Skip to Content

మద్యపానము/ ద్రాక్షారసము సేవించుట విషయమై బైబిలు ఏమి చెప్తుంది? క్రైస్తవులు మద్యపానమును/ ద్రాక్షారసము సేవించుట పాపమా?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-alcohol-sin.html

మద్యపానము సేవించుట విషయమై అనేక లేఖనభాగాలున్నయి(లేవీకాండము 10:9; సంఖ్యాకాండము 6:3; ద్వితియోపదేశకాండము 29:6; న్యాయాధిపతులు 13:4, 7, 14; సామేతలు 20:1; 31:4; యెషయా 5:11, 22; 24:9; 28:7; 29:9; 56:12). ఏదిఏమైనప్పటికి లేఖనములు ఓ క్రైస్తవుడ్ని బీరు, ద్రాక్షారసము మద్యమును కలిగిన మరి ఏ ఇతర పానీయములు తాగకూడదని నిషేదించదు. వాస్తవానికి కొన్ని లేఖన భాగాలు మద్యం విషయంలో సానుకూలమైన పదాలుపయోగించింది. ప్రసంగి 9:7 లో ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము. కీర్తన 104:14-15, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును దేవుడే ఆ ద్రాక్షరసమును అనుగ్రహిస్తాడని చెప్తుంది. “సొంత ద్రాక్షతోటనుండి వాటి రసమును త్రాగుట దేవుని ఆశీర్వాదమునకు గుర్తు అని ఆమోసు 9:14 లో చర్చిస్తుంది. యెషయ 55:1 రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి అని ప్రోత్సాహిస్తుంది.

దేవుడు క్రైస్తవులను మద్యము విషయములో ఆఙ్ఞ ఇచ్చునది మత్తులై యుండకూడదని (ఎఫెసీయులకు 5:18). బైబిలు త్రాగుడు దాని పర్యవసానాల్ని ఖండిస్తుంది (సామేతలు 23: 29-35). క్రైస్తవులు తమ శరీరములను ఇతర ఆధిపత్యమునకు అప్పగించకూడదని ఆఙ్ఞాపించబడుచున్నారు(1 కొరింధీయులకు 6:12; 2 పేతురు 2:19). ఎక్కువగా మద్యమును సేవించుట నిర్హేతుకముగా వ్యసనమే. ఇతర క్రైస్తవులను భాధపెట్టకూడదని, హింసించకూడదని, మనస్సాక్షికి వ్యతిరేకంగా పాపాన్ని ప్రోత్సాహించకూడదని బైబిలు లేఖనభాగాలు క్రైస్తవులను ఆటంకపరుస్తుంది (1 కొరింధీయులకు 8:9-13).ఈ నియమముల వెలుగులో ఓ క్రైస్తవుడు మద్యమును అధికముగా సేవించుట ద్వారా దేవునిని మహిమపరుస్తారని అనడం చాలా కష్టం (1కొరింధీయులకు 10:31).

యేసు నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. దీనిని బట్టి యేసయ్య కూడ కొన్ని సంధర్భాలలో ద్రాక్షారసమును సేవించినట్లు అర్థం అవుతుంది (యోహాను 2:1-11; మత్తయి 26:29). నూతన నిబంధనకాలంలో, నీరు పరిశుభ్రంగా కాకుండా కలుషితమై యుండేది. ఆధునిక పారిశుధ్యం లేని దినాలల్లో బాక్టీరియా, వైరస్ మరియు ఇతర కలుషిత పదార్ధాలతో నిండియుండేది. నిమ్న జాతి దేశాలలో ప్రస్తుత పరిస్థితి ఇదే. దీని కారణంగా, ప్రజలు ద్రాక్షారసము సేవిస్తారు. ఎందుకంటే దాంట్లో కాలుష్యం తక్కువగా వుంటాది కాబట్టి. 1 తిమోతి 5:23 లో కడుపు జబ్బు తగ్గించుటకుగాను, నీరుకు బదులు ద్రాక్షారసమును త్రాగమని ఉపదేశించాడు. ఆ రోజులలో ద్రాక్షారసము పులిసినదే (సారా కలిగియుండుట), అయితే ఇప్పుడున్నంత మోతాదులో కాదు. అది కేవలము ద్రాక్షారసమే అన్నది ఎంత తప్పో ఇప్పుడున్నది మద్యముతో సమానమని అనడం కూడా తప్పేఏదిఏమైనప్పటికి క్రైస్తవులు బీరు, ద్రాక్షారసం మద్యం కలిగిన ఇతర ఏ పానీయములను త్రాగకూడదని ఆటంకపరచదు. మద్యం పాపముకాదు. మద్యముతో మత్తులైయుండుట, మద్యమును వ్యసనముగా కలిగియుండుట క్రైస్తవులు ఖచ్చితముగా నిరోధించాలి (ఎఫెసీయులకు 5:18; 1 కొరింథీయులకు 6:12).

మద్యమును తక్కువ మోతాదులో సేవించుట హానికరముకాదు. వ్యసనము కాదు. వాస్తవానికి కొంతమంది వైద్యులు ఆరోగ్యలబ్ధికోసం ముఖ్యంగా హృదయానికి సంభంధమైన విషయంలో తక్కువ మోతాదులో సేవించుట తప్పుకాదని వాదిస్తారు. తక్కువ మోతాదులో మద్యమును సేవించుట క్రైస్తవుల స్వేఛ్చకు సంభంధించినది. మత్తులై యుండుట, వ్యసనము కలిగియుండుట పాపము. ఏది ఏమైనప్పటికి మద్యము దాని పర్యవసానముగురించి బైబిలు కలిగియున్నటువంటి భయాలు. సుళువుగా ఎక్కువ మోతాదులో మద్యము సేవించటాన్ని శోధన, మరియు ఇతరులకు కష్టాన్ని, అడ్డుబండాగామారే అవకాశాలను బట్టి క్రైస్తవులు పరిపూర్ణంగా మద్యమునకు దూరముగా వుండుట మంచిది.


Share this post