Skip to Content

క్రీస్తు దైవత్వము లేఖనానుసారమా?

16 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-deity-of-Christ.html

యేసు తన గురించి చేసుకొన్న ఖచ్చితమైన సవాళ్ళతోపాటు శిష్యులు కూడ క్రీస్తుని దేవత్వమును అంగీకరించారు. యేసు మాత్రమే పాపములు క్షమించుటకు అధికారము కలవాడని వారు సవాలు చేసారు. అది దేవునికి మాత్రమే సాధ్యం (అపోస్తలుల కార్యములు 5:31; కొలస్సీయులకు 3:13; కీర్తన 130:4; యిర్మియా 31:34). ఎందుకంటే పాపంచేత నొప్పింపబడినవాడు దేవుడు కాబట్టి. దీనికి అనుభంధమైన మరొక సవాలు యేసు సజీవులకును మృతులకును తీర్పు తీర్చువాడు “దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు” క్రీస్తుయేసు యెదుటను (2 తిమోతి 4:1). తోమా “నా దేవా నా దేవా” అని యేసుతో అనెను (యోహాను 20:28). పౌలు యేసయ్యను గొప్ప “దేవుడుగా, రక్షకుడుగా” (తీతుకు 2:13) అని పిలవటమే కాకుండా క్రీస్తు అవతరించకమునుపు “దేవుడు స్వరూపియైయున్నాడని” సూచించెను (ఫిలిప్పీయులకు 2:5-8). తండ్రియైన దేవుడు యేసయ్యను గురించి చెప్పినది “దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచునది” (హెబ్రీయులకు 1:8).యోహాను భక్తుడు “ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము (యేసు) దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను” (యోహాను 1:1). క్రీస్తు దైవత్వమును భోధించేవి అనేకమైన లేఖనాలున్నవి (ప్రకటన 1:17; 2:8;22:13; 1 కొరింథి10:4; 1 పేతురు 2:6-8; కీర్తన 18:2; 95:1; 1 పేతురు 5:4; హెబ్రీయులకు 13:20), ఆయన శిష్యులు క్రీస్తును దేవుడుగా గుర్తించారనటానికి ఈ వచనాలలో ఏ ఒక్కటియైన సరిపోతుంది.

పాతనిబంధనలో యెహోవాకు (దేవుని నామం) మాత్రమే వర్తించేటటువంటి బిరుదులు యేసయ్యకు ఇచ్చారు. పాతనిబంధనలో “విమోచకుడు” (కీర్తన 130:7; హోషేయా 13:14). క్రొత్తనిబంధనలో యేసయ్యకు ఉపయోగించారు (తీతుకు 2:13; ప్రకటన 5:9). యేసయ్యకు ఇమ్మానుయేలు “దేవుడు మనతో” నున్నాడు (మత్తయి 1) అని పిలిచారు. జెకర్యా 12:10లో “వారు తాము పొడిచిన వానిమీద దృష్టియుంచి,” యెహోవా దేవుడు చెప్పిన దానినే క్రొత్తనిబంధనలో సిలువపై మరణించిన క్రీస్తుకు ఆపాదించారు ( యోహాను 19:37;ప్రకటన 1:7). ఒకవేళ పొడిచి దృష్టియుంచినది యెహోవామీద అయితే దానిని యేసుకు ఆపాదించినట్లయితే పౌలు యెషయ్యా 45:23 కు భాష్యం చెప్పుతూ దాన్ని ఫిలిప్పి 2:10,11 క్రీస్తుకు ఆపాదించారు. అంతేకాకుండా ప్రార్థనలో క్రీస్తునామాన్ని, దేవుని నామానికి జోడించెను, “తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపకలుగునుగాక” (గలతీయులకు 1;3; ఎ ఫెస్సీయులకు 1:2). ఒకవేళ క్రీస్తు దైవత్వంకానియెడల ఇది దేవ దూషణ అయివుండేది. యేసయ్య సర్వలోకమునకు సువార్తనందించి బాప్తిస్మము ద్వారా శిష్యులుగా చేయమన్న ఆఙ్ఞలో క్రీస్తునామము తండ్రి నామముతో అగపడుతుంది (మత్తయి 28:19; 2 కొరింధి 13:14).

దేవునికి మాత్రమే సాధ్యమయ్యే పనులను యేసయ్యకు వర్తించారు. యేసయ్య చనిపోయినవారిని లేపటమే కాకుండా (యోహాను 5:21;11:38-44), పాపములు క్షమించాడు (అపొస్తలుల కార్యములు 5:31; 13:38), విశ్వాన్ని సృజించి దానిని కొనసాగించాడు (యోహాను 1:2; కొలస్సీయులకు 1:16,17). యెహోవా ఒక్కడే విశ్వాన్ని సృజించాడు అన్న మాటలు గ్రహించటం ద్వారా ఇది ఇంకను స్పష్టమౌతుంది (యెషయ 44:24).అంతేకాకుండా కేవలము దేవునికి మాత్రమే వర్తించిన గుణగణాలు క్రీస్తు కలిగియున్నాడు. నిత్యుడు (యోహాను 8:58), సర్వఙ్ఞాని (మత్తయి 16:21), సర్వవ్యామి (మత్తయి 18:20; 28:20)మరియు సర్వశక్తుడు (యోహాను 11:38-44).

తాను దేవుడనని చెప్పుకొంటూ ఇతరులను మోసపూరితంగా నమ్మించటం ఒక ఎత్తైతే, దాని ఋజువు పర్చడం మరో ఎత్తు, ఇంకా దాని ధృవీకరించి, ఋజువుపర్చడం మరొకటి. క్రీస్తు తానే దేవుడనని ఋజువు పర్చటానికి అనేక సూచక క్రియలు చేసాడు. క్రీస్తు నీటిని ద్రాక్షారసముగా మార్చడం (యోహాను 2:7), నీళ్ళమీద నడవడం (మత్తయి 14:25), ఐదు రొట్టెలు రెండు వేలమందికి పంచి పెట్టడం (యోహాను 6:11), గ్రుడ్డివారిని స్వస్థపరచడం (యోహాను 9:7), కుంటివారిని నడపించడం (మార్కు 2:3), రోగులను స్వస్థపరచడం (మత్తయి 9:35:మార్కు 1:40-42), చనిపోయినవారిని సహితము తిరిగి లేపడం (యోహాను 11:43-44);లూకా 7:11-15) యేసయ్య చేసిన సూచక క్రియలలో ఇవి కొన్ని మాత్రమే. అంతేకాకుండా, క్రీస్తు మరణంనుంచి తానే పునరుత్ధాడయ్యాడు. మరణంనుండి తిరిగిలేవడం అనేది అన్య పురాణాలలో నున్నప్పటికి ఏ మతముకూడా పునరుత్ధానాన్ని ఆపాదించుకోలేకపోయింది. అంతేకాకూండా మరి దేనికికూడా లేఖనమునకు అతీతంగా ఇన్ని నిడర్శనాలు , ఋజువులు లేవు.

క్రైస్తవేతర పండితులు సహా యేసుక్రీస్తును అంగీకరించగల పన్నెండు వాస్తవాలు.

1). యేసు సిలువపై మరణించాడు.

2). ఆయన సమాధి చేయబడ్డాడు.

3). ఆయన మరణము శిష్యులను నిరాశ, నిస్పృహలకు కారణం మయ్యింది.

4). యేస్యు సమాధి కొన్ని దినాల తర్వాత ఖాళీగా వున్నట్లు కనిపెట్టబడింది.

5). యేసయ్య శిష్యులు, పునరుత్ధానుడైన యేసును చూసిన అనుభవాన్ని నమ్మారు.

6). అనుభవంతర్వాత అనుమానించిన శిష్యులు ధైర్యముకలిగిన విశ్వాసులుఅయ్యారు.

7). ఆది సంఘభోధనలో ఈ వర్తమానం మూలాంశమైయున్నది.

8). ఈ వర్తమానం యెరూషలేంలో భోధించారు.

9). ఈ భోధనకు ఫలితమే సంఘం ప్రారంభమై ఎదిగింది.

10). సబ్బాతు (శనివారం) కు బదులుగా పునరుత్ధానదినం (ఆదివారం) ఆరాధనకు ప్రాముఖ్యమైనదినముగా మారింది.

11). అనుమానుస్ధుడుగా గుర్తింపుపొందిన యాకోబు మార్పు చెంది,పునరుత్ధానుడైన క్రీస్తును చూచినట్లు నమ్మాడు.

12). క్రైస్తవత్వానికి శత్రువుడైన పౌలు పునరుత్ధానుడైన క్రీస్తు ప్రత్యక్షతనుబట్టి మార్పు చెందినట్లుగా నమ్మాడు.

పునరుత్ధానాన్ని ఋజువుచేస్తూ సువార్తను స్థాపించగలిగితే పైన పేర్కొన్నవాటి విషయం పై వచ్చిన ఏ అనుమానాన్ననైనా నివృత్తిచేయవచ్చు.యేసు మరణం, సమాధి, పునరుత్ధానం, మరియు ఆయన కనపడటం (1కొరింధి 15:1-5). పైన పేర్కొన్న వాటిని వివరించటానికి కొన్ని సిధ్ధాంతాలు వున్నప్పటికి వాటికి సమర్థవంతంగా వివరణ ఇవ్వగలిగేది పునరుత్ధానము మాత్రమే. క్రీస్తుని శిష్యులు పునరుత్ధానమును సహితం తాము చూసారని చెప్పుకున్నారని విమర్శకులు కూడా ఒప్పుకున్నారు. భ్రమ, అబద్డములకు సాధ్యముకాని మార్పు పునరుత్ధానమునకు మాత్రమే సాధ్యమయింది. మొదటిదిగా, వారు లబ్ధి పొందింది ఏంటి? డబ్బు సంపాదించుకోడానికి క్రైస్తవత్వం ప్రభావితమైంది కాదు. రెండవది, అబద్దికులు హతసాక్షులవ్వలేరు. తమ విశ్వాసంకోసం, క్రూరమైన మరణం సహితం శిష్యులు అంగీకరించటానికి పునరుత్ధానము సరైన వివరణ. తాము నిజమను కొనే అబద్దానికోసం చనిపోయేవారు ఎందరో వుండవచ్చు గాని తాను అబద్దం అనుకోడానికికోసం చనిపోయే వారెవ్వరుండరు.

ముగింపులో క్రీస్తు తానే యెహోవా అని చెప్పుకున్నాడు (ఒక “దేవుడు” కాదు, ఒకే ఒక్క దేవుడు). ఆయన అనుచరులు (విగ్రహారాధనంటే భయపడే యూదులు) ఆయనను దేవునిగా నమ్మారు, గుర్తించారు. క్రీస్తు తన దైవత్వాన్ని ఋజువుపరచుకోడానికి అనేక సూచక క్రియలు చేశారు. పునరుత్ధానుడైనాడు అన్నది అన్నిటికి మించినది, ప్రపంచాన్నే తలక్రిందులు చేసినటువంటి ఋజువు. మరి ఏ సిధ్దాంతము కూడ ఈ వాస్తవాలకు సరియైన వివరణ ఇవ్వలేదు. బైబిలు ప్రకారము క్రీస్తే దేవుడు.


Share this post