ని మనం దేవునికి అర్పించుకోవలిసిన అవసరం ఉంది. “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు. కుమారునికే విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచియుండును (యోహాను 3:36). మరణానికి పిమ్మట మన పాపాలకొరకు ప్రాయశ్చిత్తాన్ని పొందే అవకాశం మనకి ఇవ్వబడదు. ఎందుకంటే ఒకసారి మనం దేవుడిని ముఖాముఖీ ఎదురుకున్న తరువాత ఆయనయందు విశ్వాసముంచడం తప్ప మనకి ఏ ఎంపికా ఉండదు. ఇప్పుడు మనం ఆయన్ని విశ్వాసం మరియు ప్రేమయందు సమీపించాలని ఆయన కోరతాడు. దేవుని పట్ల మన పాపపూరితమైన తిరుగుబాటుతనానికి మూల్యం వలె, మనం క్రీస్తు యొక్క మరణాన్ని అంగీకరించితే, మనకి ఈ భూమిమీదన ఒక అర్థవంతమైన జీవితమేకాక క్రీస్తు సమక్షాన్న ఒక నిత్యజీవితం కూడా అనుగ్రహించబడుతుంది.

మీరు కనుక యేసుక్రీస్తుని మీ రక్షకునిగా నమ్మాలనుకుంటే, ఈ క్రింద ఉన్న వాక్యాలని దేవునితో చెప్పండి. ఈ వాక్యాలని చెప్పడంతో అవి మిమ్ము రక్షింపవు గానీ, క్రీస్తుపైన విశ్వాసముంచడం మిమ్ము రక్షిస్తుంది. ఈ ప్రార్థన దేవునియందు మీ విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి మరియు మీ రక్షణకి వీలు కల్పించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తులు అర్పించడానికి ఒక దారి మాత్రమే. “దేవా, నేను నీ పట్ల పాపం చేసేనని మరియు నేను శిక్షకి పాత్రుడనని నాకు తెలుసు. కానీ నా శిక్షని ప్రభువు యేసుక్రీస్తు తీసుకున్నాడు. దాని వల్ల ఆయనయందు ఉన్న విశ్వాసము ద్వారా నేను క్షమింపబడగలను. రక్షణ కొరకు నేను నా విశ్వాసాన్ని నీ మీద పెడుతున్నాను. నీ అద్భుతమైన మహిమ మరియు క్షమాపణ కొరకు కృతజ్ఞతలు- నిత్య జీవితం యొక్క వరం! ఆమెన్ ‍.


Share this post