Skip to Content

క్రొత్తగా జన్మించిన క్రైస్తవుడంటే అర్థం ఏమిటి?

5 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-born-again.html

క్రొత్తగా జన్మించిన క్రైస్తవుడంటే అర్థం ఏమిటనా? ఈ ప్రశ్నకి ప్రత్యుత్తరం ఇచ్చే ప్రామాణికమైన వచనం బైబిల్లో యోహాను 3:1-21 లో ఉంది. ప్రభువు యేసుక్రీస్తు ఒక ప్రఖ్యాతి పొందిన పరిసయ్యుడు మరియు సన్హెద్రిన్ ( యూదుల అధికారి) యొక్క సభ్యుడు అయిన నికొదేముతో మాట్లాడుతున్నాడు. ఆ రాత్రి నికొదేము యేసు వద్దకి వచ్చేడు. యేసుని అడగడానికి అతని వద్ద ప్రశ్నలు ఉన్నాయి.

యేసు నికొదేముతో మాట్లాడినప్పుడు “ నేను నీకు సత్యాన్ని చెప్తాను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడనేరడని” ఆయన చెప్పేడు. అందుకు నికొదేము- ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్భమున ప్రవేశించి జన్మింపగలడా? అని ఆయనను అడుగగా! యేసు ఇట్లనెను-ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరమూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు (యోహాను 3:3-7).

క్రొత్తగా జన్మించుట” అన్న పదబంధానికి భాషాంతరంగా “ పైనుండి జన్మించుట” అని అర్థం. నికొదేముకి ఒక సహజమైన అవసరం ఉంది. అతనికి తన హృదయంలో ఒక ఆధ్యాత్మిక రూపాంతరం చెందే ఒక మార్పు యొక్క అవసరం ఉంది. నూతన జన్మ- క్రొత్తగా జన్మించడం అన్నది విశ్వసించే వ్యక్తికి నిత్యజీవితం అనుగ్రహింపబడే దేవుని చర్య ( 2 కొరింధీయులు 5:17; తీతుకు 3:5; 1 పేతురు 1:3; 1 యోహాను 2:29; 3:9; 4:7 ; 5:1-4; 18). “క్రొత్తగా జన్మించుట” యేసు క్రీస్తు నామమున ఉన్న విశ్వాసము మూలముగ “దేవుని బిడ్డలయే” భావాన్ని కూడా వ్యక్తపరుస్తుందని యోహాను 1:12,13 సూచిస్తుంది.

“ ఒక వ్యక్తికి క్రొత్తగా జన్మించే అవసరం ఏమిటుంది” అన్న ప్రశ్న తార్కికంగా తలెత్తుతుంది. “ మీ అపరాధములచేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రతికించెను” అని ఎఫసీయులు 2:1 లో అపొస్తలు పౌలు చెప్పెను. రోమీయులు 3:23 లో అపొస్తలు రోమీయులకి “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోందలేక పోవుచున్నారు” అని రాసెను. కావున తమ పాపాలు క్షమించబడటానికి మరియు దేవునితో ఒక సంబంధం ఉండే నిమిత్తము ఒక వ్యక్తికి క్రొత్తగా జన్మించే అవసరం ఉంది.

కావున అదెలా అయింది? “మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలులేదు” అని ఎఫసీయులు 2:8-9 చెప్పును. ఎవరైనా రక్షింపబడినప్పుడు అతను/ఆమె క్రొత్తగా జన్మించి ఆధ్యాత్మికంగా నూతన సృష్టి అయి క్రొత్తజన్మ హక్కు కొద్దీ ఇప్పుడు దేవుని బిడ్డ అవతాడు/అవుతుంది. ఆయన శిలువమీదన మరణించినప్పుడు యేసుక్రీస్తునందు నమ్మకంతో పాపానికి దండనని చెల్లించిన వ్యక్తే ఆధ్యాత్మికంగా “ క్రొత్తగా జన్మించినవాడని అర్థం. “కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను. ఇదిగో క్రొత్తవాయెను( కొరింథీయులు 5:17). ప్రభువు యేసుక్రీస్తు మీ రక్షకుడని మీరు ఎప్పుడూ నమ్మకపోతే పరిశుద్ధాత్మ మీ హృదయంతో మాట్లాడినప్పుడు ఆయన్ని ప్రేరేపించడాన్ని మీరు పరిగణిస్తారా? మీకు క్రొత్తగా జన్మించవలిసిన అవసరం ఉంది.

మీరు మారుమనస్సు యొక్క ప్రార్థన చేసి ఈ కాలమందు క్రీస్తునందలి క్రొత్త సృష్టి అవతారా? “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారేగాని రక్తమువలనైనను శరీరేచ్ఛలవలనైనను మానుషేచ్ఛలవలనైనను పుట్టినవారు కారు. మీరు కనుక యేసుక్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించాలనుకొని క్రొత్తగా జన్మిస్తే ఇక్కడ ఒక మచ్చు ప్రార్థన ఉంది. ఈ ప్రార్థనని కానీ ఇంకే ప్రార్థనని కానీ పలికినందు వల్ల మీరు రక్షింపబడరు. క్రీస్తు మీదన నమ్మకాన్ని పెట్టడం మాత్రమే మిమ్మల్ని పాపం నుండి రక్షించేది. ఈ ప్రార్థన దేవుని పట్ల మీ విశ్వాసాన్ని వ్యక్తపరిచే ఒక మార్గం మాత్రమే మరియు మీ రక్షణకి దోహదపడినందుకు మీరు ఆయనకి “దేవా, నీ పట్ల నేను పాపం చేసేనని నాకు తెలుసు. మరియు నేను శిక్షకి పాత్రుడను. ఆయనయందు విశ్వాసం వల్ల నేను క్షమింపబడటానికి యేసుక్రీస్తు నా శిక్షని భరించేడు. రక్షణ కొరకు నేను నా విశ్వాసాన్ని నీమీదన ఉంచుతాను. నీ అద్భుతమైన మహిమ మరియు క్షమాపణ కొరకు కృతజ్ఞతలు- నిత్య జీవితం యొక్క బహుమానం. అమేన్‌.


Share this post