- Author: Christian Tracts
- Category: Articles
- Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-Christian-tithing.html
చాలామంది క్రైస్తవత్వం దశమభాగం ఇవ్వటం గురించి సతమవుతారు. కొన్ని సంఘాలలో దశమభాగం ఇవ్వటం గురించి ఎక్కువ భోధిస్తారు. కొంతమంది క్రైస్తవులు, ప్రభువుకు అర్పించుటమనే బైబిలు హెచ్చరికకు విధేయత చూపించరు. చందా ఇవ్వటం అనేది సంతోషాన్ని అశీర్వాదాన్ని కలిగించడానికి ఉద్దేశించబడింది. అయితే భాధాకరమైన విషయం ఏంటంటే సంతోషాన్ని నేడు సంఘాల్లలో కనబడుట లేదు. అది అరుదైపోయింది.
దశమభాగం ఇవ్వటం పాత నిబంధన అంశం. ధర్మశాస్త్రప్రకారము ఇశ్రాయేలీయులు చందాచెల్లించుట విషయంలో తమ రాబడి అంతటిలో దశమభాగాన్ని దేవాలయమునకు గాని ప్రత్యక్షగుడారమునకుగాని ఇవ్వాలి (లేవీకాండం 27:30; సంఖ్యాకాండం 18:26; ద్వితియోపదేశకాండం 14:24; 2 దినవృత్తాంతాలు 31:5). వాస్తవానికి పాత నిబంధన ధర్మశాస్త్రము ప్రకారము ఇవ్వటం అనేది పలు స్థాయిలలో యుండేది. కాబట్టి దాని మొత్తం 23.3 శాతంవుండేది. కాని చాలమంది అనుకున్నట్లు 10శాతం కాదు. కొంతమంది అవగాహన ప్రకారము పాతనిబంధనలోని దశమభాగము సుంకం చెల్లించుట వంటిదని యాజకులు, లేవీయులు బలులు అర్పించుటానికి వుపయోగించబడేదని అనుకుంటారు. క్రొత్తనిబంధన ఎక్కడ ధర్మశాస్త్రపరమైన దశమభాగము అనే పద్దతిని తలవొగ్గాలని అఙ్ఞ ఇవ్వదు, ఆదేశించదు. విశ్వాసులు తమ రాబడిలోని కొంత చందాన్ని సంఘాభివృధ్దికి ప్రక్కన పెట్టాలని పౌలు చందా ఇవ్వటం ఆదేశించారు (1 కొరింథీ 16:1-2).
క్రొత్త నిబంధనలో ఎక్కడకూడా తన కొచ్చేరాబడిలో (1 కొరింథీ 16:2).ఎంత శాతం ఇవ్వాలో స్పష్టీకరణము చేయలేదు గాని వర్ధిల్లినకొలది అని పేర్కొనబడింది. కొన్ని క్రైస్తవ సంఘాలలో అయితే పాత నిబంధనలో పేర్కొన్నదశమభాగాన్ని, క్రైస్తవులు కనీసం ఇవ్వాల్సిన చందాగా వర్తించారు. క్రొత్తనిబంధన ఇవ్వటం అనే అంశంయొక్క ప్రాధాన్యతను, ప్రయోగాలను మాత్రమే పేర్కొన్నది. తనకు ఎంత సాధ్యమయితే అంత ఇవ్వటం నేర్చుకోవాలి. కొన్ని సార్లు దశమభాగము కంటే ఎక్కువకావచ్చు లేక తక్కువకావచ్చు. ఓ క్రైస్తవుని సామర్ధ్యతలమీద సంఘ అవసరతలమీద ఆధారపడుతుంది. ప్రతీ క్రైస్తవుడు కూడా ప్రార్థనచేసి దేవుని ఙ్ఞానాన్ని బట్టి ఎంత చందా ఇవ్వాలో తెలిసికోవాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంలో చందా ఇవ్వటం అనేది మంచి వుద్దేశ్యంతో దేవునిపట్ల ఆరాధన వైఖరితో క్రీస్తు సంఘం యొక్క సేవా దృక్పధముతో వుండాలి (1 కొరింథీ 9:7).