Skip to Content

కయీను భార్య ఎవరు? కయీను అతని సహోదరిని భార్యగా చేసుకున్నాడా?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-Cains-wife.html

బైబిలు కయీను భార్య ఎవరో స్పష్టీకరించలేదు. బహూశా కయీను భార్య తన చెల్లిగాని లేక అతని సోదరుని లేక సోదరి కుమార్తె గాని అయివుండాలి. కయీను హేబేలును చంపినప్పుడు కయీను ఏ వయస్సు వాడో బైబిలులో వ్యక్తపరచలేదు (ఆదికాండం 4:8). ఇరువురు పొలములో పని చేసేవారు కాబట్టి ఖచ్చితముగా ఎదిగిన వారై వుండాలి. బహుశా వ్యక్తిగతంగా కుటుంబాలు కూడా కలిగి వుండవచ్చు. హేబేలు చంపబడే సమయానికి ఆదాము హవ్వలు ఇంకా పిల్లల్ని కలిగి ఉండేవుంటారు. వారు ఖచ్చితముగా ఆ తర్వాత వేరే పిల్లల్ని కలిగి వున్నారని (ఆదికాండం 5:4) ప్రస్తావిస్తుంది. సహోదరుని చంపిన తర్వాత కయీను (ఆదికాండం 4:14)భయపడటం అనేది ఆదాము హవ్వలకు ఇతరు పిల్లలు మరియు మనవలు, మనువరాళ్ళు వున్నారని అర్థమౌతుంది. కయీను భార్య ఆదాము హవ్వలకు కుమార్తె లేక మనవరాలు అయివుండాలి.

ఆదాము హవ్వలు (మాత్రమే)తొలి మానవులు కాబట్టి తమ పిల్లలు తోబుట్టువులను వివాహము చేసుకొనుట ఆవశ్యకతమైంది. తోబుట్టువులను వివాహము చేసుకోకూడదు (లేవికాండం 18:6-18) అనే నిబంధన చాలకాలం పలుఅవకాశాలు కల్పించిన తర్వాత దేవుడు విధించడమైనది. దగ్గర సంభంధం కల్గిన వాళ్ళను వివాహము చేసుకోవటాన్నిబట్టి పిల్లలు జన్యుపరమైన పలులోపాలతో జన్మించే అవకాశాలు చాలా ఎక్కువ. రక్త సంబంధం గలవారిమధ్య నిషేధించబడిన వైవాహిక బంధము వలన జన్యుపరమైన లోపాలకు కారణమౌతుంది ఎందుకంటే ఇద్దరు ఒకే జాతికి పోలిన జన్యువులను కల్గి(అంటే అన్న చెల్లి ) వారికి పిల్లలు కలిగినప్పుడు, ఆ పిల్లలలో కొన్ని జన్యు లక్షణాలు అణచివేయబడిన స్థితి బహిర్గంగా కన్పడుతుంది. వేర్వేరు కుటుంబాలనుంచి పిల్లలను వివాహము చేసుకున్నట్లయితే ఇలాంటి లోపాలు కలగటం బహు అరుదు. మానవ జన్యు సంకేతము రాను రాను లోపాలమయమైపోయి ఒక తరమునుండి మరొక తరమునకు వ్యాప్తిచెందుకొంటు వచ్చింది. ఆదాము హవ్వలకు జన్యు పరమైన లోపాలు లేవు కాబట్టి మొదటి తరమువారు ఎంతో ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు కలిగి యున్నారు.


Share this post